Table of Contents
చింటుకి హైదరాబాద్‌లో సోషల్ మీడియా మార్కెటర్‌గా జాబ్ వచ్చింది. ఉద్యోగంలో భాగంగా ప్రతిరోజు పేస్బుక్, ట్విట్టర్, లింక్డిన్తో పాటు మరి కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లలో కంపెనీ అప్డేట్స్ ని పోస్ట్ చేయాలి. ప్రతిసారీ ఇలా ప్రతి సోషల్ మీడియా వెబ్‌సైట్‌కి వెళ్ళి లాగిన్ అయి పోస్ట్ చేయాలి అంటే చాలా సమయం వృధా అవుతుంది.
కేవలం పోస్టింగ్ చేయడానికి మాత్రమే కాదు, సోషల్ మీడియా మెట్రిక్స్ చెక్ చేయాలన్నా, ట్రెండింగ్ హ్యష్ట్యాగ్స్ పై రీసెర్చ్ చేయాలన్నా, ఇలా సోషల్ మీడియాలో చింటు ప్రతి రోజు చేయాల్సిన పనులను సోషల్ మీడియా మార్కెటింగ్ మేనేజ్మెంట్ టూల్స్‌తో సులభంగా, వేగంగా చేసుకోవచ్చు. వాటి కోసం వాడే టాప్ 2 టూల్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం. చింటూకి ఒక పరిష్కారాన్ని ఇద్దాం. తద్వారా చింటు పని సులభం అవుతుంది
హూట్స్వీట్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు హూట్స్వీట్ టూల్‌నే వాడతారు. ఇంచుమించు 75% ఫార్చూన్ టాప్ 500 కంపెనీలు ఇదే టూల్‌ని వాడతారు అంటే అతిశయోక్తి కాదు. హూట్స్వీట్ టూల్‌తో ఒక్కసారి మనం మన సోషల్ మీడియా అకౌంట్స్‌ని కనెక్ట్ (ఇంటిగ్రేట్) చేస్తే చాలు. ఒకే డాష్‌బోర్డులో అన్ని సోషల్ మీడియా ఖాతాలని అక్కడి నుంచే మేనేజ్ చేయోచ్చు. పోస్టింగ్, కమెంట్స్కి రిప్లై ఇవ్వడం, పోస్టులను అన్ని సోషల్ మీడియా వెబ్సైట్లకి ముందే స్కెడ్యూల్ చేసి ఉంచడం, వాటి ఎంగేజ్మెంట్ రేట్ చెక్ చేయడం, ఇలా అనేక పనులను మనం ఒకే వెబ్సైట్లో లాగిన్ అయి మేనేజ్ చేయవచ్చు. సోషల్ మీడియా రిపోర్టింగ్ కూడా ఈ టూల్లో చాలా సునాయాసంగా తీసుకోవచ్చు. ఇలా మనం ఎంతో సమయాన్ని పొదుపు చేసుకోవచ్చు.
చింటు నన్ను సంప్రదించినప్పుడు కూడా నేను ఇదే టూల్‌ని రికమెండ్ చేసాను. ఇప్పుడు సోషల్ మీడియా పనులను అత్యంత సులువుగా, వేగంగా చేసుకోగలుగుతున్నాడు
హూట్స్వీట్ టూల్ టూటోరియల్
బఫర్ టూల్
హూట్స్వీట్ లాంటి టూల్స్ మార్కెట్లో చాలానే ఉన్నప్పటికీ, తర్వాతి స్తానం మాత్రం బఫర్ అనే సోషల్ మీడియా మార్కెటింగ్ టూల్.
ఈ టూల్‌తో కూడా ఇంచుమించు హూట్స్వీట్ టూల్‌తో చేసుకునే కొన్ని పనులు చేసుకోవచ్చు. మనకు ఎలాగు ట్రయల్ వర్షన్ ఉచితంగా ఉంది కాబట్టి వెళ్ళి చెక్ చేయండి. మీ సోషల్ మీడియా హ్యండల్స్ కొన్ని కనెక్ట్ చేసి చెక్ చేయండి.
సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకోవానుకుంటే డిజిటల్ బడి అందిస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో చేరండి. కేవలం ఈ టూల్స్ మాత్రమే కాదు. సోషల్ మీడియా అడ్వర్టైసింగ్, యూట్యూబ్ మార్కెటింగ్ వంటి అనేక ఇతర సోషల్ మీడియా నైపుణ్యాలు మీరు సంపాదించుకోవచ్చు.
Good information, dear John
Thank you Shivan