Table of Contents
మీరు మీ వ్యాపారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలనుకున్నప్పుడు, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోవాలి? అనేది చాలా మందికి ఉన్న సందేహం. మీ వ్యాపారానికి ఏది సరైనదో తెలుసుకొనటానికి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవాలి. అదే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.
మీ వ్యాపారం కోసం సరైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకునే ముందు మీరు అడగవలసిన ప్రశ్నలను మేము మొదట వివరిస్తాను. అప్పుడు, సరైన వాటిని గుర్తించడంలో మీకు సహాయపడటానికి మేము ఏడు ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల గురించి కొంత సమాచారాన్ని అందిస్తాము.
వాటిని బట్టి మీ వ్యాపారానికి ఏ సోషల్ మీడియా వెబ్‌సైట్ సరైనది అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
1. మన టార్గెట్ కస్టమర్స్ ఏ సోషల్ మీడియా లో ఎక్కువ ఉన్నారు?
ప్రస్తుతం చాలా సోషల్ మీడియా వెబ్‌సైట్లు, యాప్‌లో చాలానే ఉన్నాయి. అయితే, మన వ్యాపారానికి కస్టమర్లు అయ్యే అవకాశం ఉన్న జనాభా (Prospects) ఏ సోషల్ మీడియా వెబ్‌సైట్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారో మనకు తెలియాలి. లేకపోతే మనం నష్టపోతాం. ప్రస్తుతం విరివిగా వాడుతున్న కొన్న సోషల్ మీడియా వెబ్‌సైట్లు & యాప్‌లలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, రెడ్డిట్, ట్విట్టర్, లింక్డిన్, టిక్‌టాక్, హలో, కోరా ఇలా చాలానే ఉన్నాయి. అన్ని సోషల్ మీడియా వెబ్‌సైట్లపై కూర్చొని సోషల్ మీడియా మార్కెటింగ్ చేసేంత సమయం ఏ సోషల్ మీడియా మార్కెటింగ్ వ్యక్తికి ఉండదు కాబట్టి ఎక్కువ సమయాన్ని ఏ సోషల్ మీడియా వెబ్‌సైట్ లేదా యాప్‌లో వాడుతున్నారో మనకు తెలియాలి.
[Tweet “మీ బిజినెస్‌కి బెస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంని ఎలా ఎంపిక చేసుకోవాలి? @digitaljohn”]ఉదాహరణకు, మీరు 65+ సంవత్సరాల వయస్సు ఉన్నవారి కోసం ఒక ప్రోడక్ట్ ని అమ్ముతుంటే , మీరు ట్విట్టర్ లేదా రెడ్డిట్ వంటి సోషల్ మీడియాలను ఎంచుకోకూడదు. ఆ వయస్సులో చాలా తక్కువ మంది ఆ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు. బదులుగా, వారు ఉపయోగించే సోషల్ మీడియా పై మీ దృష్టి పెట్టాలి, ప్రధానంగా ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్ లాంటివి అన్నమాట.
మన టార్గెటెడ్ కస్టమర్స్ ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంని ఉపయోగిస్తున్నారో తెలుసుకోండి.
2. మీరు ఏ కంటెంట్‌ని సృష్టించగలరు?
Instagram మరియు Pinterest చిత్ర కంటెంట్‌పై దృష్టి సారించాయి. యూట్యూబ్ వీడియో కంటెంట్‌పై దృష్టి పెట్టింది. మీరు ఎక్కువగా టెక్స్ట్-ఆధారిత కంటెంట్‌ను ఉత్పత్తి చేసి, స్టాక్ చిత్రాలను ఉపయోగిస్తుంటే, ఈ ప్లాట్‌ఫారమ్‌లు మీకు సరైనవి కావు.
ఇటువంటి చిత్ర ఆధారిత సోషల్ మీడియాస్ కోసం మీరు ఒక వీడియోగ్రాఫర్‌ని, ఒక డిజైనర్ ని నియమించుకోవడం అనవసరం. మీరు టెక్స్ట్ బేసెడ్ సోషల్ మీడియాస్ కి వెళ్ళండి. ఫేస్బుక్, ట్విట్టర్, రెడ్డిట్, లింకెడిన్ ఇవి అన్ని చాలా వరకు టెక్స్ట్ బేసెడ్ సోషల్ మీడియాస్ కిందికి వస్తాయి.
మరో వైపు మీ వ్యాపారం ఇమేజ్ మరియు వీడియో బేసెడ్ అయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పటి సమాజం లో టెక్స్ట్ బేసెడ్ కన్నా ఇమేజ్ మరియు వీడియో కంటెంట్ నే ఎక్కువ శాతం ఇష్టపడుతున్నారు.
3. మీ పోటీదారులు ఏ సోషల్ మీడియాలో ఉన్నారు?
మీ పోటీదారులు నిర్దిష్ట సోషల్ మీడియా తో విజయం సాధిస్తుంటే, మీరు కూడా అక్కడ బాగా రాణించవచ్చు. దీనికి విరుద్ధంగా, మీ పోటీదారులు సోషల్ మీడియా ని నిర్లక్ష్యం చేస్తుంటే, ఆ నిర్లక్ష్యం చేయబడిన మార్కెట్‌ను ఉపయోగించుకునే అవకాశం మీకు ఉంటుంది.
సాధారణంగా అన్ని వెబ్‌సైట్లలో సోషల్ మీడియా ఐకాన్స్ ఇచ్చి వాటిని సోషల్ మీడియాస్ కు లింక్ ఇస్తారు. కాబట్టి మనం సులభంగా మన పోటీదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ ని మరియు. వాళ్ళు వాడుతున్న నిర్దిష్ట సమయాన్ని అంచనావేసి. వారిపైన సులువుగా పోటీచేయచ్చు.
4. ఆర్గానిక్ రీచ్ ఎంత ఉందో తెలుసుకోండి?
ఆర్గానిక్ రీచ్ అంటే మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎంతమందికి అది రీచ్ అవుతుంది అనేది. ఇప్పుడు మీ ఫేస్‌బుక్ పేజీకి 500 లైకులు ఉన్నాయి కాబట్టి ఏదైనా పోస్ట్ చేస్తే ఆ 500 మందికి మీ పోస్ట్ రీచ్ అవ్వదు. అందులో 1 లేదా 2% రీచ్ అవ్వొచ్చు సగటున. కాబట్టి ఆర్గానిక్ రీచ్ ఎంత ఉంది అనేది కనుక్కోండి
ఈ సోషల్ మీడియా లో చెప్పుకోతగ్గ విషయం ఏంటి అంటే followers మరియు subscribers అవకాశం ఉండటమే.
- యూట్యూబ్ వీడియోలు, రెడ్డిట్ పోస్ట్లు, ట్విట్టర్ ట్వీట్లు, లింక్డ్ఇన్ ఆర్టికల్స్ మరియు పిన్‌ట్‌రెస్ట్ పిన్స్ గూగుల్ ఇండెక్స్ చేస్తుంది. కాబట్టి సాధారణ గూగుల్ సెర్చ్ లో కూడా కంటెంట్‌ని కనుగొనగలరు.
- ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, ట్విట్టర్, పిన్‌ట్‌రెస్ట్, యూట్యూబ్ మరియు రెడ్‌డిట్‌తో సహా ఈ ఆర్టికల్‌లో మనం చూస్తున్న అన్ని సోషల్ మీడియాస్ కోసం ప్రొఫైల్ పేజీలు / ఛానెల్‌లు గూగుల్ ఇండెక్స్ చేయబడి ఉంటాయి.
అంతే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియా వెబ్‌సైట్లు కూడా వాటి అల్గారిథమ్స్‌ని మార్చుకుంటున్నాయి. కొన్ని సార్లు మన ఫాలోయర్స్ కి కూడా మన పోస్ట్లు రీచ్ కాకుండా పోతుంటాయి.
ఉదాహరణకి: 2018 లో ఫేస్బుక్ అల్గారిథమ్స్‌ని మార్చింది. స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఈ అల్గారిథమ్స్ ముఖ్య ఉద్దేశం. చాలా వరకు కంపెనీలు ఆర్గానిక్ రీచ్‌ని కోల్పోయాయి.
5. ప్రకటన అవకాశాల గురించి?
మీరు డబ్బు ఖర్చు చేస్తే Organic రీచ్ ఏమి పెద్ద సమస్య కాదు. చాలా వరకు సోషల్ మీడియా వెబ్‌సైట్లు ఇప్పుడు ప్రకటనలు స్వీకరిస్తున్నాయి. మీరు యాడ్స్ రన్ చేస్తే, పిండి కొద్దీ రొట్టె అంటూ పని చేస్తాయి.
ఉదాహరణకి: Facebook, LinkedIn దగ్గర చాలా డేటా ఉంటది, మనం వాటితో క్షుణ్ణంగా మన కస్టమర్స్ ని రీచ్ అవ్వొచ్చు.
ఇటీవలె నేను టిక్‌టాక్, కోరా మరియు లింక్డిన్ వెబ్‌సైట్లలో యాడ్స్ (ప్రకటనలు) ఎలా రన్ చేయాలో నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాల్సి ఉంది
6. మీరు స్థిరంగా సోషల్ మీడియాకు ఎంత సమయం కేటాయించగలరు?
చాలా వరకు అందరు చేసే తప్పు ఏంటి అంటే వ్యాపారం మొదలు పెట్టగానే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌పాంలో ఒక అకౌంట్ క్రీయేట్ చేయడం. తరువాత వాటిని మేన్‌టేన్ చేయటానికి సమయం ఉండకపోవడం లాంటి సమస్యలు తలెత్తొచ్చు. ఇలా చేయటం వలన మన బిజినెస్ ప్రొఫైల్ చాలా వెనుకబడిపోతుంది.
మీరు కొత్తదనాన్ని తీసుకువచ్చేంత సమయం లేదు అనుకున్నప్పుడు ఒకటి లేదా రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై దృష్టి పెట్టడం మంచి విధానం. ఇది మీకు కావాల్సినంత సమయాన్ని ఇస్తుంది సోషల్ మీడియాలో మీ ఫాలోయింగ్‌ని పెంచుకోవడానికి. ఒకవేళ మీరు ఎక్కువ సోషల్ మీడియా వెబ్‌సైట్లపై ఫోకస్ చేయాలని అనుకుంటే సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ టూల్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు సులువుగా మీ పనులను నిర్వహించవచ్చు.
మీ ఆడియన్స్‌ని మరియు మీ సోషల్ మీడియా మార్కెటింగ్ గోల్స్‌ని పరిగణలోకి తీసుకొని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలను ఎంచుకోండి.
Reach us to Learn Digital Marketing Course in Telugu
[mailerlite_form form_id=2]