Table of Contents
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఒక మాట అన్నారు “If your business is not on the internet, then your business will be out of business” అంటే “ఒక వేళ మీ వ్యాపారం గనుక ఇంటర్నెట్ లో లేకుంటే అసలు మీ వ్యాపారం వ్యాపారమే కాదు అని”, ఈ కరోనా వల్ల చాలా మంది ఆన్లైన్ షాపింగ్ కి అలవాటు పడిపోయారు, ఒక సర్వే ప్రకారం 5 సంవత్సరాల్లో జరిగే డిజిటల్ అభివృద్ధి ఒక్క 2020 సంవత్సరం లోనే జరిగింది. ఒకవేళ మీరు కూడా ఒక వ్యాపారాన్ని నడుపుతున్నటైతే మీ వ్యాపార అభివృద్ధి కోసం డిజిటల్ మార్కెటింగ్ ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ ఆర్టికల్ లో నేను మీకు అసలు చిన్న వ్యాపారులకు డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉపయోగపడుతుంది? అనే దానిపైన మాట్లాడుతాను .
ముందుగా ..!
1. మార్కెటింగ్ అంటే ఏంటి ?
మనకు సులువుగా అర్ధం అయ్యేలా చెప్పుకోవాలి అనుకుంటే, ఒక సర్వీస్ లేదా ప్రోడక్ట్ ని వినియోగదారులకు తెలియజేయడాన్ని మార్కెటింగ్ అంటారు. మార్కెటింగ్ చెయ్యడం ద్వారా వినియోగదారులకు మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి తెలుస్తుంది, కాబట్టి మనకు ఎక్కువ కస్టమర్స్ వస్తారు, అలా మనకు లాభాలతో పాటు వ్యాపార అభివృద్ధి కూడా అవుతుంది .
సరే ..! ఇదంతా బాగానే ఉంది కానీ మార్కెటింగ్ ఎలా చెయ్యాలి, ఎలాంటి మార్కెటింగ్ చెయ్యాలి అని మీకు సందేహం రావచ్చు ..!
అయితే మార్కెటింగ్ లో మనకు ముఖ్యంగా రెండు విధానాలు ఉన్నాయి .
- సంప్రదాయ మార్కెటింగ్
- డిజిటల్ మార్కెటింగ్
2. సంప్రదాయ మార్కెటింగ్
ఈ పద్దతి మీ అందరికి ముందుగానే తెలిసే ఉంటుంది, ఉదాహరణకు పోస్టర్స్, వార్తా పత్రికల్లో వచ్చే యాడ్స్ , బన్నెర్స్ , మరియు మ్యాగజిన్ ద్వారా ప్రచారం చేయడాన్ని సంప్రదాయ మార్కెటింగ్ అంటారు . ఇదీ చాలా పాత విధానం, కానీ చాలా మందికి అవగాహనా లేక ఈ డిజిటల్ యుగం లో కూడా ఇంకా దీనినే పాటిస్తున్నారు.
3. డిజిటల్ మార్కెటింగ్
డిజిటల్ మాధ్యమాల ద్వారా చేసే యాడ్స్ ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఉదాహరణకు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, Email మార్కెటింగ్.
4. డిజిటల్ మార్కెటింగ్ లో వల్ల ఉపయోగాలు ఏంటి ?
digital marketing for small businesses – Digital Badi Blog
1. మంచి లాభాలను పొందవచ్చు
డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీకు మంచి సేల్స్ అవుతాయి కాబట్టి మీరు మంచి లాభాలను ఆశించవచ్చు , అలాగే డిజిటల్ మార్కెటింగ్ కి మీరు ఖర్చు చేసిన ప్రతి రూపాయి కి రెండితలకంటే ఎక్కువ సంపాదించవచ్చు.
2. ఎక్కువ మందికి మీ వ్యాపారాన్ని చేరవేయచ్చు
మీ వ్యాపారం ఇంటర్నెట్ లో ఉండడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని ఎక్కువ మందికి చేరవేయచ్చు . అంటే ఇంటర్నెట్ వాడే ప్రతి ఒకరికి మీ వ్యాపారం గురించి తెలిసేలా చేయవచ్చు కాబట్టి మీకు మంచి సేల్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
3. టార్గెట్టెడ్ ఆడియన్స్
డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు మీ వ్యాపారానికి తగ్గ వ్యక్తులకు మాత్రమే మీ యాడ్స్ ని చూపించవచ్చు . ఉదాహరణకు మీరు ఒక పేపర్ యాడ్ కనుక ఇస్తే దాన్ని 10 సంవత్సరాల కుర్రాడి నుండి 80 సంవత్సరాల ముసలాడి వారకు దాన్ని చూసే అవకాశాలు ఉంటాయి, కానీ అదే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అయితే మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్లకు, ఏ ప్రాంతం వాళ్లకు, ఏ టైం లో చూపించాలి అనేది మీరు నియంత్రించవచ్చు.
5. చిన్న వ్యాపారాలు డిజిటల్ మార్కెటింగ్ లో ఏ మార్కెటింగ్ చేస్తే మంచిది ?
మీ వ్యాపారాన్ని బట్టి మీరు మీకు ఎలాంటి మార్కెటింగ్ అయితే బాగుంటుందో అది ఎంచుకోవడం మంచింది. ఎందుకంటే కొన్ని వ్యాపారాలకు గూగుల్ యాడ్స్ మంచి ఉంటె, మరికొన్నింటికి ఫేస్బుక్ యాడ్స్ మంచిగా ఉంటుంది. కాబట్టి మీ వ్యాపారానికి అనుగుణంగా ఏ మార్కెటింగ్ అయితే బాగుంటుందో దాన్ని ఎంచుకోండి .
మీకు ఏది ఎంచుకోవాలి అనే సందేహాలు అంటే డిజిటల్ జాన్ ని నేరుగా మీ ప్రశ్నలని కోరా ద్వారా అడగవచ్చు. డిజిటల్ జాన్ మీ ప్రశ్నలకు సమాధానాలను ఇస్తాడు.
6. డిజిటల్ మార్కెటింగ్ కి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి ?
డిజిటల్ మార్కెటింగ్ ని మనం కేవలం 200 రూపాయలతో కూడా మొదలు పెట్టవచ్చు. కానీ మీరు ఎక్కువ ఖర్చు పెడితే మీ వ్యాపారం గురించి ఎక్క్కువ మందికి చేరవేయబడుతుంది. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు.
7. డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి
ఒకవేళ మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలియకపోతే, మీరు మన డిజిటల్ బడి లో ఉన్న డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ద్వారా మీరు మన తెలుగు భాష లోనే చాలా సులువుగా నేర్చుకోవచ్చు.
Guest blog by కిరణ్ సామిలేటి
నమస్తే, నాపేరు కిరణ్ నేను గత 3 సంవత్సరాల నుండి బ్లాగింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నాను. నేను SEO మరియు బ్లాగింగ్ పైన తెలుగులో బ్లాగ్స్ రాస్తుంటాను.
Contact us to learn digital marketing course in Telugu