లోక‌ల్ అంటే ఏంటి?

లోక‌ల్ SEOని ఎలా చేయాలి?

ఇటువంటి అనేక ర‌క‌మైన లోక‌ల్ SEO ప్ర‌శ్న‌ల‌తో కొంత‌మంది ఇటీవ‌ల న‌న్ను (డిజిట‌ల్ జాన్‌) సంప్ర‌దించారు. వారంద‌రికి నేను నాకు తెలిసిన లోక‌ల్ SEO (ఎస్‌.యీ.వో) సూచ‌న‌లు ఇచ్చాను. అలాగే లోక‌ల్ SEO పై ఒక చిన్న పుస్త‌కాన్ని కూడా రాసాను. యీ చిన్న ఆర్టిక‌ల్‌లో లోక‌ల్ కి సంబంధించిన మంచి చెడుల‌ను చూద్దాం

డిజిట‌ల్ మార్కెటింగ్‌లో ఏదైనా సందేహం ఉందా, గూగుల్‌లో స‌ర్చ్ చేస్తుంటే గూగుల్ ఇస్తున్న ఇంగ్లీష్ ఆర్టిక‌ల్స్ & వీడియోలు అర్థం అవ్వ‌ట్లేదా, అయితే మీరు తెలుగు డిజిట‌ల్ మార్కెటింగ్ ఫేస్‌బుక్ గ్రూప్‌లో చేరండి. మీ సందేహాల‌ను యీ గ్రూప్ ద్వారా అడిగి నివృత్తి చేసుకోండి. డిజిట‌ల్ బ‌డి టీంలో ఉన్న నాలెడ్జ్ మేర‌కు మీకు స‌మాధానం ఇవ్వ‌డం జ‌రుగుతుంది. వాట్సాప్ ద్వారా సంప్ర‌దించాల‌నుకుంటే +91-9573439404 కు పంపండి. సందేహాల‌ను టైప్ చేయ‌డానికి ఇబ్బంది అయితే వాయిస్ రికార్డ్ చేసి పంపండి. మీ ప్ర‌శ్న‌ల‌ను విని వీలు చేసుకొని స్పందిస్తాము

లోక‌ల్ అంటే ఏంటి?

లోక‌ల్ SEO అనేది SEOలో ఒక చిన్న భాగం. ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, ఇలా కొన్ని ర‌కాల SEOల‌ను మ‌నం  వివిధ విభాగాలుగా SEOలో చూడొచ్చు. వ్యాపారం ఒక ప్రాంతానికి ప‌రిమిత‌మై జ‌రుగుతున్న‌ప్పుడు లేదా ఒక ప్ర‌త్యేక భౌగోళిక ప్రాంతంలోనే జ‌రుగున్న‌ప్పుడు మ‌నం ఆ వ్యాపారాన్ని అదే ప్రాంతం కోసం SEO చేయ‌డం.

భాస్క‌ర్‌కి హైద్రాబాద్‌లో ఒక చిన్న టీవీ మెకానిక్ షాప్ (వ్యాపారం) ఉంది. ఇప్ప‌డు భాస్క‌ర్ త‌న టీవీ మెకానిక్ వ్యాపారాన్ని లేదా సేవ‌ల‌ను కేవ‌లం హైద్రాబాద్ ప్రాంతంలోనే ఇవ్వ‌గ‌ల‌డు. అత‌ని ద‌గ్గ‌ర ఇంకో 5 మంది టెక్నిషియ‌న్లు ఉన్నారు అనుకుందాం.

వ్యాపారం ఉన్న‌ది హైద్రాబాద్‌లో కాబ‌ట్టి, హైద్రాబాద్‌లో యే ఏరియా నుండి ఎవ‌రైనా టీవీ మెకానిక్ నియ‌ర్ మీ (TV Mechanic Near Me) అని టైప్ చేస్తే భాస్క‌ర్ టీవీ మెకానిక్ షాప్ వెబ్‌సైట్ రావాలి. అలా హైద‌రాబాద్ వాళ్ళు టీవీ మెకానిక్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తున్న‌ప్పుడు భాస్క‌ర్ టీవీ మెకానిక్ షాప్‌కి సంబంధించిన వెబ్‌సైట్ గూగుల్‌లో రావ‌డ‌మే లోక‌ల్ SEO.
పూణేలో ఎవ‌రైనా టీవీ మెకానిక్ నియ‌ర్ అని టైప్ చేసిన‌ప్ప‌డు భాస్క‌ర్ వెబ్‌సైట్ వ‌చ్చింద‌నుకోండి, అది అన‌వ‌స‌రం అనే అనుకోవాలి.

అలా గూగుల్‌లో భాస్క‌ర్ వ్యాపారం వ‌స్తే భాస్క‌ర్‌కి ఏంటి లాభం?

ప్ర‌జ‌లు అంద‌రు భాస్క‌ర్‌ని సంప్ర‌దిస్తారు టీవీ రిపేర్‌ గురించి, ప్ర‌తి రిపేర్‌కి డ‌బ్బు తీసుకుంటాడు కాబ‌ట్టి. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా అభివృద్ధి అవుతుంది.

అంత‌ర్జాతీయ SEO అనేది కూడా ఉంది. దాని గురించి మ‌నం త‌రువాత చూద్దాం

మంచి టిప్స్‌ (Best Practices)

లోక‌ల్ SEOకి లిస్టింగ్స్‌యే ప్ర‌ధాన బ‌లం. లిస్టింగ్స్‌లో ఖ‌చ్చితంగా గూగుల్ మై బిజినెస్ ఉండాల్సిందే.

లిస్టింగ్స్ అంటే ఏంటి?

వివిధ ర‌కాల వ్యాపారాల‌ గురించి వివ‌రాలు ఇచ్చే వెబ్‌సైట్ల‌లో మ‌న వ్యాపార వివ‌రాల‌ను కూడ న‌మోదు చేసుకోవ‌డం. ఉదాహ‌ర‌ణ‌కు జ‌స్ట్ డ‌య‌ల్ వెబ్‌సైట్‌లో మీ వ్యాపారాన్ని న‌మోదు చేసుకోవ‌డం.

గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్‌

లోక‌ల్ SEOకి గూగుల్ మై బిజినెస్‌యే మూలం అనుకోవ‌చ్చు. ఏ ఇత‌ర వెబ్‌సైట్‌లో మీరు లిస్టింగ్‌ని న‌మోదు చేసినా చేయ‌క‌పోయినా స‌రే కానీ గూగుల్‌లో లిస్టింగ్ చేయాల్సిందే. ఎందుకంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్న‌ప్పుడు గూగుల్ ముందుగా గూగుల్ మై బిజినెస్‌లో ఉన్న లిస్టింగ్స్‌నే వెతుకుతుంది.

గూగుల్‌లోవ్యాపారాన్ని న‌మోదు చేసుకోవ‌డం ఉచితం. ఎలా చేసుకోవాలి అని సందేహంగా ఉంటే కింద ఉన్న వీడియో చూడండి.  యీ వీడియో చూసి చాలా మంది వారి వ్యాపారాల‌ను గూగుల్‌లో న‌మోదు చేసుకున్నారు.

గూగుల్ మై బిజినెస్‌కి మొబైల్ యాప్ కూడా ఉంది. ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని వాడండి.

 

ఇత‌ర డిజిట‌ల్ మార్కెటింగ్ ఆర్టిక‌ల్స్

డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఎలా ?

డిజిటల్ మార్కెటర్ కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి?

డిజిటల్ బడి యొక్క డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎలా ఉంటుంది?

ప్రీలాన్సింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌డం ఎలా?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× text us