సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అవ్వాలంటే?

సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అవ్వాలంటే?

Digital Marketing Course in Telugu for FREE

డిజిటల్  మార్కెటింగ్  లో మనకు ఎక్కువ అవకాశాలు ఉన్న రంగం ఏదైనా ఉందా అంటే అది సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. SEM ని సెర్చ్ ఇంజిన్ advertising అని, PPC అని కూడా అంటారు. PPC అంటే Pay Per Click. PPC expert అవ్వాలంటే ఏం చేయాలో యీ ఆర్టికల్ లో చూద్దాం.

1. డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్

PPC నేర్చుకునే ముందు డిజిటల్ మార్కెటింగ్ పై ప్రాథమిక అవగాహన ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక వేళ మీకు డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే డిజిటల్ బడి తెలుగు లో అందిస్తున్న ఉచిత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోండి.

2. గూగుల్ యాడ్స్ నేర్చుకోవడం

గూగుల్ ఒక్కటే సెర్చ్ ఇంజిన్ కాదు, గూగుల్ తో పాటు చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నప్పటికీ ఎక్కువ శాతం అంటే 96.63% గూగుల్ నే మన దేశంలో వాడతారు కాబట్టి మనం గూగుల్ యాడ్స్ ని నేర్చుకోవడానికి ప్రాధాన్యతని ఇవ్వాలి. గూగుల్ యాడ్స్ నేర్చుకుంటే చాలు ప్రారంభంలో. తరువాత అవసరాన్ని బట్టి బింగ్ యాడ్స్ ని కూడా నేర్చుకోవొచ్చు.

  • Google Adwords ని Google Ads గ పేరు మార్చారు
  • Bing Ads ని Microsoft Advertising గ పేరు మార్చారు

గూగుల్ యాడ్స్ ని ప్రాక్టికల్ గ నేర్చుకోవాలంటే యాడ్స్ రన్ చేస్తూ నేర్చుకోవాలి.

3. మెట్రిక్స్ నేర్చుకోవాలి

గూగుల్ యాడ్స్ లో ఉండే మెట్రిక్స్ కొన్ని

  1. Click-through rate
  2. Cost Per Click
  3. Quality Score
  4. Return on Ad Spend (ROAS)
  5. Cost Per Conversion

4. Best Resources

గూగుల్ యాడ్స్ ని మరింత మెరుగ్గా నేర్చుకోవాలంటే అవసరమైన వనరులు ఇవి.

గూగుల్ యాడ్స్ సపోర్ట్ 

గూగుల్ యాడ్స్ యూట్యూబ్ ఛానల్ 

మీరు బిగినర్స్ అయితే ఇందులో readiness series వీడియోస్ ని చూడండి

గూగుల్ యాడ్స్ కోర్స్ 

5. Landing Pages

లాండింగ్ పేజెస్ గురించి కూడా నేర్చుకోవాల్సిందే. లాండింగ్ పేజెస్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి కన్వర్షన్స్ విషయంలో. లాండింగ్ పేజీ ని ఎలా క్రియేట్ చేయాలి, ad copy ఎలా ఉండాలి, visitor ని ఒప్పించగలిగేలా రాయటం ఎలా, ఇటువంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది. లాండింగ్ పేజెస్ గురించి పూర్తి అవగాహన కోసం నేను మీకు Ultimate Landing Page Guide ఇస్తున్నాను. ఇది పూర్తిగా చదివితే మీకు అర్థము అవుతుంది.

6. Excel నేర్చుకోవాలి

గూగుల్ యాడ్స్ కి మాత్రమే కాదు, Microsoft Excel ని ప్రతి డిజిటల్ మార్కెటర్ నేర్చుకోవాలి. Excel యొక్క అవసరత SEO లో మరియు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో చాలా ఉంటుంది. యాడ్ copies ని సిద్ధం చేసుకోవడంలో కావొచ్చు , ad copy variations ఒకే place లో రాసుకొని ఇంప్రూవ్ చేయడం కోసం కావొచ్చు, బడ్జెట్ forecasting , campaign అనలిస్ లాంటి చాలా పనులకు excel చాలా అవసరం అవుతుంది. ఉదాహారణకు యీ ఆర్టికల్ చుడండి మీకు అర్థము అవ్వడానికి https://www.hanapinmarketing.com/ppc-library/guide/the-complete-guide-to-using-excel-for-ppc/

మీరు excel లో beginners అయితే PPC templates ని వాడండి

గూగుల్ యాడ్స్ ని నేర్చుకోవాలంటే డిజిటల్ బడి అందిస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో చేరి నేర్చుకోండి.

Learn Digital Marketing Course

Other Articles

On-Page SEO Guide in Telugu 2020

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి కావాల్సిన టూల్స్

బ్లాగ్ టాపిక్ ని మార్కెట్ అవకాశాలకు అనుగుణంగా ఎలా ఎంపిక చేసుకోవాలి?

Written by
Digital John
Join the discussion

Digital John

Digital John is digital marketing and content marketing practitioner, trainer, blogger, YouTuber with qualified Management education in Marketing Specialisation from Vanguard B-School. He won Best Digital Marketing Blogger in India Award in 2018 from Feedspot.