బ్లాగింగ్ కోర్సు నేర్చుకునేందుకు సులువైన ప్లాట్ ఫాం ‘డిజిటల్ బడి’

బ్లాగింగ్ కోర్సు నేర్చుకునేందుకు సులువైన ప్లాట్ ఫాం ‘డిజిటల్ బడి’

Digital Badi Blogging Course Review by Raj Kumar student

బ్లాగింగ్ ఒడి

Digital Badi Blogging Course Review by Raj Kumar student

 

బ్లాగ‌ర్ ప‌రిచ‌యం

హాయ్ ఫ్రెండ్స్,  నాపేరు రాజ్ కుమార్ జూలూరి. నేను మీతో కొన్ని విషయాలను షేర్ చేసుకోవాలని ఈ ఆర్టికల్ రాస్తున్నాను.
కొంచెం ఓపిక చేసుకొని ఈ ఆర్టికల్ పూర్తిగా చదువుతారని భావిస్తున్నాను. ఇక అసలు విషయానికొస్తే.. అవునండీ.. బ్లాగింగ్ కోర్సు నేర్చుకోవడం ఇక చాలా సులువు. ‘డిజిటల్ బడి’లో బ్లాగింగ్ కోర్సు నేర్చుకోవడం అంటే అమ్మ బడిలో తొలి పలుకులు నేర్చుకున్నంత సులువుగా ఇక్కడ బ్లాగింగ్ కోర్సు అలవోకగా నేర్చుకోవచ్చు. ఈ కోర్సు మెంటర్(డిజిటల్ జాన్) అందించే సహకారం, తోడ్పాటు ఈ కోర్సు కంప్లీట్ చేయడానికి చాలా దోహదపడుతాయి.

Digital Marketing Course in Telugu - Digital Badi Academy

ఇక్కడే ఎందుకు నేర్చుకోవాలి..?

ఇంగ్లీష్, హిందీలో బ్లాగింగ్ కోర్సు నేర్పించేందుకు మార్కెట్లో రెడీగా ఉన్నారు. అయితే తెలుగులో బ్లాగింగ్ కోర్సు నేర్చించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులోనూ మనకు అర్థమయ్యే రీతిలో బ్లాగింగ్ కోర్సు చెప్పడం, తీర్చదిద్దడమేనేది కత్తిమీద సాము వంటిదే. కానీ డిజిటల్ జాన్ చాలా సులువుగా అన్ని అంశాలను అర్థమయ్యేలా బోధిస్తారు. కోర్సు కొన్న దగ్గర నుంచి మన వెన్నంటి ప్రోత్సహించేవారు చాలా అరుదుగా ఉంటారు. నేను అందరిలానే డిజిటల్ బడిలో ఎన్నో అనుమానాల మధ్యనే పేయిడ్ బ్లాగింగ్ కోర్సును కొన్నాను. అయితే నా అనుమానాలన్ని కొన్ని రోజుల్లోనే పటాపంచాలయ్యాయి. డిజిటల్ జాన్ అందించే సహకారంతో చాలా సులువుగా కోర్సు కంప్లీట్ చేసుకున్నాను.

నా పర్సనల్ ఎక్సిపిరియన్స్ మీకోసం..

నేను వృత్తి రీత్య ఒక జర్నలిస్టును. నాకు కొంత రైటింగ్ స్కిల్స్‌ తెలుసు. అప్పుడప్పుడు యూట్యూబ్లో బ్లాగింగ్ కి సంబంధించిన వీడియో చూస్తుండే వాడేని. మొదట ఇంగ్లీష్, తర్వాత హిందీలో బ్లాగింగ్ వీడియో చూసేవాడినే. కానీ ఎందుకో తెలుగులో ఎవరైనా బ్లాగింగ్ వీడియో చేస్తే బాగుండు అనేపించేది. ఓ రోజు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటే అప్పుడు పరిచమయింది నాకొక పేరు.. అదే డిజిటల్ జాన్.

డిజిటల్ జాన్ పేరు తెగ్గట్టే జంటిల్మెన్. మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉన్నవాడు. ఇతను మన మాతృభాషలో బ్లాగింగ్ కోర్సు గురించి వివరిస్తుంటే చాలా సులువుగా అర్థమయ్యేది. మొదటి డిజిటల్ జాన్ యూట్యూబ్ వీడియో చూసి కొంత బ్లాగింగ్ కోర్సు నేర్చుకున్నాను. ఆ తర్వాత డిజిటల్ జాన్ అందించే ఫ్రీ కోర్సులో ఎన్‌రోల్‌ అవడం ద్వారా బ్లాగింగ్ పై ఇంకొంత అవగాహన పెరిగింది. బ్లాగింగ్ పూర్తిగా నేర్చుకోవడం ద్వారా నా స్కిల్స్ ను పెంచుకోవడంతోపాటు కొంత సంపాదించాలనే ఉద్దేశ్యంతో డిజిటల్ జాన్ అందిస్తున్న పెయిడ్ కోర్సును పర్చేస్ చేశాను.

ఈ కోర్సు కొనడం ద్వారానే మన పని అయిపోయింది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ కోర్సులో ఉన్న ప్రతి అంశాన్ని తూచ తప్పకుండా పాటిస్తేనే మీరు బ్లాగింగ్ పై పట్టు సాధించగలుగుతారు.

డిజిటల్ జాన్ సహకారం..

ఇందుకోసం మనకు డిజిటల్ జాన్ అందించే సహకారం అంతాఇంతా కాదు. డిజిటల్ జాన్ బెంగళూరులో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ గా పని చేస్తుంటారు. తాను ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తెలుగులో మంచి బ్లాగింగ్ మార్కెటింగ్ డెవలప్ చేయాలనే ఉద్దేశ్యంతో డిజిటల్ బడిని స్థాపించి అందులో వివిధ రకాలైన కోర్సులను అందిస్తున్నారు. ఇందులో మీ అభిరుచికి తగినట్టు బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి పలు కోర్సులను అందిస్తున్నారు. ఈ కోర్సులో మనకు వచ్చే సందేహాలను తనకు వాట్సప్ ద్వారా మేసేజ్ చేస్తే చూసిన వెంటనే రిప్లయ్ ఇవ్వడం, అవసరమైతే తనే మనకు కాల్ చేసి మన సందేహాన్ని నివృత్తి చేస్తారు. ఈ రోజుల్లో కోర్సు కోనగానే వీడియో చూసి నేర్చుకోండి.. అనే వాళ్లేగానీ పూర్తి సహకారం అందించే వాళ్లు తక్కువయ్యారు. కానీ మన జాన్ అలాంటి వాడు కాదు. తనకు తెలిసిన విషయాలను నలుగురికి పంచి తెలుగులోనూ కంటెంట్ రైటర్స్, బ్లాగింగ్ కి మంచి డిమాండ్ రావాలనే మంచి ఆశయంతో ముందుకెళుతున్నాడు. అందుకు తగ్గట్టుగానే తన వద్ద కోర్సు కొన్నవారికి తన సహకారాన్ని ఎల్లప్పుడు అందిస్తుంటాడు.

ముగింపు

ఇక నా కోర్సు జూన్ నాటికి పూర్తి అవుతుంది. ప్ర‌తి నెల‌ మరో కొత్త బ్యాచ్ ప్రారంభం కానుంది. నా పర్సనల్ ఎక్సిపియన్సెస్ ద్వారా గమనించిన విషయాలతో నేను ఒకటే చెప్పదలుకున్న. రానున్న రోజుల్లో తెలుగు బ్లాగింగ్ కోర్సు నేర్చుకున్న వారికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండబోతుంది. మీరు ఆలస్యం చేయకుండా ఈ కోర్సులో జాయిన్ అయి త్వరగా బ్లాగింగ్ స్టార్ చేసినట్లయితే ఆరు నెలల నుంచి ఒక సంత్సరంలోపు మీ బ్లాగింగ్ ద్వారా మీకు కొంత మనీ సంపాదించగలుగుతారు. మీరు కేవలం బ్లాగింగ్ ద్వారా మనీ సంపాదించాలని కాకుండా ఓ ప్యాషన్ తో బ్లాగింగ్ చేసినట్లయితే మీలోని స్కిల్ ఇంప్రువ్ అవడంతోపాటు ఇంటి వద్ద కూర్చోనే పెద్ద మొత్తంలో ఆర్జించవచ్చు.

Buy Telugu Blogging Course from Digital Badi

అంతేకానీ మీరు బ్లాగ్ ప్రారంభించిన వెంటనే మనీ రావాలంటే మాత్రం రాదు. మీరు ఈ కోర్సులో నేర్చుకున్నది తూచ తప్పకుండా పాటిస్తూ కొంత ఓపిక పట్టినట్లయితే తప్పకుండా మీరు బ్లాగింగ్ ద్వారా సంపాదించుకోవచ్చు. ఈ కోర్సు నేర్చుకోవడం ద్వారా పలు ప్రముఖ సంస్థలో ఇంటర్న్ షిప్, ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉంది. చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారనే ఆశిస్తున్నా.. ఇక నిర్ణయించుకోవాల్సిందే మీరే.. ఈ కోర్సులో చేరేవారికి నా శుభాభినందనలు..

బ్లాగింగ్ కోర్సు ద్వారా నేను నిర్మిస్తున్న న్యూస్ ద‌ర్బార్ బ్లాగ్ (News Blog) ఇదే.

Telugu Digital Marketing Course

Blogging Articles in Telugu

బ్లాగింగ్ ద్వారా సంపాదించడానికి 4 ఉత్త‌మ‌ మార్గాలు

బ్లాగింగ్ ద్వారా మీరు నేర్చుకునే 5 టాప్‌ స్కిల్స్ ఏంటి?

ఉద‌య్ తాటి ఇస్తున్న బ్లాగింగ్ కోర్సు రివ్యూ

Written by
Digital John

Digital John

Digital John is digital marketing and content marketing practitioner, trainer, blogger, YouTuber with qualified Management education in Marketing Specialisation from Vanguard B-School. He won Best Digital Marketing Blogger in India Award in 2018 from Feedspot.