కోరా అనేది ప్రపంచంలోనే నెం.1 ప్రశ్న జవాబుల వెబ్సైట్ అని మనందరికి తెలిసిందే. అయితే కోరా ప్రతి సంవత్సరం కోరా వరల్డ్ మీటప్ వీక్ (వారం) అనేది నిర్వహిస్తుంటుంది. ప్రపంచంలో ఉన్న ఎవ్వరైనా సరే, ఇటువంటి మీటప్ నిర్వహించడానికి చొరవ తీసుకొని నిర్వహించవచ్చు. కోరా దీన్ని 2017 నుండి ప్రారంభించింది. అంటే, ఇది 3వ వరల్డ్ మీటప్. ఈ సంవత్సరం మీటప్ని హైదరాబాద్లో నిర్వహించడానికి డిజిటల్ బడి టీం చొరవ తీసుకుంది.
ఈ మీటప్ ఎవరి కోసం
కోరాపై ఇంట్రెస్ట్ ఉన్న వారు మరియు కోరాని ఆక్టివ్గా వినియోగిస్తున్నవారు హాజరవ్వొచ్చు.
ఈ మీటప్కి ఎలా అటెండ్ అవ్వాలి
- కోరా వెబ్సైట్లో ఈ ప్రశ్నకి మీరు జవాబు ఇవ్వాలి (మేము అటెండ్ అవుతాము అని)
- రిజిస్ర్టేషన్ ఫాం నింపాలి
- ఫేస్బుక్ గ్రూప్లో చేరాలి (ఇది ఆప్షనల్)
ఏవైనా సందేహాలుంటే 9573439404 నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు
ఈ మీటప్కి ఇప్పటికే రిజిస్ర్టేషన్లు మూసివేయడం జరిగింది. కాకపోతే కోరా హైదరాబాద్ కమ్యూనిటీలో చేరండి, తరువాత నిర్వహించబోయే మీటప్లకు హాజరవ్వొచ్చు.