Table of Contents
“బ్లాగింగ్ చేయడం వలన మీరు ఏ స్కిల్స్‌ని నేర్చుకుంటారు?” అనే దానిపై ప్రత్యేక ఆర్టికల్

- కంటెంట్ మార్కెటింగ్ స్కిల్స్
- గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్
- వార్డుప్రెస్సు స్కిల్స్
- టెక్నికల్ స్కిల్స్
- డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ స్కిల్స్
కంటెంట్ మార్కెటింగ్ స్కిల్స్
కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏమిటో తెలుస్తుంది, కంటెంట్ అనేది ఒక టెక్స్ట్ రూపంలో ఉండవచ్చు లేదా ఇమేజ్ , వీడియో,ఆడియో రూపంలో ఆయన ఉండవచ్చు. దీనిని ఏ విధంగా మార్కెట్ చేయవచ్చు అనే విషయాన్నీ నేర్చుకుంటాం. కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి, కంటెంట్‌ని ఆన్లైన్ రీడర్స్ కోసం ఏ విధంగా రాయాలి, మనం కంటెంట్‌ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేది బ్లాగింగ్ ద్వారా మనం ప్రాక్టికల్‌గా నేర్చుకుంటాం.
డిజిటల్ మార్కెటింగ్‌లో ఏదైనా ప్రాక్టికల్‌గా చేసి నేర్చుకోవాలి అనుకుంటే బ్లాగింగ్ ద్వారా కొంత వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందులో కంటెంట్ మార్కెటింగ్ ఒకటి. ప్రస్తుతం మంచి కంటెంట్ మార్కెటర్స్కి మార్కెట్లో చాలా కొరత ఉంది. మంచి కంటెంట్ రైటర్లకు కూడా కొరత ఉంది. బ్లాగింగ్ ద్వారా మీరు కంటెంట్ మార్కెటింగ్‌ని నుర్చుకోవచ్చు.
గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్
గ్రాఫిక్ డిజైన్ ,ఇన్ఫోగ్రాఫిక్స్ ఇమేజెస్ ఏ విధంగా ఉంటే యూజర్ యొక్క దృష్టిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి అనే విషయం గురించి బ్లాగింగ్ చేసే సమయంలో నేర్చుకుంటారు, ఫాంట్ స్టైల్ ఎలా ఉండాలి? ఏ సైజు లో ఉండాలి? ఇమేజెస్ సైజు ఎంత ఉండాలి? హెడ్డింగ్ ఏ కలర్ లో ఉంచితే ఆర్టికల్ చూడటానికి చక్కగా కనిపిస్తుంది అనే విషయాన్నీ గురించి నేర్చుకుంటారు.
గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఇది ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనింగ్ గురించి కాదు. కాకపోతే బ్లాగింగ్ అవసరమైన గ్రాఫిక్ డిజైనింగ్ బేసిక్స్‌ని మీరు నేర్చుకుంటారు. కాన్వా లాంటి టూల్స్ మనకు చాలా అవసరం బ్లాగింగ్‌కి. కలర్స్, ఫాంట్స్, డైమెన్షన్లు, ఆకట్టుకునే ఇన్ఫోగ్రాఫిక్స్, ఇలా మనం కొంత గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుంటాం. కొంత క్రియేటివీటీ కూడ ఉంటే ఇంకొంచెం మెరుగ్గా రాణించగలం బ్లాగింగ్లో
వార్డుప్రెస్సు స్కిల్స్
వార్డుప్రెస్సు అత్యంత కీలకమైన స్కిల్. మీరు మీ రెజ్యూమ్‌లో కూడా దీనిని ఒక స్కిల్‌గా చేర్చవచ్చు. బ్లాగింగ్ చాలా ప్లాట్పాంస్ ఉన్నప్పటికీ వార్డుప్రెస్సు అతి ముఖ్యమైనది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. 27 శాతం ఇంటర్నెట్ మొత్తం వార్డుప్రెస్సు పైనే ఉందంటే అతిశయోక్తి కాదు. అటువంటి వార్డుప్రెస్సుని మీరు బ్లాగింగ్ ద్వారా తప్పక నేర్చుకోవలసి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకునే వారు ఖచ్చితంగా వార్డుప్రెస్సులోనే బ్లాగింగ్ చేయండి. వార్డుప్రెస్సు మీకు ముందు ముందు చాలా నేర్పిస్తుంది.
టెక్నికల్ స్కిల్స్
కొంత టెక్నికల్ స్కిల్స్ అవసరం మనకు బ్లాగింగ్ చేయడానికి. ఇవి బేసిక్ టెక్నికల్ స్కిల్స్యే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా బ్లాగింగ్ చేస్తూనే నెమ్మదిగా నేర్చుకోవచ్చు. యీ ఆర్టికల్ చదువుతున్న మీరు కూడా బ్లాగింగ్ ద్వారా టెక్నికల్ స్కిల్స్‌ని మీకు తెలియకుండానే నేర్చుకుంటారు. బ్లాగింగ్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించవచ్చు.
డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ స్కిల్స్
బ్లాగింగ్ నేర్చుకునే సమయంలోనే మీరు డిజిటల్ మార్కెటింగ్‌కి అవసరమైన స్కిల్స్‌ని కూడా నేర్చుకుంటారు. వాటిలో సోషల్ మీడియా మార్కెటింగ్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, ఇమెయిల్ మార్కెటింగ్. బ్లాగింగ్ ద్వారా వీటిని నేర్చుకోవడానికి బలమైన పునాదిని వేసుకోవచ్చు. అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని బ్లాగింగ్ కోర్సును తయారు చేసాను నేను. 25+ ట్యూటోరియల్స్తో యీ కోర్సు ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవాళ్ళు క్రింద ఇచ్చిన లింక్‌తో కోర్సును ఆన్లైన్ ద్వారా కొనండి.
మీరు బ్లాగింగ్ ను ఒక ప్రొఫ్ఫెషనల్ లాగ చెయ్యాలి అనుకుంటే పెయిడ్ కోర్స్ లో జాయిన్ అవ్వండి.
మీరు ఎన్ని వేలు పెట్టి కోర్స్ లో జాయిన్ ఐన, సపోర్టు సరిగ్గా ఇవ్వడం లేదు బయట. కానీ డిజిటల్ బడి కోర్సులో చేరిన వారికి డిజిటల్ బడి సపోర్టు టీం ద్వారా ఖచ్చితంగా విద్యార్థుల సందేహాలను ఆన్లైన్ ద్వారా నివృత్తి (క్లియర్) చేస్తాం.
డిజిటల్ బడి తెలుగు బ్లాగింగ్ కోర్సు రివ్యూ
ఈ ఆర్టికల్‌పై ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు క్రింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను