పర్సనల్ బ్రాండింగ్ గైడ్: వ్యాపారాభివృద్ధి కోసం

పర్సనల్ బ్రాండింగ్ గైడ్: వ్యాపారాభివృద్ధి కోసం

Personal Branding Guide in Telugu

పర్సనల్ బ్రాండింగ్ అంటే ఒక వ్యక్తి తనకు తానూ బ్రాండింగ్ చేసుకోవడం. ఇది ఆన్లైన్ ద్వారా కావొచ్చు, ఆఫ్ లైన్ ద్వారా కావొచ్చు. ప్రస్తుతం నేను మీకు ఆన్లైన్ ద్వారా పర్సనల్ బ్రాండింగ్ ని ఎలా నిర్మించుకోవాలి? అనే అంశం పై మీకు వివరిస్తాను.

1. పర్సనల్ బ్రాండింగ్ అంటే ఏంటి?

రాజమౌళి ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అని విన్నారా? ఒక వ్యక్తి బ్రాండ్ అవ్వాలంటే, ఆ వ్యక్తి తనకు తానూ మార్కెటింగ్ చేసుకుంటూ, తన పేరుకు ఉన్న పరపతిని, గౌరవాన్ని, విలువను కాపాడుకుంటూ మార్కెటింగ్ చేసుకోవడమే పర్సనల్ బ్రాండింగ్. ఇది నిరంతర ప్రక్రియ.

మన తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ లు మాత్రమే కాకుండా, వైద్యులు, న్యాయవాదులు (లాయర్స్), గాయకులూ (సింగర్స్) ఇంకా పలురకాల వారు తమ పర్సనల్ బ్రాండింగ్ ని ఆన్లైన్ ద్వారా చేసుకుంటూనే వాళ్ళ వృత్తిలో రాణిస్తున్నారు. వాటిలో కొన్నింటిని సందర్భాన్ని బట్టి మీకు పరిచయం చేస్తాను.

పర్సనల్ బ్రాండింగ్ కి ముందు

ఒక వ్యక్తి గా మీరు బ్రాండింగ్ చేసుకునే ముందు మీరు చేసే వృతి / వ్యాపారం ఏంటి అనేది గ్రహించాలి. ఎందుకంటే పర్సనల్ బ్రాండింగ్ఎక్కువ శాతం ఆ వ్యక్తి చేసే బిజినెస్ లేదా వృత్తి పై ఆధారపడి ఉంటుంది.

బ్రాండ్ నిర్మాణం

మీరు ఇప్పుడు మీ వృతి / బిసినెస్ ఏంటి అనేది నిర్ణయించుకున్నారు. తరువాత ఆన్లైన్ ద్వారా మీరు బ్రాండ్ నిర్మించాలనుకుంటే ఏ platform పై నిర్మించాలి అనేది మీరు ఎంపిక చేసుకోవాలి. నేను మీకు ఇక్కడ 8 టాప్ platforms ని ఇచ్చాను.

  1. LinkedIn
  2. Twitter
  3. Instagram
  4. Facebook
  5. Blogging
  6. YouTube
  7. Quora
  8. Podcast

టిక్ టాక్ ఇలా చాలా సోషల్ మీడియా వెబ్ సైట్స్ మరియు మొబైల్ యాప్స్ ఉన్నాయి. మీరు ఏ సోషల్ మీడియా వెబ్సైటు ని అయినా ఎంచుకోవచ్చు లేదా అన్ని సోషల్ మీడియా వెబ్ సైట్స్ పై కూడా దృష్టి సారించవచ్చు మీకు వీలైతే.

2. LinkedIn ద్వారా పర్సనల్ బ్రాండింగ్

LinkedIn ద్వారా పర్సనల్ బ్రాండింగ్ నిర్మించాలనుకుంటే మీరు ముందు మీ ప్రొఫైల్ ని పోలిష్ చేయాల్సి ఉంటుంది. LinkedIn యూజర్లు చాలా వేగంగా పెరుగుతున్నారు మన దేశంలో. LinkedIn లో మీ ప్రొఫైల్ ని పోలిష్ చేసిన తరువాత మీరు ఉన్న ఇండస్ట్రీ లో ఎవరైతే LinkedIn లో ఉన్నారో, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. ఉదాహారణకు , నేను డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ లో ఉంటూ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళను ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. తరచూ మీతో కనెక్ట్ అయిన వాళ్ళ కోసం ఉపయోగపడే కంటెంట్ ని పోస్ట్ చేస్తూ ఉండాలి.

LinkedIn లో కూడా గ్రూప్స్ ఉంటాయి. మీ ఇండస్ట్రీ కి సంబంధించిన గ్రూప్స్ లో చేరండి. యాక్టివ్ గ linkedIn ని వాడాల్సి ఉంటుంది. LinkedIn కి మొబైల్ యాప్ కూడా ఉంది. యాప్ ద్వారా మీరు ఎక్కడ ఉన్నా నిరంతరం యాక్టివ్ గ ఉండొచ్చు. LinkedIn లో ఆర్టికల్స్ రాసే సదుపాయం ఉంది. మీరు మీ బిజినెస్ అనుభవాలను మీరు రాయొచ్చు.

3. Twitter ద్వారా పర్సనల్ బ్రాండింగ్

ట్విట్టర్ ద్వారా పర్సనల్ బ్రాండింగ్ నిర్మించాలి అని మీరు అనుకుంటే, ముందు మీరు మీ ప్రొఫైల్ ని క్లీన్ చేసుకోవాలి. మంచి ప్రొఫైల్ ఫోటో, కవర్ ఫోటో, బయో పెట్టాల్సి ఉంటుంది. ఆ తరువాత మీరు ఉన్న రంగంలో ఉన్న నిపుణులను ఫాలో అవుతుండాలి. మీరు కూడా మీరు ఉన్న ఇండస్ట్రీ విశేషాలు ట్వీట్ల ద్వారా షేర్ చేయాల్సి ఉంటుంది.

ఇది నిరంతర ప్రక్రియ, ఒక్క సారి చేసి వదిలిపెట్టేది కాదు.

టాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా ట్విట్టర్ ని వాడతారు.

4. Instagram ద్వారా పర్సనల్ బ్రాండింగ్

ఇంస్టాగ్రామ్ మొబైల్ బేస్డ్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్. 2018 నుంచి ఇంస్టాగ్రామ్ చాలా ప్రాచుర్యం లోకి వచ్చింది. ట్విట్టర్ కి ఇచ్చిన టిప్స్ ఇంస్టాగ్రామ్ కి కూడా వర్తిస్తాయి. కాకపొతే ఇంస్టాగ్రామ్ విసువల్ కంటెంట్ ప్లాట్ ఫార్మ్ , కాబట్టి ఇమేజెస్ , షార్ట్ వీడియోస్ మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రియా వారియర్ ఇంస్టాగ్రామ్ ద్వారానే పాపులర్ అయింది. ఇంస్టాగ్రామ్ influencers కి మంచి డిమాండ్ ఉంది ప్రస్తుతం. ఎక్కువ ఫాలోవర్స్ ని సంపాదిస్తే సోషల్ మీడియా influencers గ కూడా రాణించొచ్చు.

5. Facebook ద్వారా పర్సనల్ బ్రాండింగ్

ఫేస్బుక్ లో మీరు ఒక facebook పేజీ క్రియేట్ చేసుకొని బ్రాండింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు text కంటెంట్ ని కూడా పోస్ట్ చేయొచ్చు. ఇంస్టాగ్రామ్ మరియు ట్విట్టర్ కి ఇచ్చినా టిప్స్ వీటికి కూడా వర్తిస్తాయి.

advertisements ద్వారా మీరు మీ టార్గెట్ ఆడియన్స్ ని చేరుకోవడానికి ఫేస్బుక్ అద్భుతమైన సోషల్ మీడియా వెబ్ సైట్ అని చెప్పొచ్చు.

పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఫేస్బుక్ లో ఫేస్బుక్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని టార్గెట్ ఆడియన్స్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. మీరు కూడా అలా చేయొచ్చు. ( ప్రజలు ప్రజలతో వ్యాపారం చేస్తారు) people do business with people అని మర్చిపోవొద్దు.

6. Blogging ద్వారా పర్సనల్ బ్రాండింగ్

మీరు ఒక థాట్ లీడర్ గ మార్కెట్ లో పొజిషనింగ్ చేసుకోవాలి అనుకుంటే బ్లాగింగ్ కి మించిన సులువైన, బలమైన మార్గం ఇంకొకటి లేదు. భారత దేశంలో టాప్ డిజిటల్ మార్కెటింగ్ experts బ్లాగింగ్ ద్వారానే వాళ్ళ పర్సనల్ బ్రాండింగ్ ని నిర్మించుకున్నారు. ఉదాహరణకు , డిజిటల్ దీపక్ , సౌరవ్ జైన్ మరియు డిజిటల్ జాన్ బ్లాగ్ లు చూడొచ్చు.

బ్లాగింగ్ చేయాలి అనుకుంటే మీరు ముందు ఒక వెబ్సైటు పేరు కొనుక్కొని , వెబ్ హోస్టింగ్ కొనుక్కొని , వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకొని ప్రారంభించవచ్చు. దీనికి కొంత ఖర్చు అవుతది. ఇంచు మించు 1000 రూపాయలతో మీరు బ్లాగింగ్ ప్రారంభించవచ్చు.

బ్లాగ్ ప్రారంభించిన తరువాత మీరు మీ ఇండస్ట్రీ కి సంబందించిన ఆర్టికల్స్ రాస్తూ నెమ్మదిగా పర్సనల్ బ్రాండింగ్ ని నిర్మించాలి. బ్లాగింగ్ లో ఒక ఘన ధన నిధి ఉంది.

7. YouTube ద్వారా పర్సనల్ బ్రాండింగ్

యూట్యూబ్ రెండవ అతి పెద్ద సెర్చ్ ఇంజిన్. యూట్యూబ్ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, విద్య, ఆరోగ్యం, ఎలక్ట్రానిక్స్ కోసం కూడా ఉపయోగిస్తారు. సింగర్స్ పర్సనల్ బ్రాండింగ్ కి యూట్యూబ్ మంచి వేదిక. రాహుల్ సిప్లిగంజ్ యూట్యూబ్ ద్వారానే పర్సనల్ బ్రాండింగ్ ని నిర్మించుకున్నాడు. ఆ తరువాత చాలా అవకాశాలు తనకి వచ్చాయి. కారణం: పర్సనల్ బ్రాండింగ్. రాహుల్ కి 6 లక్షల 25 వేల మంది subscribers ఉన్నారు.

లఘు చిత్రాలు (short flms) ద్వారా కూడా మీరు పర్సనల్ బ్రాండింగ్ ని ఏర్పరచుకోవొచ్చు ఒక వేళా మీరు మీడియా & ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ లో ఉన్నట్లయితే. మీరు ఒక కెమెరా మెన్ గాని, సింగర్ , యాక్టర్  ఇలా మీకు ఉన్న టాలెంట్ ద్వారా మీరు అవకాశాలు తెచ్చుకుంటారు.

యూట్యూబ్ ఎడ్యుకేషన్ కి కూడా ఫేమస్.

మీకు తెలుసా యూట్యూబ్ ఇటీవలే కొన్ని ఎడ్యుకేషన్ యూట్యూబ్ చానెల్స్ కి ఫండింగ్ ఇచ్చిన విషయం

మీరు ఒక ట్రైనర్ గాని , కోచ్ గాని , ప్రొఫెసర్ గాని అయితే మీ సబ్జెక్టు ని యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోల రూపంలో ఇస్తూ ఎక్స్పర్ట్ గ అవ్వొచ్చు. డిజిటల్ జాన్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ వీడియో ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ మార్కెటింగ్ expert గ రాణించాలని ప్రయత్నిస్తున్నాడు. అలాగే మీరు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అవ్వొచ్చు, ఒక యోగ టీచర్ అవ్వొచ్చు, ఒక ఎడ్యుకేషన్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలను పోస్ట్ చేయండి.

తెలుగు రాష్ట్రాల్లో  చాలా మంది యూట్యూబ్ ద్వారా పర్సనల్ బ్రాండింగ్ ని నిర్మించుకున్నారు, నిర్మించుకుంటున్నారు. యీ ఆర్టికల్ చదువుతున్న మీరు కూడా రేపు ఒక పర్సనల్ బ్రాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

8. Quora ద్వారా పర్సనల్ బ్రాండింగ్

2009 లో ప్రారంభమైన కోరా వెబ్ సైట్. ఇప్పుడు ప్రపంచ మేధావుల ఫ్లాట్ ఫార్మ్ గ ఎదిగింది. ప్రశ్న జవాబుల వెబ్ సైట్లలో కోరా నే టాప్. మీ ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రశ్నలను వెతికి , వాటికి మాత్రమే జవాబులు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలు కూడా ఇండస్ట్రీ కి సంబంధించినవి అడగాలి. మీరు డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ లో ఉంటె , డిజిటల్ మార్కెటింగ్ ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాలి. కోరా ద్వారా మీ పర్సనల్ బ్లాగ్ కి ట్రాఫిక్ ని మళ్లించొచ్చు.

కోరా ప్రస్తుతం ఇంగ్లీష్ హిందీ భాషల్లో ఉంది. ఒకవేల మీరు తెలుగు లో జవాబులు ఇవ్వాలనుకుంటే కోరా లాంటి యాప్ ఒకటి ఉంది. మీరు దాన్ని వాడొచ్చు. దాని పేరు Vokal.

డిజిటల్ జాన్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నాడు ఇప్పుడు. తన కృషికి మెచ్చి, Vokal CEO ఇటీవలే ఒక కృతజ్ఞత gift ఇచ్చారు.

9. Podcast ద్వారా పర్సనల్ బ్రాండింగ్

podcasting కూడా ప్రస్తుతం ఒక ట్రెండ్ అనుకోవచ్చు. మేము ఇంకా podcast ని explore చేయలేదు. podcast అంతా ఆడియో రూపంలోనే ఉంటుంది కాబట్టి ఆఫీస్ కి వెళ్తున్న టైం లో వినుకుంటూ మనం వెళ్లొచ్చు. F M రేడియో లాగా.

డిజిటల్ మార్కెటింగ్ లో మంచి కంటెంట్ మనకు podcast రూపంలో ఉంది. నీల్ పటేల్ కూడా పోడ్ కాస్టింగ్ చేస్తుంటాడు. మన దేశంలో సౌరవ్ జైన్ podcasting చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ లో

Sorav Jain Podcasting on Digital Marketing

10. ముగింపు

నేను మీకు ఇక్కడ చాలా విషయాలు చెప్పాను పర్సనల్ బ్రాండింగ్ గురించి. మీరు ఉన్న వృత్తిని బట్టి , మీకు ఉన్న టాలెంట్ ని బట్టి ఏ సోషల్ మీడియా వెబ్ సైట్ ద్వారా పర్సనల్ బ్రాండింగ్ నిర్మించాలనుకుంటున్నారో నిర్ణయించుకొని నేటి నుండే స్టార్ట్ చేయండి. నేనైతే ఎక్కువగా బ్లాగింగ్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా పర్సనల్ బ్రాండింగ్ ని నిర్మించుకుంటున్నాను.

గుర్తుంచుకోండి :

పర్సనల్ బ్రాండింగ్ అనేది ఆ వ్యక్తి వెనకాల ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికే చేయాలి. – డిజిటల్ జాన్

యీ ఆర్టికల్ ని చాలా ఓపికగా చదివినందుకు మీకు థాంక్స్. తప్పక షేర్ చేస్తారు కదు 🙂

పర్సనల్ బ్రాండింగ్ పై మీకు ఉన్న ప్రశ్నలను కామెంట్ చేయండి

Join Digital Marketing course
Written by
Digital John
Join the discussion

Digital John

Digital John is digital marketing and content marketing practitioner, trainer, blogger, YouTuber with qualified Management education in Marketing Specialisation from Vanguard B-School. He won Best Digital Marketing Blogger in India Award in 2018 from Feedspot.