Telugu Blogs
డిజిటల్ బడి తెలుగు బ్లాగింగ్ కోర్సు రివ్యూ

హాయ్, నా పేరు ఉదయ్ తాటి. నేను బ్లాగింగ్ చేయడానికి గల కారణాలు మరియు బ్లాగింగ్ చేయడానికి సహకరించిన అన్ని విషయాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా మీకు వివరిస్తాను.
నాకు అసలు బ్లాగింగ్ చెయ్యాలని ఆలోచన రావడానికి గల కారణాలు:
నేను ఎక్కువగా ఆన్లైన్ లో సమయాన్ని గడిపేవాడిని. రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేవాడిని. అప్పుడు నాకు బ్లాగింగ్ అంటే అసలు ఏమి తెలియదు. ఆన్లైన్ లో జాబ్ చేయాలి అనే చిన్న కోరిక నాకు కలిగింది.
- దానికోసం ప్రతిరోజు ఆన్లైన్లో ఎలా జాబ్ చేయాలి?
- ఏ విధమైన జాబ్స్ మనకు దొరుకుతాయి?
- అసలు నాకున్న స్కిల్స్ ఏంటి?
అనే ప్రశ్నలతో జాబ్స్ వెతికేవాన్ని
ఆన్లైన్ లో జాబ్స్ చాలావరకు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాదు
చాలామంది మోసపోయాక వాళ్లకు జరిగిన అనుభవాన్ని మనకు తెలియజేస్తారు. అలాంటి ఆర్టికల్స్ అన్ని చదివి అసలు నిజంగా ఎటువంటి మోసం లేకుండా ఆన్లైన్ లో జాబ్స్ ఎలా చెయ్యాలి అనే విషయాన్నీ తెలుసుకున్నాను. జీవితంలో సూపర్ హీరో కావాలి అని చిన్నపాటి హీరో కూడా కాకుండా జీరో లా చాలామంది మిగిలిపోతున్నారు. దానికి గల కారణం మనకంటూ ఒక దారిచూపించే గురువు లేకపోవడం.
సరైన నిర్ణయాలు తీసుకోనే అంత తెలివి లేకపోవడం
కానీ ప్రస్తుతం మనకు అటువంటి సమస్యలు లేవు
మన తెలుగులో మంచి మంచి గురువులే ఉన్నారు
తమకున్న తెలివితేటలను తమతోనే ఆగిపోకుండా ఇతరులకు తమ తెలివితేటలను ఆన్లైన్ కోర్సుల ద్వారా పంచుతూ తమతో పాటు ఇతరులు కూడా గొప్పవాళ్ళు కావాలి అనే ఉద్దేశంతో మన డిజిటల్ జాన్ డిజిటల్ బడి అనే తెలుగు ఆన్లైన్ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించాడు. జాన్ ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ గా బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నారు.
యూట్యూబ్ మరియు బ్లాగ్స్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ మరియు బ్లాగింగ్ ను ఫ్రీ గా అందిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తూనే, అంత వర్క్ బిజీ లో ఉన్నా, మన తెలుగు వారి కోసం కొంత సమయాన్ని కేటాయించి యూట్యూబ్ మరియు బ్లాగ్స్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ మరియు బ్లాగింగ్‌ని ఆన్లైన్ కోర్సుల ద్వారా నేర్పిస్తున్నారు. జాన్ చెప్పిన విధంగా నేర్చుకుంటే డిజిటల్ మార్కెటింగ్ రంగంలో మంచి ఇంటర్న్షప్ /ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి.
Earn Money Online by Blogging – Digital Badi
ఇంటర్నెట్లో దొరికే కాన్టెంట్ ఎక్కువ శాతం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. తెలుగులో తెలుగు వారికోసం ఇలా నేర్పించండం అనేది ఒక మంచి కార్యక్రమం అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క విషయాన్ని మన తెలుగులో నేర్పిస్తూ మన తెలుగుకి అంటూ ఒక గుర్తింపుని ఇంటర్నెట్ లో తీసుకువచ్చారు.
మన తెలుగుకి ఇంటర్ నెట్ లో ఇంకొక 5 సంవత్సరాలలో చాలా డిమాండ్ పెరగబోతుంది
మన తెలుగులో కాన్టెంట్ ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు చాలా తక్కువ. తెలుగులో కాన్టెంట్ని కావాలి అనుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది అని గూగుల్ తెలియజేస్తుంది. గూగుల్ మన తెలుగు భాషలో రాసిన బ్లాగ్స్ కి కూడా యాడ్సెన్స్ అప్రూవల్ ఇస్తుంది.యీ విషయాన్ని డిజిటల్ జాన్ ఏనాడో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసి, తెలుగులో బ్లాగింగ్ చేస్తున్నవారిని ప్రోత్సహించాడు.
ప్రస్తుత కాలంలో ఏ చిన్న విషయం అయినా, సోషల్ మీడియాలో ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో మీకు తెలుసు. అంత పవర్ ఉన్న సోషల్ మీడియాస్ ను ఉపయోగించి ఎన్నో అద్భుతాలను చేయవచ్చు. మనం ఉదయాన్నే లేవగానే ఉపయోగించే టూత్ పేస్ట్ దగ్గర నుండి నైట్ వేసుకునే లైట్ వరకు ఒకరు మనకు చెప్పినవే అది డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్నెట్ కి వున్నా పవర్. ఇదంతా చెప్పుకుంటూ వెళితే ఎక్కడికో వెళుతుంది కానీ అసలు విషయానికి వస్తే.
ఆన్లైన్ అన్వేషణ
నేను కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్ లో నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను మన మాతృ భాషలో ఆర్టికల్ రూపంలో రాసి తెలియచేయాలనుకున్న. కానీ బ్లాగింగ్ చెయ్యడం నాకు రాదు.
అలా నేను బ్లాగింగ్ చేయడానికి కోర్స్ కోసం వెతుకుతున్నపుడు యూట్యూబ్ లో డిజిటల్ మార్కెటింగ్ గురించి వీడియోస్ మన తెలుగులో ఉండటం చూసా. మన తెలుగునే కదా ఒకసారి చూస్తే అసలేంటో తెలుస్తుంది అని ఆలా కొన్ని వీడియోస్ చూసా, క్లాసెస్ చాల సులువుగా అర్థం అవుతున్నాయి. అలా వీడియోస్ చూస్తుండగా నాకు కావలసిన బ్లాగింగ్ కోర్సు గురించి జాన్ ఫ్రీ వీడియో కోర్స్ పెట్టారు. అంతే ఇక, అప్పటినుండి నేను ఆగలేదు.
ప్రతిరోజు బ్లాగింగ్ గురించి నేర్చుకుంటూ ఉన్న ఒక సంవత్సరం పాటు బ్లాగింగ్ గురించి పూర్తి వివరాలు నేర్చుకున్న. ప్రస్తుతం బ్లాగ్ నిర్వహిస్తున్న.
డొమైన్ తీసికోడం దగ్గర నుండి బ్లాగ్ నిర్వహించడంలో ఎటువంటి సందేహం వచ్చిన డిజిటల్ జాన్ని అడిగేవాడిని. జాన్ ఎంత బిజీగా వున్నా వాట్సాప్ లో సమాధానాన్ని ఇచ్చేవారు. బ్లాగింగ్ కోర్సు స్టూడెంట్స్‌కి అతను ఇచ్చే సపోర్టు అద్భుతం. డబ్బులు కట్టి కొనుక్కున్న బ్లాగింగ్ కోర్సులకు సపోర్టు ఇవ్వడం లేదు. రుజువు కావాలనుకుంటే మీరే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
ప్రతి శుక్రవారం సాయంత్రం 9 గంటలకు యూట్యూబ్ లైవ్ చేస్తారు. ఆ లైవ్ లో అడిగిన సందేహాలను సమాధానం ఇచ్చేవారు.
మన తెలుగు లో డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎక్కువ వీడీయోలు చేసింది మన డిజిటల్ జానే.
అంతేకాకుండా సార్ మల్టి టాలెంటెడ్ . ఏ ప్రశ్నఅడిగిన లైవ్ లోసమాధానం ఇచ్చేవారు. ఏ కోర్స్ నేర్చుకుంటే మార్కెట్ లో మనకంటూ ఒక గుర్తింపు ఉంటుందో ,ఆ కోర్సులను సిద్ధం చేసి ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు.
ఫ్రీ గా ఇస్తే కోర్స్ విలువ అర్థం కాదు అనే ఉదేశ్యం తో చిన్నపాటి అమౌంట్ తో కోర్స్ ను అందిస్తున్నారు.
కోర్సును కొనే ఆర్థిక స్థోమత లేని వాళ్ళు Johnని అడిగితే చాల తక్కువ మొత్తానికే కోర్స్ ను అందచేస్తారు. ఇది పరోక్షంగా స్కాలర్షిప్ లాగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది.
నేను బ్లాగింగ్ చెయ్యడానికి John కోర్సు లేకపోతే ఇంకా చాలా సమయం పట్టి ఉండేది. తెలుగు లో బ్లాగింగ్ చెయ్యొచ్చా అనే దగ్గరే ఆగిపోయే వాడిని
John కోర్స్ ద్వారా బ్లాగింగ్ అంటే ఏమిటి అనే స్టేజ్ నుండి బ్లాగింగ్ అంటే ఏమిటి అని అడిగే వాళ్లకు బ్లాగింగ్ అంటే ఇది సంగతి అని చెప్పే స్టేజి వరకు వచ్చాను. బ్లాగింగ్ లో ఒక స్టేజి కి వచ్చాక డిజిటల్ మార్కెటింగ్ కూడా సర్ కోర్స్ నే ఫాలో అవుతా.
బ్లాగింగ్ గురించి నన్ను అడిగితే సులభంగా చెప్పగలను. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకుంటాను డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది అని చెప్పే స్టేజి కి వెళతాను.
అంత నమ్మకమా అంటే అవును అనే చెప్తాను. Digital John కోర్స్ ఉందిగా, అదే నా పవర్.
డిజిటల్ మార్కెటింగ్ కి చాలా మంచి లైఫ్ వుంది. దానికోసం బ్లాగింగ్ చెయ్యడం రావాలి అని John యూట్యూబ్ వీడీయోస్ చూసినపుడు మొదటగా నేను ఎలాగో బ్లాగింగ్ చెయ్యాలి అనుకున్న, John అదే చెప్పారు బ్లాగింగ్ పూర్తి చేసాక డిజిటల్ మార్కెటింగ్ లో జాయిన్ అవ్వొచ్చని మొదటగా బ్లాగింగ్ ను నేర్చుకున్నాను.
డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అయినా ఏ మాత్రం గర్వం లేకుండా ఎవరైనా సార్ అంటే, పర్లేదు బ్రో అంటే సరిపోతుంది అనే వారు.
మన జాన్, యూజర్స్ ని పరాయి వాళ్ళలా కాకుండా తమ్ముళ్ళలా చూస్తారు.
నిజామా? ఓవర్ గా చెప్తున్నావ్ అనే డౌట్ రావొచ్చు! తప్పులేదు. మీరే కోర్స్ ఫాలో అవండి, మాట్లాడి చూడండి మీకే అర్థమవుతుంది.
జాన్ సర్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేదు కానీ మన తెలుగు వాళ్ళు డిజిటల్ గా వెనుకపడకూడదు.
ఇంకా నిరుద్యోగులుగా, బద్దకస్తులుగా, ఉండిపోకూడదు అని తన వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. విద్యార్థులకు కావలసినంత ప్రోత్సాహాన్ని, స్పూర్థిని ఇస్తున్నాడు
John నాకు అందించిన జ్ఞానాన్ని నాతో ఆగిపోకుండా చాలా మందికి చేరవేస్తాను.
నేనూ నా బ్లాగ్ ద్వారా అందరిని మోటివేట్ చేస్తాను.
Written between 1-3 AM
బ్లాగింగ్ కోర్సుపై ఏవైనా సందేహాలు ఉంటే డిజిటల్ జాన్ని వాట్సాప్ లేదా ఇమెయిల్ ద్వారా సంప్రదించండి. కోర్సు మొదటి బ్యాచ్ మే 1, 2019 కి ప్రారంభమైంది. ప్రతి నెల ఒక బ్యాచ్‌ని ప్రారంభిస్తున్నాము. కోర్సులో చేరే ఆసక్తి ఉంటే మీరు చేరవచ్చు.
Contact us to learn blogging course in Telugu
[mailerlite_form form_id=2]
John is a Digital Marketing Trainer and Blogger and YouTube creator with 5+ years work experience in digital marketing field. He is the founder of Digital Badi.
Telugu Blogs
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఎలా ?

Table of Contents
ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ జాబుల్లో డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. కానీ, డిజిటల్ మార్కెటింగ్ ఏలా నేర్చుకోవాలి? ఇంటెర్నెట్ లొ నేర్చుకోవాలా? లేదా ఒక ఇన్స్టిట్యూట్లో చేరి క్లాస్ రూమ్ ట్రైనింగ్ తీసుకోవాలా? అసలు నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవొచ్చా ? డిజిటల్ మార్కెటింగ్ లో ఉద్యోగ అవకాశాలు ఎలా వున్నాయి? ఇలా అనేక ప్రశ్నలు మనకు వస్తుంటాయి, ఈ పోస్ట్ ద్వారా మీ ప్రశ్నల్ని నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను . పోస్ట్ ను చివరి వరకు చదవండి
1. ముందుగా మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం
ఒక కంపెనీ యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి వినియోగదారుడికి తెలియజేయడం. దిన పత్రికల్లో ఇచ్చే యాడ్స్ , టీవీ యాడ్స్, రేడియో యాడ్స్, బిల్ బోర్డ్స్, హోర్డింగ్స్, ఇలా మొదలైన వాటి ద్వారా కంపెనీలు మార్కెటింగ్ చేస్తాయి . ప్రజలు టీవీ చూస్తున్నారు కాబట్టి టీవీ లో యాడ్స్ ఇస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఎక్కువ శాతం ప్రజలు తమ సమయాన్ని ఇంటర్నెట్ లో గడుపుతున్నారు.
2. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి ?
సింపుల్ గ చెప్పాలంటే ఇంటర్నెట్ ద్వారా మార్కెటింగ్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్.
3. డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి ?
ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు ఇస్తున్న సలహా ఏంటి అంటే, ఒక సొంత బ్లాగ్ ని తయారు చేసి డిజిటల్ మార్కెటింగ్ కు సంబంధించిన అన్ని విషయాలు బ్లాగ్ పై ప్రయోగించి నేర్చుకోవడం. దీని కోసం ఒక వెబ్ సైట్ పేరు కొనుక్కొని హోస్టింగ్ కొనుక్కుంటే చాలు. 1000 రూపాయలతో ఒక మంచి బ్లాగ్ ను తయారు చేసుకోవొచ్చు.
4. డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ నేర్చుకోవాలి ?
A. ఇంటర్నెట్ లో
డిజిటల్ మార్కెటింగ్ పై ఇంటర్నెట్ లో చాలా కోర్స్ లు ఉన్నాయ్. విదేశీ మరియు స్వదేశీ యూనివర్సిటీలు మరియు కాలేజీలు సైతం ఈ కోర్స్ ను ఇంటర్నెట్ ద్వారా అందిస్తున్నాయి. కాకపొతే ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఫ్రీ కోర్స్ లు కూడా వున్నాయి కానీ అవి అరకొర సిలబస్ తో వున్నాయి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ను అందించడానికి డిజిటల్ బడిని ప్రారంభించాము.
B. క్లాస్ రూమ్ ట్రైనింగ్
కొన్ని ఇన్స్టిట్యూట్ లు ఆన్లైన్ మరియు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ను అందిస్తున్నాయి. క్లాస్ రూమ్ ట్రైనింగ్ మరియు ఆన్లైన్ కోచింగ్ , ప్రస్తుతం ఈ రెండు ఖర్చుతో కూడుకున్నవే అని చెప్పాలి. ఎందుకంటే, వీరు ఎంత లేదనుకున్న, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోసం 30000 రూపాయల నుండి 70000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. అన్ని ఫీజు లపై 18% జి ఎస్ టి ఉంటుందని మర్చిపోకండి. డబ్బు సమస్య కాదనుకుంటే మంచి ఇన్స్టిట్యూట్ లో చేరి కోర్స్ నేర్చుకోవడం మంచిదే. ఇన్స్టిట్యూట్ ను ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్త.
5. నేను డిజిటల్ మార్కెటింగ్ ను నేర్చుకోవొచ్చా?
ఖచ్చితంగా నేర్చుకోవొచ్చు. మార్కెటింగ్ మరియు కాస్త ఐటీ స్కిల్స్ ఉంటే చాలు. అవి లేకపోయినా సరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటూనే కూడా నేర్చుకొవొచ్చు. మీకు ఒక మంచి మెంటర్ ఉంటే వేగంగా మరియు సులువుగా నేర్చుకోవొచ్చు. డిజిటల్ బడి ద్వారా మంచి కార్పొరేట్ మెంటోర్షిప్ ని అందిస్తున్నాము. డిజిటల్ బడి యొక్క డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ పై ఆసక్తి ఉంటె తెలియజేయండి.
6. డిజిటల్ మార్కెటింగ్ లో ఉద్యోగ అవకాశాలు
డిజిటల్ మార్కెటింగ్ రంగానికి కొత్తగా ప్రవేశించాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. ప్రస్తుతం డిజిటల్ మార్కెటర్స్ కి ఎప్పుడు లేనంత డిమాండ్ ఉంది. నిరుద్యోగులను ప్రస్తుతం ఈ రంగం ఆకర్షింస్తుందనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇటీవలే డిజిటల్ మార్కెటర్స్ కు ఉండే డిమాండ్ పై టైమ్స్ అఫ్ ఇండియా లో ఒక బ్లాగ్ ని ప్రచురించారు. వీలయితే చదవండి.
7. డిజిటల్ బడి
A. డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ సిలబస్
1.Essentials of Marketing
2.Essentials of Blogging
3.Essentials of Digital Marketing
4.Essentials of E-mail Marketing
5.Essentials of Search Engine Optimization (SEO)
6.Essentials of Search Engine Marketing (Google Ads)
7.Essentials of Social Media Marketing
8.Essentials of Marketing Automation
9.Essentials of Web Analytics
10.Essentials of Microsoft Excel for Digital Marketing
Contact Us to learn digital marketing course in Telugu
[mailerlite_form form_id=2]
John is a Digital Marketing Trainer and Blogger and YouTube creator with 5+ years work experience in digital marketing field. He is the founder of Digital Badi.
Telugu Blogs
డిజిటల్ మార్కెటర్ కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి?

Table of Contents
ఒక డిజిటల్ మార్కెటర్ కి ఉండాల్సిన నైపుణ్యాలు ఏంటి అనేది మనము యీ ఆర్టికల్ లో చూద్దాం.
1. కాపీరైటింగ్ స్కిల్స్
డిజిటల్ మార్కెటింగ్‌లో కంటెంట్ మార్కెటింగ్ చాలా కీలకమైన విభాగం. కంటెంట్ ఏ ఫార్మాట్లో ఉన్నప్పటికీ, ముందు వ్రాతపూర్వకంగా దాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఉదాహారణకు ఒక సినిమా తీయాలనుకున్నా సరే, ముందు కథ సిద్ధం అవ్వాలి. అంటే, వీడియో ఫార్మాట్లో ఉండే కంటెంట్, ముందు లిఖితపూర్వకంగా ఉండాల్సి ఉంటుంది. ఒక సినిమా దర్శకుడికి కథ పట్ల ఎంత గ్రిప్ ఉంటే అంత మంచిది. అలాగే డిజిటల్ మార్కెటింగ్‌లో కూడా కంటెంట్ మార్కెటింగ్‌లో ముందు రాయగలగాలి. బ్లాగ్ల రూపంలో, ఇమేజ్, వీడియో, ఇన్పోగ్రాఫిక్, ఆడియో, ఈ బుక్స్, ఇలా మొదలైన ఫార్మాట్లలో కంటెంట్ ఉంటుంది.
ఏ కంటెంట్ సిద్ధం చేయాలన్నా సరే ముందు కంటెంట్‌ని లిఖిత పూర్వకంగా రాయాల్సి ఉంటుందని మర్చిపోవద్దు.
కంటెంట్ మార్కెటింగ్ సరిగ్గా చేయగలిగితే ఆన్లైన్ ఆడ్వర్టైసింగ్కి కావాల్సిన ఆడ్ కాపీలను కూడా సమర్థవంతంగా సిద్ధం చేయగలరు. డిజిటల్ మార్కెటింగ్‌లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండేది కంటెంట్ మార్కెటింగ్ విభాగంలోనే.
కాపీ రైటింగ్ మంచిగా నేర్చుకోవాలనుకుంటే జోసప్ షుగర్మెన్ రాసిన పుస్తకాన్ని చదవండి. మేము కాపీ రైటింగ్ నేర్చుకున్నది కూడా యీ పుస్తకం ద్వారానే
టిప్: కంటెంట్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే రాయడం ప్రారంభించాలి.
2. వార్డుప్రెస్
ఇక్కడ వార్డుప్రెస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CMS) అని అర్థం. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ చాలానే ఉన్నప్పటికీ, ఎక్కువ వాడుకలో ఉన్నది వార్డుప్రెసు మాత్రమే. ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్లు, బ్లాగులు 30% వార్డుప్రెసులోనే ఉంటాయంటే అతిశయయోక్తి కాదు. తర్వాత స్థానాల్లో జూమ్లా, డ్రూపాల్, గోస్ట్ ఇలా వేరే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ (CMS lu) ఉన్నయి. ఒక్క వార్డుప్రెస్ నేర్చుకున్నా సరే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
టిప్: వార్డుప్రెస్ నేర్చుకోవాలనుకుంటే సొంతంగా ఒక బ్లాగ్‌ను ప్రారంభించి నేర్చుకోవాలి
3. గ్రాఫిక్ డిజైనింగ్
గ్రాఫిక్ డిజైనింగ్ పై ప్రాథమిక అవగాహన ఉండాల్సి ఉంటుంది. కంటెంట్‌ని విజువల్‌గా ప్రెసెంట్ చేయాలంటే గ్రాఫిక్ డిజైనింగ్ తప్పనిసరి. ఇన్ఫో గ్రాఫిక్స్, బ్యానర్ ఆడ్స్, జిఫ్ ఇమేజ్, ఇలా చాలా చోట్ల గ్రాఫిక్ డిజైనింగ్ అవసరం ఉంటుంది. గ్రాఫిక్ డిజైనింగ్ గురించి ఏమి తెలియదు అనుకునే వాళ్లు, కాన్వా లాంటి టూల్స్‌తో సులభంగా వేగంగా డిజైనింగ్ చేయొచ్చు. కానీ, ఫోటోషాప్ నేర్చుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. గ్రాఫిక్ డిజైనింగ్ లో మీరు మఖ్యంగా నేర్చుకోవాల్సినవి, కలర్, ఫాంట్, తరచూ వాడే బ్యానర్ల సైజులు, అయికాన్స్.
గ్రాఫిక్ డిజైనింగ్‌పై త్వరలో డిజిటల్ బడిలో ఒక కోర్సును ప్రారంభిస్తున్నాము. నేర్చుకోవాలనుకునే వారు డిజిటల్ బడిని సంప్రదించండి.
టిప్: గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవడం ప్రారంభించండి
4. డేటా విశ్లేషణ (డేటా ఎనాలిసిస్)
డిజిటల్ మార్కెటింగ్ లో మీరు చేసే ప్రతి పనిని విశ్లేషించాలంటే మీకు మంచి అనాలటికల్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. క్యాంపెన్ అనాలసిస్, మెట్రిక్స్ మరియు కన్వర్షన్ల గురించి మీకు తెలియాలంటే ఖచ్చితంగా కొంత ఆప్టిట్యూడ్ స్కిల్స్ ఉండాల్సిందే. అడ్వాన్స్డ్ మైక్రోసాప్ట్ ఎక్సెల్ గనుక మీకు తెలిస్తే మీకు యీ పని చాలా సులభం. గూగుల్ అనాలటిక్స్ కోర్సును నేర్చుకోండి. డిజిటల్ మార్కెటింగ్‌లో దీన్ని అత్యంత కీలకమైన స్కిల్‌గా పరిగణిస్తారు. దీని యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని డిజిటల్ బడి అందిస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో అడ్వాన్స్డ్ మైక్రోసాప్ట్ ఎక్సెల్ కోసం ప్రత్యేకంగా ఒక మాడ్యూల్‌ని కేటాయించండం విశేషం.
టిప్: ఒక బ్లాగ్‌ని ప్రారంభించి గూగుల్ అనాలటిక్స్ని ఇంటిగ్రేట్ చేసి గూగుల్ అనాలటిక్స్ నేర్చుకోండి
5. ఎప్పుడూ నేర్చుకునే తత్వం
డిజిటల్ మార్కెటింగ్ అనేది డైనమిక్ రంగం. అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే నిరంతంర విద్యార్థిగా మారాల్సి ఉంటుంది.
టిప్: డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న టాప్ బ్లాగ్‌లను ఫాలో అవ్వాలి.
6. టెక్నికల్ స్కిల్స్
డిజిటల్ మార్కెటింగ్ కి టెక్నికల్ స్కిల్స్ తప్పనిసరి. ఎందుకంటే, మీరు ఏ పని చేసినా అది టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు, వెబ్సైట్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే మీకు కనీసం వెబ్సైట్ టెక్నాలజీల (వార్డుప్రెస్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్) గురించి ప్రాథమిక అవగాహన ఉండాల్సి ఉంటుంది.
7. ముగింపు
ఇప్పటివరకు వివరించిన ముఖ్యమైన స్కిల్స్ ని ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం కోసం తెలుగులో ఒక మంచి ఆన్లైన్ కోర్సును డిజిటల్ బడి టీమ్ రూపొందించింది. డిజిటల్ మార్కెటింగ్ కోర్సును నేర్చుకోవాలని అనుకునే వారు డిజిటల్ బడి టీంని సంప్రదించండి.
తెలుగులో డిజిటల్ మార్కెటింగ్‌పై ఇంకా ఆర్టికల్స్‌ని, బుక్స్, కోర్సులను సిద్ధం చేస్తున్నాం. వాటి అప్డేట్స్ కోసం మా బ్లాగ్‌కి మరలా సందర్శించండి.
Contact us to learn digital marketing course in Telugu
[mailerlite_form form_id=2]
John is a Digital Marketing Trainer and Blogger and YouTube creator with 5+ years work experience in digital marketing field. He is the founder of Digital Badi.
Telugu Blogs
ఇమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి?

Table of Contents
డిజిటల్ మార్కెటింగ్‌లో తక్కువ అంచనా వేసే విభాగం ఏదైనా ఉందా అంటే అది ఇమెయిల్ మార్కెటింగే అని చెప్పొచ్చు.
అత్యధిక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే ఇమెయిల్ మార్కెటింగ్‌పై డిజిటల్ బడి ప్రత్యేక కథనం.
1. ఇమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి?
సింపుల్‌గా చెప్పాలంటే ఇమెయిల్స్ పంపడం. ఒక ఇమెయిల్ ఐడీ నుండి కొంత మందికి ఏదైనా సమాచారాన్ని పంపాలనుకుంటే మనం జీమెయిల్ వాడతాం. కానీ, ఒకే ఇమెయిల్ ఐడీ నుండి వేల, లక్షల ఇమెయిల్ ఐడీలకు సమాచారాన్ని ఒకేసారి పంపాలంటే ఒక్క జీమెయిల్ ఐడీతో
పంపడం సాధ్యం కాదు. అందుకోసం ప్రత్యేక టూల్స్‌ని వాడడం జరుగుతుంది. అలా టూల్స్ వాడుతూ పంపితే అది ఇమెయిల్ మార్కెటింగ్. అయితే, ఎవరికి ఇమెయిల్స్ పంపాలి, ఎందుకు పంపాలి, ఇమెయిల్ మార్కెటింగ్‌ని ఎలా చేయాలి అనేది మనం చూద్దాం.
2. ఇమెయిల్ ఇంత ఇంపార్టెంటా?
డిజిటల్ మార్కెటింగ్‌కి ఇమెయిల్ ఐడీ చాలా అవసరం. అందుకే మీరు ఆన్లైన్లో ఎక్కడికైనా వెళ్ళండి, మీరు మీ ఇమెయిల్ ఐడీని సమర్పించాల్సిందే. ఏ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలనుకున్నా మీ ఇమెయిల్ ఐడీ అడుగుతారు. డిజిటల్ మార్కెటింగ్‌కి ఇమెయిల్ ఐడీ చాలా ఇంపార్టెంట్.
3. ఇమెయిల్ ఐడీలను కొనొచ్చా?
ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడుగుతుంటారు. ఇమెయిల్ ఐడీలను కొనొచ్చా లేదా అనేది. ఎందుకంటే మార్కెట్లో చాలా మంది ఇమెయిల్ ఐడీలను అమ్ముతున్నారు. లక్ష ఇమెయిల్ ఐడీలను 5000 రూపాలయకు కావొచ్చు. ఇలా కొనడం ఇమెయిల్ మార్కెటంగ్ చేస్తే అది మీ డొమైన్‌కి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి, ఇమెయిల్ ఐడీలను కొని ఇమెయిల్ మార్కెటింగ్ చేయొద్దు. మరి ఎలా చేయాలి అనేది చూద్దాం.
4. ఇమెయిల్ లిస్ట్ నిర్మించడం
మీకు మీరే సొంత ఇమెయిల్ లిస్ట్‌ని నిర్మించుకోవడం అనేది కొంత సమయం పడుతుంది. కానీ ఇది అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది అని చెప్పుకోవొచ్చు. కన్వర్షన్ రేట్ కూడా మెరుగ్గా ఉండే అవకాశాలా చాలా ఎక్కువ. ఎందుకంటే వెబ్ సందర్శకులు వాళ్ళంతకు వారే మాకు మీ అప్డేట్స్ని పంపమని వాళ్ళే మీకు అనుమతి ఇస్తున్నట్టు.
5. ఇమెయిల్ మార్కెటింగ్‌కి వాడే టూల్స్
ఇమెయిల్ మార్కెటింగ్‌కి వాడే టూల్స్ మార్కెట్లో చాలానే ఉన్నప్పటికీ, మేము ఎక్కువగా వాడే టూల్స్‌ని మీకు పరిచయం చేస్తాం. ఎక్కువ శాతం మెయిల్ చింప్ అనే టూల్‌ని వాడతారు. మెయిల్ చింప్తో పాటు, మేలర్లైట్, ఏవెబర్, సెండీ, డ్రిప్ ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. మీ ఇమెయిల్ మార్కెటింగ్ యొక్క అవసరతను బట్టి మీరు ఇమెయిల్ మార్కెటింగ్ టూల్‌ని ఎంచుకొని మీరు వాడాల్సి ఉంటుంది. డిజిటల్ బడి అందిస్తున్న ఇమెయిల్ మార్కెటింగ్ కోర్సులో ఇమెయిల్ మార్కెటింగ్‌ని కూడా చేర్చడం జరిగింది. మీరు ఇమెయిల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ బడిని సంప్రదించండి.
[mailerlite_form form_id=2]
Attend a FREE Demo to Learn Digital Marketing Course in Telugu
John is a Digital Marketing Trainer and Blogger and YouTube creator with 5+ years work experience in digital marketing field. He is the founder of Digital Badi.
-
Digital Marketing3 years ago
Traditional Marketing vs Digital Marketing
-
Modules of Digital Marketing2 years ago
Social Media Marketing Made Simple: A Beginner’s Guide
-
Video Editing2 years ago
Is Video Editing a Good Career in India
-
Telugu Blogs3 years ago
డిజిటల్ మార్కెటర్ కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి?
-
Telugu Blogs3 years ago
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఎలా ?
-
Digital Marketing3 years ago
Career Opportunities in Digital Marketing
-
Graphic Designing3 years ago
Career Opportunities in Graphic Designing
-
Telugu Blogs3 years ago
ఇమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి?