Table of Contents
నేను ఇంతకు ముందే బ్లాగ్ టాపిక్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే అంశం పై ఒక ఆర్టికల్ ని రాసాను. అయితే, యీ ఆర్టికల్ లో ఇంకా వివరంగా రాయడానికి ప్రయత్నిస్తున్నా…
ఇటీవలే నేను బ్లాగ్ ని ప్రారంభించకపోవడానికి గల కారణాలను పరిశీలించినప్పుడు బ్లాగ్ ఏ టాపిక్ పై చేయాలో మాకు తెలియదు అని చాలా మంది సమాధానం ఇచ్చారు. బ్లాగ్ టాపిక్ ఎంపిక విషయంలో స్కిల్ & Passion ఖచ్చితంగా ఉండాల్సిందే. వాటితో పాటు ఉండాల్సిన మార్కెట్ అవకాశాల గురించి యీ ఆర్టికల్ లో కొంచెం లోతుగా తెలుసుకుందాం.
1. మార్కెట్ అవకాశాలు
బ్లాగ్ ద్వారా మనం డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలి అంటే ఉండాల్సిన ఆదాయ వనరులు కూడా ఉండాలి. ఎక్కువ శాతం బ్లాగర్స్ వాళ్ళ బ్లాగ్ ని సొంత products ని తయారు చేసి అమ్మడం ద్వారా & అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. అన్ని రకాల బ్లాగ్ లకు అన్ని రకాల ఆదాయ వనరులు ఉండవు.
ఉదాహారణకు: న్యూస్ బ్లాగ్ లో information products ని తయారు చేయడం కష్టం . (Online courses, e-books లాంటివి)
ట్రాఫిక్ ఎక్కువ వస్తున్న న్యూస్ బ్లాగ్ అయితే గూగుల్ యాడ్సెన్స్ ద్వారా డబ్బు సంపాదించొచ్చు. బ్లాగ్ ఆదాయ వనరులు అన్నింటిని మీకు ఇస్తాను ఇక్కడ. కాకపొతే అది మీరు ఎంచుకునే టాపిక్ కి కుదురుతుందో లేదో మీరు కూడ చెక్ చేసుకోండి.
2. బ్లాగ్ ఆదాయ వనరులు
- Selling own information products (సొంత ఉత్పత్తులను తయారు చేసి అమ్మడం)
- అఫిలియేట్ మార్కెటింగ్
- గూగుల్ యాడ్సెన్స్
- E-Books
- Membership
- ఆన్ లైన్ కోర్సులు
- ప్రీమియం న్యూస్ లెటర్ (ఇమెయిల్ మార్కెటింగ్ ద్వారా)
- స్పాన్సర్డ్ పోస్ట్ (Sponsored Posts)
మీకు నేను ఇచ్చిన కొన్ని ఆదాయ వనరులలో మీరు ఎంచుకునే టాపిక్ కి ఏయే ఆదాయ వనరుల అవకాశాలు ఉన్నాయో ఒక్క సారి చెక్ చేసుకోండి. ఎంత ఎక్కువ ఆదాయ వనరుల అవకాశాలు ఉంటె అంత మంచిది.
3. ఎడ్యుకేషన్ బ్లాగ్ (ఉదాహారణకు)
ఎడ్యుకేషన్ బ్లాగ్ ని ఉదాహరణకి తీసుకొని మీకు నేను ప్రాక్టికల్ గ ఎలా బ్లాగ్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ నేను ఎంసెట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ని మాత్రమే తీసుకుంటున్నాను.
ఎంసెట్ ఆన్లైన్ కోర్స్ చేయవచ్చు
ఇతర ఎంసెట్ ఆన్లైన్ రిసోర్సెస్ కి అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు
గూగుల్ యాడ్సెన్స్ కూడా చేయొచ్చు
ఎంసెట్ ప్రిపరేషన్ పై e-book మాత్రామే కాదు, ప్రింటెడ్ బుక్ కూడా రిలీజ్ చేయొచ్చు. ఇంచు మించు 30 వేల రూపాయల ఖర్చు అవుతుంది. దానికి తగ్గట్టే ఆదాయం కూడా ఉంటుంది. బుక్ పబ్లిషింగ్ ద్వారా ఇండస్ట్రీ లో మంచి అథారిటీ ని సంపాదించొచ్చు.
ఒక్క రోజు ఎంసెట్ వర్క్ షాప్, క్రాష్ కోర్సు, ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఇంకా ఎక్కువే ఆదాయ వనరులను చేర్చవచ్చు. రాష్ట్రంలో no.1 ఎంసెట్ కోచింగ్ institute గ నిలదొక్కుకోవాలి. భవిష్యత్తులో వేరే కోర్సుల కోచింగ్ ని కూడా ప్రవేశపెట్టి మరిన్ని బ్రాంచీలతో , ఫ్రాంచైజ్ సెంటర్స్ తో వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావొచ్చు. ఇదంతా ఒక చిన్న బ్లాగ్ తో ప్రారంభించి నెమ్మదిగా డెవలప్ చేయొచ్చు. అంతటి శక్తి బ్లాగ్ కి ఉంది.
4. బ్లాగ్ ద్వారా ప్రారంభం అయి….
బిజినెస్ & స్టార్ట్ అప్ న్యూస్ కి మనం యీ రోజు చదువుతున్న యువర్ స్టోరీ ఒక బ్లాగ్ గానే ప్రారంభం అయింది. యువర్ స్టోరీ no .1 మీడియా కంపెనీ స్టార్ట్ అప్ & బిజినెస్ కి.
ఒక బ్లాగ్ ని సక్సెస్ గ తీసుకు రావాలంటే కొంత సమయం పడుతుంది. చాలా ఓపిక కావాలి. మనం ముందే తీసుకునే టాపిక్ కి కట్టుబడి ఉండాలి. నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఆ టాపిక్ పై మీకు knowledge / skill & Passion ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేకనే చాలా మంది బ్లాగర్లు సక్సెస్ ని చూడలేకపోతున్నారు. అంతే కాదు, బ్లాగ్ ని నడిపించాలి అంటే కొంత డబ్బు ఖర్చు అవుతుంది. డొమైన్ పేరుకు & వెబ్ హోస్టింగ్ కి. ప్రారంభంలో కొంత పెట్టుబడి ఉంటుంది.
మీరు మీకు నచ్చిన టాపిక్ ఏదైనా ఉంటె, ఆ టాపిక్ కి మార్కెట్ అవకాశాలు ఉంటె త్వరలోనే ఒక బ్లాగ్ ని ప్రారంభించండి. మీకు బ్లాగింగ్ లో సక్సెస్ రావాలని మా ఆకాంక్ష.
బ్లాగింగ్ నేర్చుకోవాలంటే చాలా ఆన్లైన్ కోర్సులు ఉన్నాయ్. తెలుగు భాషలో మీరు బ్లాగింగు నేర్చుకోవాలి అనుకుంటే మీరు డిజిటల్ బడి అందిస్తున్న బ్లాగింగ్ కోర్స్ ద్వారా నేర్చుకోవొచ్చు.
5. ఆడియన్స్ నిర్మాణం
పైన నేను మీకు ఇచ్చిన ఆదాయ వనరులలో ఎలా మీరు డబ్బు సంపాదించాలి అనుకున్నా సరే, ముందు మీరు బ్లాగ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ ఆడియన్స్ ని నిర్మించాలి. కనీసం 500 మంది subscribers ని నిర్మించండి (యూట్యూబ్ ఛానల్ subscribers అయినా సరే ఇమెయిల్ subscribers అయినా సరే). ఆడియన్స్ ని నిర్మించడం పై మన దృష్టి ఉండాలి ప్రారంభంలో. దాని తర్వాత యీ ఆడియన్సు ద్వారానే డబ్బు సంపాదిస్తాం. ఆడియన్స్ నిర్మించడానికి ఒక్క సంవత్సరం సమయం కావాలి కనీసం (సగటు).
కోరా వెబ్సైటు 8 సంవత్సరాలు ఆడియన్స్ ని నిర్మించింది, దాని తర్వాతనే Advertising ని ప్రవేశ పెట్టి డబ్బును సంపాదిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మేము డిజిటల్ బడి కి కూడా కావాల్సిన ఆడియన్స్ ని బ్లాగ్ మరియు డిజిటల్ జాన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నెమ్మదిగా నిర్మిస్తున్నాం. ఆడియన్స్ నిర్మాణం గురించి మరియు కంటెంట్ మార్కెటింగ్ గురించి నేను మరిన్ని ఆర్టికల్స్ మరియు వీడియో ట్యుటోరియల్స్ ని సిద్ధం చేస్తున్నాం. మా విలువైన అప్ డేట్స్ ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి.
Contact us to learn blogging course in telugu
Check our Digital Marketing Course in Telugu
[mailerlite_form form_id=2]