ఈ ప్రశ్న నన్ను కొన్ని వందల మంది బ్లాగింగ్‌ని ప్రారంభించే ముందు అడిగారు. చాలా మందికి బ్లాగింగ్ ప్రారంభించే ముందు డబ్బు ఎలా సంపాదించాలి అనే కనీస అవగాహన ఉండదు. కేవలం ట్రాఫిక్ వస్తే చాలు అనుకుంటారు. ఈ ఆర్టికల్‌లో బ్లాగింగ్ టాపిక్‌ని ఎలా ఎంచుకోవాలి అనేది వివరంగా చూద్దాం.
టాపిక్ ఎంచుకునే ముందు ఈ మూడింటిని విశ్లేషించాలి
- ఆసక్తి
- నాలెడ్జ్
- మార్కెట్ అవకాశాలు
ఆసక్తి
దీన్నే మనం ఇంట్రెస్ట్ అని అంటాం. ఇది కేవలం బ్లాగింగ్‌కి మాత్రమే కాదు, మీరు మీ కెరీర్లో ఏం చేయాలన్నా ముందు మీకు దానిపై ఆసక్తి ఉంటేనే మీరు దాన్ని ఇష్టంగా చేయగలరు. లేకపోతే ఎక్కడో ఒక చోట దాన్ని వదిలేస్తారు. నా బ్లాగింగ్ అనుభవంలో నేను చాలా మంది బ్లాగర్లను గమనించాను. వాళ్ళకి అపారమైన అనుభవం ఉంది, కానీ బ్లాగింగ్‌పై ఆసక్తి లేక దాన్ని కొనసాగించలేకపోయారు. ఎన్ని ఇబ్బందులున్నా నేను బ్లాగింగ్ చేస్తున్నాను అంటే దానికి కారణం, నాకు బ్లాగింగ్‌పై ఉన్న ఆసక్తే కారణం.
కాబట్టి బ్లాగింగ్ చేయాలంటే మీకు ఉండాల్సింది, మీరు ఎంచుకునే టాపిక్‌పై ఆసక్తి
నాలెడ్జ్
ఆసక్తికి తోడు ఎంచుకునే టాపిక్‌పై కొంత నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎంత నాలెడ్జ్ ఉండాలి? అనేది పెద్ద ప్రశ్న
వాస్తవం ఏంటి అంటే మనకు టాపిక్‌పై ఎంతో నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. టాపిక్‌పై ప్రాథమిక అవగాహన ఉన్నా సరే, మనం టాపిక్‌పై బ్లాగింగ్ ప్రారంభించవచ్చు. తర్వాత నెమ్మదిగా టాపిక్‌పై పట్టు సాధిస్తూనే రాణించవచ్చు.
నాకు నాలెడ్జ్ లేదు అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ప్రారంభించవచ్చు.
మార్కెట్ అవకాశాలు
మార్కెట్ అవకాశాలు అంటే మనం ఎంచుకునే టాపిక్‌కి ఆర్థికపరమైన డిమాండ్ ఉందా లేదా అనేది కనుక్కోవాలి. ఉదాహరణకు నేను డిజిటల్ మార్కెటింగ్‌పై బ్లాగింగ్ చేస్తున్నాను. ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్‌కి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ రంగంలో నేను ఉద్యోగం సంపాదించాలన్నా, ఒక ప్రాజెక్ట్ పై పని చేయాలన్నా, ఒక డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా పని చేయాలన్నా , ఇలా ఎన్నో ఉపాధి అవకాశాలను నాకు డిజిటల్ మార్కెటింగ్ తెచ్చిపెడుతుంది.
మీ టాపిక్ ఇంకేదైనా సరే, ప్రస్తుతం దానికి మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా అనేది కనుక్కోండి. కేవలం గూగుల్ ఆడ్‌సెన్స్ ద్వారానే మీరు డబ్బులు సంపాదించాలి అని అనుకోవద్దు. మీ అంతకు మీరు మీ సొంత ఉత్పత్తులను తయారు చేసి ఆన్లైన్ ద్వారా విక్రయించే లాగా చూసుకోండి. దాని ద్వారా మీరు ఇంకా ఎక్కువ డబ్బును చాలా తక్కువ సమయంలో సంపాదించే అవకాశం ఉంటుంది. దాని కోసం డిజిటల్ మార్కెటింగ్ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు డిజిటల్ మార్కెటింగ్ తెలియదు అనుకుంటే డిజిటల్ బడి అందిస్తున్న బ్లాగింగ్ కోర్సులో చేరి నేర్చుకోవచ్చు. పూర్తి వివరాలకు డిజిటల్ బడిని సంప్రదించండి.
ఇతర డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్స్
డిజిటల్ బడి తెలుగు బ్లాగింగ్ కోర్సు రివ్యూ (ఉదయ్ తాటి వ్రాసిన)
డిజిటల్ మార్కెటర్ కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి?
డిజిటల్ బడి యొక్క డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎలా ఉంటుంది?
ప్రీలాన్సింగ్ ద్వారా ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఎలా?
Useful information అన్న.
Thank you Shiva
Nice bro
Thank you Rakesh