డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి ? ఎందుకు నేర్చుకోవాలి?

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి ? ఎందుకు నేర్చుకోవాలి?

digital badi featured image

Digital Marketing Course in Telugu - Digital Badi Academy

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి ?

అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ ను వినియోగిస్తున్న ఈ యుగంలో (ఈ డిజిటల్ ప్రపంచంలో), ఇంటర్నెట్ ను ఆధారంగా చేసుకొని  ఉత్ప‌త్తిని కానీ, సేవలను కానీ ఇంట‌ర్నెట్ ద్వారా ఈ ప్రపంచానికి ప‌రిచ‌యం చేస్తూ అమ్మ‌కాలు జ‌ర‌ప‌డ‌మే డిజిటల్ మార్కెటింగ్.

ఉదాహరణ కి మొబైల్ ఫోన్ ద్వారా గాని యాడ్స్ ద్వారా  గాని , సోషల్ మీడియా ద్వారా కానీ మొదలగునవి.

digital badi featured image

డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి?

డిజిట‌ల్ మార్కెటింగ్ నేర్చుకోవ‌డానికి కొన్ని కార‌ణాలు

 1. ఉద్యోగం కోసం
 2. కెరీర్ శిప్ట్ (ఉద్యోగం మార్పు కోసం)
 3. ఫ్రీలాన్స‌ర్‌గా సొంతంగా సేవ‌లు అందిచ‌డానికి
 4. ఉన్న వ్యాపారాన్ని డిజిట‌ల్‌గా మార్కెటింగ్ చేసుకోవ‌డానికి
 5. సొంతంగా డిజిట‌ల్ మార్కెటింగ్ ఏజెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి

పైన పేర్కొన‌బ‌డిన వాటి గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం

1. ఉద్యోగం కోసం

ప్ర‌స్తుతం అత్య‌ధిక ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తున్న రంగాల‌లో డిజిట‌ల్ మార్కెటింగ్ ఒక‌టి. మార్కెట్‌లో చాలా ఉద్యోగ అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ, స‌రైన డిజిట‌ల్ మార్కెటింగ్ నిపుణులు లేక‌పోవ‌డంతో కంపెనీలకు త‌మ ఉత్ప‌త్తుల‌ను మ‌రియు సేవ‌ల‌ను ప్ర‌భావ‌వంతంగా డిజిట‌ల్ మార్కెటింగ్ చేయ‌లేక‌పోతున్నారు. నిపుణుల కొర‌త తీవ్రంగా ఉంది. ఈ రంగంలో ఉన్న‌ కొన్ని ఉద్యోగాల వివ‌రాలు

 1. డిజిట‌ల్ మార్కెటింగ్ మేనేజ‌ర్‌
 2. కంటెంట్‌ మార్కెట‌ర్‌
 3. ఇన్‌బౌండ్ మార్కెటింగ్ మేనేజ‌ర్‌
 4. సోష‌ల్ మీడియా మార్కెట‌ర్‌
 5. సెర్చ్ ఇంజిన్ మార్కెట‌ర్‌
 6. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేష‌న్‌ స్పెష‌లిస్ట్‌
 7. ఇమెయిల్ మార్కెట‌ర్‌, etc.,

2. కెరీర్ శిప్ట్ (ఉద్యోగం మార్పు కోసం)

చాలా కాలంగా ఉద్యోగం చేసే వారికి ఉద్యోగం గానీ, లేదా వారు ప‌ని చేస్తున్న ఇండ‌స్ట్రీ గాని మారాల‌ని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఉద్యోగం మారాల‌ని అనుకుంటే డిజిట‌ల్ మార్కెటింగ్ ఒక మార్గం. డిజిట‌ల్ మార్కెటింగ్ అని మాత్ర‌మే కాదు, ఎవ‌రికి న‌చ్చిన రంగాన్ని వారు ఎంచుకొని రాణించొచ్చు.

Telugu Digital Marketing Course

3. ఫ్రీలాన్స‌ర్‌గా సొంతంగా సేవ‌లు అందిచ‌డానికి

ఫ్రీలాన్స‌ర్ అంటే స్వ‌యం ఉపాధి అనుకోవ‌చ్చు, అంటే ఒక నిర్ణీత డిజిట‌ల్ మార్కెటింగ్ ప‌ని కోసం గానీ, ఒక ప్రాజెక్ట్ కోసం గానీ ప‌ని చేయ‌డం. ఇలా రాణించాలంటే ముందు మీరు డిజిట‌ల్ మార్కెటింగ్‌లో ప్రావీణ్యులై ఉండాలి. డిజిట‌ల్ మార్కెటంగ్‌లో చాలా విభాగాలు ఉన్నాయి. ఏదైనా ఒక విభాగంలో ప్రావీణ్యాన్ని సంపాదించి అదే రంగానికి సంబంధించిన సేవ‌ల‌ను ఫ్రీలాన్స‌ర్ ఇవ్వొచ్చు.
ఉదాహ‌ర‌ణ‌కు, నేను సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ నేర్చుకున్నాను, కాబ‌ట్టి కేవలం సెర్చ్ ఇంజిన్ మార్కెటంగ్ సేవ‌ల‌ను మాత్ర‌మే కంపెనీల‌కు ఇస్తాను.

4. ఉన్న వ్యాపారాన్ని డిజిట‌ల్‌గా మార్కెటింగ్ చేసుకోవ‌డానికి

మీకు ఇంత‌కు ముందే ఉన్న వ్యాపారాన్నిఆన్‌లైన్‌లోకి తీసుకెళ్ళాల‌నుకుంటే డిజిట‌ల్ మార్కెటింగ్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీకు ప‌చ్చ‌ళ్ళు త‌యారు చేసే వ్యాపారం ఉందనుకోండి, మీరు కావాల్సిన లీగ‌ల్ అనుమతులు తీసుకొని కేవ‌లం ప‌చ్చ‌ళ్ళను మాత్ర‌మే ఆన్‌లైన్ ద్వారా విక్ర‌యించొచ్చు. ఆన్‌లైన్‌లో వ్యాపారాన్ని ప్రారంభించ‌డానికి ఎక్కువ ఖ‌ర్చు ఏం కాదు.

5. సొంతంగా డిజిట‌ల్ మార్కెటింగ్ ఏజెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి

డిజిట‌ల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది మీకు డిజిటల్ మార్కెటింగ్‌కి కావాల్సిన నిపుణుల బృందం ఉంద‌నుకుంటే ఈ వ్యాపారాన్ని ప్రారంభించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఉన్న డిజిట‌ల్ మార్కెటింగ్ స‌ర్వీస్‌ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ వ్యాపారంలోకి రావ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం. అందులో యాక్సెంచ‌ర్‌, కాగ్‌నిజెంట్, మొద‌లయిన‌వి ఉన్నాయి. డెల్ కంపెనీ కూడా ఇటీవ‌ల యీ రంగంలోకి అడుగు పెట్టింది.

మీ అవ‌స‌రత ఉద్యోగం కోస‌మైనా, ఉన్న వ్యాపారాన్ని ఇంట‌ర్‌నెట్ ద్వారా అభివృద్ధి చేసుకోవాల‌నుకున్నా, ఫ్రీలాన్స‌ర్‌గా రాణించాల‌నుకున్నా, లేదా సొంతంగా ఆన్‌లైన్ ద్వారా వ్యాపారాన్నిప్రారంభించాలన్నా లేదా ఏజెన్సీ ప్రారంభించాల‌న్నా, ముందు మీరు డిజిట‌ల్ మార్కెటింగ్‌ని స‌రిగ్గా నేర్చుకుంటేనే మీరు ఈ రంగంలో రాణించ‌గ‌ల‌రు. డిజిట‌ల్ మార్కెటింగ్ నేర్చుకోవ‌డం కోసం డిజిట‌ల్ బ‌డి అందిస్తున్న ఆన్‌లైన్ డిజిట‌ల్ మార్కెటింగ్ కోర్సులో చేరి కూడా మీరు డిజిట‌ల్ మార్కెటింగ్ నేర్చుకోవ‌చ్చు. ఈ కోర్సును డిజిట‌ల్ జాన్‌ ప్రత్యేక శ్ర‌ద్ధ‌తో తెలుగు వారి కోసం తెలుగు భాష‌లో కోర్సును త‌యారు చేసి మీకు అందిస్తున్నాడు. కోర్సు గురించి మీకు ఏమైనా వివ‌రాలు కావాల‌నుకుంటే మీరు డిజిట‌ల్ బ‌డిని సంప్ర‌దించ‌వ‌చ్చు.

 

[email protected]

+91 9573439404

 ద‌య‌చేసి ఈ ఆర్టిక‌ల్‌ని షేర్ చేయండి

ఇత‌ర డిజిట‌ల్ మార్కెటింగ్ ఆర్టిక‌ల్స్‌

డిజిటల్ మార్కెటర్ కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి?

డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఎలా ?

డిజిటల్ బడి యొక్క డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎలా ఉంటుంది?

Written by
Digital John

Digital John

Digital John is digital marketing and content marketing practitioner, trainer, blogger, YouTuber with qualified Management education in Marketing Specialisation from Vanguard B-School. He won Best Digital Marketing Blogger in India Award in 2018 from Feedspot.