యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలంటే మంచి కెమెరా , మైక్ , ఇంకా మనకు కావాల్సిన equipment గురించి నేను మీకు యీ ఆర్టికల్ ద్వారా ఇస్తాను.
Camera
మంచి కెమెరా అంటే మన దగ్గర ఉన్న కెమెరానే మంచి కెమెరా. అది మొబైల్ కెమెరా అయినా సరే. ఒకవేళ మీరు మంచి కెమెరా కొనాలి అనుకుంటే మీరు తీసే వీడియోలను బట్టి ప్రొఫెషనల్ కెమెరామెన్ ని సంప్రదించి కెమెరా ని కొనండి. ప్రస్తుతం వస్తున్నా స్మార్ట్ ఫోన్లకు కెమెరా బాగానే ఉంటుంది. ప్రారంభంలో మనం మన దగ్గర ఉన్న మొబైల్ కెమెరా తో వీడియోలను షూట్ చేయొచ్చు.
Tripod
Tripod ఉంటేనే వీడియోని బాగా షూట్ చేయడానికి వీలు అవుతుంది. కెమెరా ని ఒక frame లో సెట్ చేసుకొని మనం షూట్ చేసుకోవొచ్చు. నేను ప్రస్తుతం Amazon Basics Tripod ని వాడుతున్నాను. యీ tripod ని మనం ప్యాక్ చేసుకొని మన బ్యాగ్ లో తీసుకెళ్లవచ్చు. ఇది వాడిన తరువాత కూడా అంతే జాగ్రత్తగా ప్యాక్ చేసి బ్యాగ్ లో పెట్టుకోవాలి. outdoor షూటింగ్స్ లో కూడా యీ tripod ని వాడుకోవొచ్చు.
Mic
ఒక వీడియో లో వీడియో కి మనం ఎంత ప్రాధాన్యతని ఇస్తామో, అంతే ప్రాధాన్యతని మనం ఆడియో కి కూడా ఇవ్వాలి. మనం వాడే మొబైల్ కెమెరాలో కూడా మైక్ ఉంటుంది కానీ ఆ mic అంత క్లియర్ గ ఉండదు. పైగా కెమెరా మనకు దూరంగా ఉండి షూట్ చేయాల్సి వచ్చినప్పుడు mic కూడా దూరంగా ఉంటుంది. అటువంటి సమయాల్లో ఆడియో సరిగ్గ రికార్డు అవ్వదు. ఇటువంటి సమస్యని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా mic ఉండాల్సిందే. ప్రారంభంలో మనం బోయా mic తో స్టార్ట్ చేయొచ్చు. నేను ప్రస్తుతం బోయా mic నే వాడుతున్నాను యూట్యూబ్ వీడియోస్ కోసం.
Lighting
రాత్రి రికార్డు చేస్తున్న సమయాల్లో కానీ, వెలుతురు సరిగ్గా లేని స్థలాల్లో వీడియో ని క్లియర్ గ రికార్డు చేయాలంటే మంచి లైటింగ్ ఉండాల్సిందే. నేను ప్రస్తుతం LED Ring Light వాడుతున్నాను. Yellow, White, Yellow + White లో లైటింగ్ సెట్ చేసుకోవొచ్చు. యీ light స్టాండ్ కె మన మొబైల్ పెట్టుకొనే హోల్డర్ ఉంటుంది కానీ అది indoor షూటింగ్స్ లో మాత్రమే వాడుకోవొచ్చు. outdoor షూట్ కి అనుకుంటే మీరు tripod కొనాల్సిందే.
Video Editing Apps
- InShot
- Premiere Rush (if your mobile supports)
- Kinemaster
మీరు మీ laptop గాని desktop లో గాని వీడియో ఎడిటింగ్ చేయాలి అనుకుంటే davinci resolve అనే ఫ్రీ వీడియో ఎడిటింగ్ టూల్ ని download చేసుకొని ఎడిటింగ్ చేయండి. ఫ్రీ వెర్షన్ ని మాత్రమే డౌన్లోడ్ చేయండి.
other resources
మీకు అవసరం అవ్వొచ్చు అనుకొని ఇస్తున్న వీడియో లింక్స్
How to Create YouTube Channel? (PART-1)
How to Create YouTube Channel? (PART-2)
How to Design YouTube Thumbnails?
Canva Tutorial in Telugu – Digital John