ముందుగా, యీ మీట‌ప్‌కి ప్ర‌ధాన కార‌కుడైన ర‌వికాంత్ అన్న‌కు మా కృత‌జ్ఞ‌త‌లు
ఫేస్‌బుక్ క‌మ్యూనిటీ స‌ర్కిల్స్ (CLC) – హైద‌రాబాద్‌
ఈ మీటప్ అధికారికంగా ఫేస్‌బుక్‌యే క‌మ్యూనిటీ లీడ‌ర్స్ కోసం ఫిబ్ర‌వ‌రి 24న‌ హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన మొట్ట‌మొద‌టి మీట‌ప్‌. మొద‌టి మీట‌ప్‌లో పాల్గొనే అవ‌కాశం నాకు మా గ్రూప్ అడ్మిన్‌కు ద‌క్కినందుకు చాలా సంతోషంగా ఉంది. హైద‌రాబాద్ క‌మ్యూనిటీ లీడ‌ర్స్ అంద‌రు లోక‌ల్ గ్రూప్ (CLC) అడ్మిన్ ద్వారా ఆహ్వ‌నించ‌బ‌డ్డారు.
Featured post on IndiBlogger, the biggest community of Indian Bloggers
ఈ మీట‌ప్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, లోక‌ల్ క‌మ్యూనిటీ లీడ‌ర్స్ వ్య‌క్తిగ‌తంగా క‌లుసుకొని వారికున్న నాలెడ్జ్‌ని ఇత‌ర క‌మ్యూనిటీ లీడ‌ర్స్‌తో పంచుకొని నెట్‌వ‌ర్క్‌ని వృద్ధి చేసుకోవ‌డానికి.
ఈ యీవెంట్ జోనాత‌న్స్ కిచెన్, గ‌చ్చిబౌలిలో జ‌రిగింది.
లోక‌ల్ క‌మ్యూనిటీ లీడ‌ర్స్ ప‌రిచ‌యాల‌తో మీట‌ప్ మొద‌లైంది. వారు ఎందుకు క‌మ్యూనిటీని ప్రారంభించారు, త‌ద్వారా వారు స‌మాజానికి చేస్తున్న సేవ‌ను వాటి ప్ర‌భావాన్ని వివ‌రించారు. ఒక్కో క‌మ్యూనిటీకి ఒక్కో ప్ర‌త్యేక‌త‌.
మీట‌ప్‌కి ఇద్ద‌రు అద్భుత‌మైన స్పీక‌ర్స్ విలువైన టిప్స్ ఇచ్చారు. మొద‌ట విజ‌య్ మ‌రూర్ సార్ క‌మ్యూనిటీ నిర్మాణం మ‌రియు అడ్మిన్ బాధ్య‌త‌లు అనే టాపిక్‌పై మాట్లాడారు. క‌మ్యూనిటీని ఎలా న‌డిపించాలి, ఎటువంటి పోస్టుల‌ను క‌మ్యూనిటీలో పెట్టాలి, ఎటువంటి పోస్టుల‌ను పెట్ట‌కూడ‌దు అని క్లుప్తంగా వివ‌రించారు. వారి ఫేస్‌బుక్ అనుభ‌వం అపారం.
ఆ త‌రువాత డాక్ట‌ర్ మ‌ని ప‌విత్ర గారు త‌న‌దైన శైలిలో “Energy Management in Day-to-Day life” అనే టాపిక్‌పై ప‌రిశోధ‌నాత్మ‌క వివ‌రాల‌ను మా ముందుంచారు. అస‌లు యీ టాపిక్ మాకు పూర్తిగా క్రొత్త‌ది. డాక్ట‌ర్ గారు కొన్ని వ‌ర్క‌వుట్‌లు కూడా చేయించారు మాకు.
హైద‌రాబ‌ద్ డిజిట‌ల్ మార్కెటింగ్ గ్రూప్ అడ్మిన్స్‌కి (డిజిట‌ల్ జాన్ మ‌రియు రోనీ సామ్యేల్‌) కూడా గ్రూప్‌ని ప‌రిచ‌యం చేసి గ్రూప్‌ని ఎందుకు ప్రారంభించాం అని వివ‌రించ‌డానికి అవ‌కాశం ల‌భించింది.
తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రాంతాల‌లో ఉన్న డిజిట‌ల్ మార్కెట‌ర్స్‌, డిజిట‌ల్ మార్కెటింగ్ నేర్చ‌కునే విద్యార్థులు, బ్లాగింగ్ నేర్చుకునే వారికి కావాల్సిన స‌హాకారాన్ని తెలుగు మ‌రియు ఇంగ్లీష్ భాష‌ల‌లో ఇవ్వ‌డానికి ప్రారంభించాం. డిజిట‌ల్ మార్కెటింగ్‌పై హైద‌రాబాద్‌లో ఉన్న ఉద్యోగ అవ‌కాశాల‌ని కూడా మేం ఎప్ప‌టిక‌ప్పుడు యీ గ్రూప్ ద్వారా షేర్ చేస్తూనే ఉన్నాం. డిజిట‌ల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన మంచి వ‌న‌రుల‌ను అందిస్తూనే ఉన్నాం. ఒక ఉచిత డిజిట‌ల్ మార్కెటింగ్ కోర్సుని కూడా తెలుగు భాష‌లో చేసి కొన్ని వంద‌ల మందికి డిజిటల్ మార్కెటింగ్‌ని నేర్పించాం.
ఇటువంటి మంచి ఎడ్యూకేష‌న‌ల్ క‌మ్యూనిటీలో ఉండ‌డం మీకు మంచిదే.
డిజిట‌ల్ జాన్ క్రొత్త‌గా డిజిట‌ల్ మార్కెటింగ్ నేర్చుకోవ‌డానికి వ‌చ్చే వారికి త‌న శ‌క్తికి మించి స‌హాక‌రిస్తూనే క్రొత్త వారికి స్పూర్తిని ఇస్తున్నాడు. డిజిట‌ల్ జాన్ అనే యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా ఇప్ప‌టికే 200కు పైగా కేవ‌లం డిజిట‌ల్ మార్కెటింగ్‌పై వీడియోలను తెలుగు భాష‌లో ప్ర‌చురించాడు అంటే మీరు అర్థం చేసుకోవ‌చ్చు. డిజిటల్ జాన్‌ని మీరు వాట్సాప్ ద్వారా సంప్ర‌దించ‌వ‌చ్చు.
Digital John’s WhatsApp Number: +91-9573439404

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× text us