Table of Contents
చాలా మంది నన్ను ఆన్లైన్లో అడిగే ప్రశ్నలలో బ్లాగింగ్‌పై ఎక్కువగా అడుగుతుంటారు. వాటిలో బ్లాగింగ్ ఖచ్చితంగా మేము చేయాలా. ప్రతి సారి నాణ్యమైన కంటెంట్‌ను సిద్ధపర్చాలి అంటే మన వల్ల అయ్యే పని కాదు అని కొందరు. మాకు అంత సమయం లేదు అని ఇంకొందరు. సమయం ఉన్నప్పటికీ బ్లాగింగ్ చేయడానికి కావలసిన స్కిల్స్ లేకపోవడం వంటి సమస్యలు తరచూ వింటుంటాను.
అటువంటి కొన్ని సమస్యలకు బ్లాగింగ్ ద్వారా ఎలా ప్రయోజనం పొందవచ్చు అనేది మీకు ఈ ఆర్టికల్ ద్వారా వివరిస్తాను. పూర్తిగా చదివితే చివర్లో మీకు ఒక గిప్ట్ ఉంది.
యీ పది ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు మీకు ఒక ముఖ్య ప్రశ్న.
మీ సొంత బ్లాగ్ ఎక్కడ హోస్ట్ చేస్తే మంచిది అంటే ఖచ్చితంగా మీ కంపెనీ వెబ్సైట్ లేదా మీ సొంత వెబ్సైట్లోనే హోస్ట్ చేస్తే మంచిది. ఉదాహారణకు digitalbadi.com/blog . ఉచితంగా ఉన్న బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లలో బ్లాగ్ హోస్ట్ చేయడం కంటే అసలు బ్లాగే లేకపోవడం మంచిది.
ఇక 10 ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
సెర్చ్ ఇంజిన్ల ట్రాఫిక్ పెంచడం
సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ విషయంలో బ్లాగింగ్ అనేది చేపలు పట్టడం లాంటిది. చేపలు నేరుగా జాలరుల దగ్గరికి రావాలంటే జాలరుల దగ్గర గాలం లాంటిది వ్యాపారులకు బ్లాగింగ్ అనేది. గాలానికి ఎర పెట్టి ఎలా అయితే చేపలని పట్టుకుంటారో బ్లాగింగ్ ద్వారా మన టార్గెట్ ఆడయన్స్ని మన బ్లాగ్‌కి తీసుకొచ్చి పేయింగ్ కస్టమర్‌గా చేసుకోవచ్చు. చేపలు పట్టే ప్రక్రియ లాగే మన బ్లాగ్‌కి ఎక్కువ నాణ్యమైన కంటెంట్ ఉంటే చాలు. యీ కంటెంట్‌యే మీ బిజినెస్ బ్లాగ్ విజిబిలిటీని పెంచుతుంది సెర్చ్ ఇంజిన్లలో. దాని ద్వారా క్రమక్రమంగా సెర్చ్ ఇంజన్ ద్వారా వచ్చే ట్రాఫిక్ పెరుగుతుంది.
మీరు బ్లాగ్ ద్వారా ప్రచురించే ప్రతి వెబ్ పేజ్ చేపలు పట్టడానికి నీటిలో వేసిన ఎర లాగే ఉంటుంది. ఎంత ఎక్కువ కంటెంట్ మీరు నిర్మిస్తే అంత ఎక్కువగా మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ర్యాంకింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
బ్రాండ్‌కి ఉన్న వేరే కోణాలను ఆవిష్కరించడం
మీ కంపెనీ బ్రాండ్‌కి ఉన్న మానవీయ కోణాన్ని కంపెనీలో వెబ్సైట్లో ఉన్న ఎబౌట్ అస్ పేజ్ ద్వారా తెలియపరచలేకపోవచ్చు. ఇది బ్లాగ్ ద్వారా పరోక్షంగా మీరు తెలియజేవచ్చు. బ్లాగింగ్ ద్వారా మీ కస్టమర్ల సమస్యలను ఎత్తి చూపుతూ, వాటి పరిష్కారాలను మీరు మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ద్వారా ఎలా తీర్చవచ్చు అనేది చెప్పవచ్చు. మీ కంపెనీ విలువలు, మీ ఉద్యోగుల అభిరుచులను బ్లాగ్ ద్వారా పంచుకోవచ్చు.
సోషల్ మీడియాకి ఊతమిస్తుంది
నాణ్యమైన కంటెంట్ లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కొనసాగడం చాలా క్లిష్టమైన పని. ఇతరుల కంటెంట్‌ని మీ సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు కానీ అలా ఎంత కాలం చేస్తారు? ఒక దశలో మీరు ట్రాఫిక్ని మీ వెబ్‌సైట్‌కి మళ్ళించాలి అంటే మీకు మీరే కంటెంట్‌ని బ్లాగ్ పోస్టుల రూపంలో పబ్లిష్ చేయాలి. మీకు మీరే బ్లాగింగ్ ఇక్కడ మీకు ఉపయోగపడుతుంది
అంతేకాకుండా, బ్లాగ్ పోస్టులు మీకు ఇమెయిల్ న్యూస్ లెటర్స్ పంపడానికి కూడా పరోక్షంగా కంటెంట్‌ని అందిస్తుంది. నాణ్యమైన కంటెంట్‌ని న్యూస్‌లెటర్స్ ద్వారా అందిస్తే ఖచ్చితంగా రీడర్స్ చదువుతారు.
మీ ఇండస్ర్టీలో ఆధారిటీని నిర్మిస్తుంది
యీ రోజు ఉన్న తీవ్ర పోటీ ప్రపంచంలో మీరు ఉన్న ఇండస్ట్రీలో ఆధారిటీ బ్రాండ్‌ని నిర్మించాలంటే బ్లాగింగ్ ఒక చక్కటి మార్గం. ఇది కేవలం కంపెనీలకు మాత్రమే కాదు పర్సనల్ బ్రాండ్లకు కూడా వర్తిస్తుంది. నేను అలాగే డిజిటల్ మార్కెటింగ్‌పై ఒక ఆధారిటీని నిర్మించుకున్నాను నా బ్లాగ్ ద్వారా.
ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏం జరుగుతుంది అని మీరు ప్రపంచానికి చెప్పడానికి బ్లాగింగ్ ఒక చక్కటి వేదికని మీకు ఇస్తుంది. మీ ఆధారిటీ పెరిగే కొద్దీ మీపై ఉన్న నమ్మకం కూడా కస్టమర్లకు పెరుగుతుంది. మీ బ్లాగ్ రీడర్లు కొనాలనుకున్నాప్పుడు ఖచ్చితంగా వారికి మీరే గుర్తొస్తారు. దీని వల్ల మీ కన్వర్సన్ రేట్ పెరుగుతుంది. దీన్ని ఇంకో ప్రయోజనం కింద మీకు వివరిస్తాను.
కన్వర్షన్ రేట్‌ని మెరుగుపరుస్తుంది
యాక్టివ్ బ్లాగ్ సెర్చ్ ఇంజిన్‌కి మీ బిజినెస్ బ్రతికే ఉంది, బాగానే ఉంది అని సిగ్నల్స్ పంపిస్తుంది. ఎప్పటికప్పుడు కావాల్సిన మెయింటెనెన్స్ కూడా జరుగుతుంది అన్నట్టు. అందుకే నన్ను సంప్రదించే చాలా మందికి బ్లాగ్‌ని తరచూ అప్డేట్ చేస్తుండాలి అని. అలా చేయకపోతే బ్లాగ్‌ని తీసివేయడమే మేలు. హాబ్స్పాట్ రీపోర్టు ప్రకారం బ్లాగ్ ఉన్న కంపెనీలకు వచ్చే ఆదాయం చాలా ఎక్కువ.
ఇన్‌బౌండ్ లింక్స్ నిర్మాణంలో సహాయపడుతుంది
మీ వెబ్‌సైట్‌కి హై క్వాలిటీ ఇన్‌బౌండ్ లింక్స్ (Inbound links) ఉండడం SEOకి చాలా ముఖ్యం. అయితే, బ్లాగ్ లేకుండ మీ వెబ్‌సైట్‌కి ఆధారిటీ వెబ్సైట్ల నుండి ఇన్‌బౌండ్ లింక్స్‌ని తెచ్చుకోవడం చాలా కష్టం. ఎప్పుడైతే మీ బ్లాగ్ ఇతర బ్లాగర్లకి మీడియాకి మంచి రీసోర్సు అని అనిపిస్తుందో, అప్పుడు సహజంగానే మీరు లింక్స్‌ని సంపాదిస్తారు. ఈ లింక్స్యే మీ SEOకి ప్రధానమైనవి. దీని వల్ల మీరు ఊహించని రెఫరల్ ట్రాఫిక్ కూడా పెరుగుతుంది (గూగుల్ ఆనాలిటిక్స్లో).
లాంగ్ టెయిల్ కీవార్డులకు ర్యాంకింగ్‌లో సహాయపడుతుంది
ముందుగా, లాంగ్ టెయిల్ కీవార్డ్స్ (Long-tail Keywords) అంటే ఎక్కువ పదాలు ఉంటాయి అని కాదు. సహాజంగా సెర్చ్ వాల్యూమ్ (Search Volume) తక్కువ ఉంటుంది అని అర్థం. వాల్యూమ్ తక్కువగానే ఉంటుంది కానీ యూజర్ యొక్క ఇంటెంట్ (intent) స్పెసిఫిక్గ ఉంటుంది. అటువంటి యూజర్లను మీ వెబ్‌సైట్‌కి మళ్ళించాలి అంటే బ్లాగ్ చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే అటువంటి సెర్చ్ కీవార్డ్స్కి మీరు అంతకుముందే ఏదో ఒక రూపంలో ఆర్టికల్‌ని రాసి ఉంటారు కాబట్టి.
లీడ్స్ ఎక్కువ వచ్చే అవకాశం
రీసెర్చ్ ప్రకారం ఎక్కువ వెబ్ పేజీలు ఉన్న వెబ్సైట్యే ఎక్కువ లీడ్స్‌ని ఉత్పత్తి చేసింది. మీ బ్లాగ్‌లో ప్రచురించే ప్రతి ఆర్టికల్ ఒక క్రొత్త వెబ్ పేజి అని మర్చిపోవద్దు. హాబ్స్పాట్ రీసెర్చ్ ప్రకారం 400 నుండి 1000 పేజీలు ఉన్న వెబ్సైట్ 6 రెట్లు ఎక్కువ లీడ్స్‌ని తీసుకొచ్చింది 50-100 వెబ్ పేజీలు ఉన్న సైట్‌తో పోలిస్తే. సింపుల్‌గా చెప్పాలంటే, ఎంత ఎక్కువ బ్లాగింగ్ చేస్తే అంత ఎక్కువ లీడ్స్ వస్తాయి మీ వెబ్సైట్ ద్వారా. ఎక్కువ కంటెంట్ అంటే, ఎక్కువ ట్రాఫిక్, ఎక్కువ ఇమెయిల్ ఆప్టిన్స్ (opt-ins), ఎక్కువ సైన్ అప్లు, చివరికి ఎక్కువ అమ్మకాలు (more sales).
నాణ్యమైన డిస్కషన్‌కి అవకాశం కల్పిస్తుంది
మీ కస్టమర్లతో 2-way కమ్యూనికేషన్ లాగ బ్లాగ్ చాలా ఉపయోగపడుతుంది. ఇది పరోక్షంగా మేము కామెంట్, ఫీడ్‌బ్యాక్, విమర్శలకు సిద్ధం అని సంకేతాన్నిస్తుంది. బిజినెస్ పరంగా యీ డిస్కషన్ వల్ల మీ ప్రాస్పెక్ట్ల బుర్రలో ఉన్న వాటిని అర్థం చేసుకోవచ్చు. ఇదే బంగారం మీ వ్యాపారానికి. యీ డిస్కషన్ వల్ల మీరు ఇంకొన్ని ప్రశ్నలు అడిగి విశ్లేషించొచ్చు. వీటి వల్ల మనం నేర్చుకొని తరువాత చేసే మార్కెటింగ్‌ని ఇంకా పద్ధతిగా చేసే అవకాశం ఉంటుంది.
తాజాదనాన్ని సాధించడానికి అనుమతిస్తుంది
తాజాదనం కూడా సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్‌లో ఒక కారణం. ఎప్పటికప్పుడు తాజా కంటెంట్‌ని ప్రచురించే వెబ్సైట్లను గూగుల్ ప్రేమిస్తుంది.
ఎక్కువ కంటెంట్ అంటే ఎక్కువ ఇంటర్ లింకింగ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇది మీ పేజీల ఆధారిటీని పెంచుతుంది. బ్లాగింగ్ ఖచ్చితంగా మీ బిజినెస్‌కి ఊతమిస్తుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
చివరి మాటలు
మీ వ్యాపారంలో మీ కంపీటీటర్లతో ప్రత్యేకపరచుకోవడానికి ఉన్న మార్గాల్లో బ్లాగింగ్ ఒకటి. దీని వల్ల మీరు కస్టమర్లతో ఉన్న నమ్మకాన్ని పెంచుకుంటారు. సెర్చ్ ఇంజిన్ల ట్రాఫిక్ని మెరుగుపరుచుకుంటారు. పెద్ద పెద్ద కంపెనీలతో కూడా మీరు పోటీ పడే అవకాశాన్ని ఇస్తుంది. బ్లాగింగ్ గురించి మరింత నేర్చుకునేందుకు డిజిటల్ బడి అందిస్తున్న ఆన్లైన్ కోర్సు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు యీ లింక్ ద్వారా కోర్సును ఇప్పుడే కొనండి. బ్లాగింగ్ నేర్చుకోవడానికి ఇది మంచి సమయం.
Use Discount Code: DIGITALJOHN to get 25% OFF
Blogging Articles in Telugu
బ్లాగింగ్ కోర్సు నేర్చుకునేందుకు సులువైన ప్లాట్ ఫాం ‘డిజిటల్ బడి’
బ్లాగింగ్ ద్వారా సంపాదించడానికి 4 ఉత్తమ మార్గాలు
బ్లాగింగ్ ద్వారా మీరు నేర్చుకునే 5 టాప్ స్కిల్స్ ఏంటి?