హైదరాబాద్ లో నవంబర్ 23వ తారీఖున జరిగిన డిజిటల్ మార్కెటింగ్ సమ్మిట్ విశేషాలు మీ కోసం……..
డిజిటల్ మార్కెటింగ్ సమ్మిట్ అద్భుతంగా జరిగింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సమ్మిట్ వచ్చిన వారు స్వచ్ఛందంగా వారి అనుభూతిని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
సమ్మిట్ ని నిర్వహించిన చక్రపాణి సార్ కి మరియు సమ్మిట్ ని చాలా చక్కగా ముందుకు నడిపించి ప్రోత్సహించిన రాజ్ మీస సార్ కి నా కృతజ్ఞతలు.
ఉదయం
ఉదయం 10 గంటలకు రెజిస్ట్రేషన్స్ తో ప్రారంభమైంది.
కొంత సేపు నెట్వర్కింగ్ కోసం సమయం ఇవ్వడం తో కొత్త వారిని పరిచయం చేసుకున్నాము. రాజ్ మీస సార్ సమ్మిట్ ప్రారంభం నుండి ముగింపు వరకు చాలా ఉత్సాహంగా తీసుకెళ్లాడు.
ఉదయం ముగ్గురు స్పీకర్స్ తమకు కేటాయించిన టాపిక్స్ పై మాట్లాడారు. స్పీకర్స్ మాట్లాడిన తరువాత వచ్చిన వాళ్ళు అడిగిన ప్రశ్నలను నివృత్తి చేశారు.
మధ్యాహ్నం
మధ్యాహ్నం బిజినెస్ గ్రోత్ ఛాలెంజెస్ గురించి కొంత సేపు డిస్కషన్ జరిగింది.
లంచ్ తర్వాత మార్కెటింగ్ క్విజ్ ని రాజ్ మీస సార్ తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా క్విజ్ జవాబులను తీసుకుంటూ ఆడియన్స్ తో మాట్లాడారు. మార్కెటింగ్ క్విజ్ లో ఇంచుమించు అందరు పాల్గొన్నారు.
మార్కెటింగ్ క్విజ్ తర్వాత డిజిటల్ జాన్ కంటెంట్ మార్కెటింగ్ పై మాట్లాడారు. ఆ తరువాత శిబరాం మిశ్రా స్మార్కెటింగ్ పై మాట్లాడారు.
తదనంతరం ప్యానల్ డిస్కషన్ జరిగింది.
ఆ తరువాత మళ్ళీ నెట్వర్కింగ్ ద్వారా కొంత మందిని కలుసుకొని సంభాషించాము. అంతా అయిపోయిన తరువాత డిజిటల్ జాన్ కొంత సేపు లైవ్ కూడా వెళ్ళాడు. మీరు ఆ వీడియో కింద చూడొచ్చు.
సమ్మిట్ ని నిర్వహించిన చక్రపాణి సార్ కి మరియుసమ్మిట్ ని చాలా చక్కగా ముందుకు నడిపించి ప్రోత్సహించిన రాజ్ మీస సార్ కి నా కృతజ్ఞతలు.
డిజిటల్ జాన్ ప్రెసెంటేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
