Table of Contents
ఒక డిజిటల్ మార్కెటర్ కి ఉండాల్సిన నైపుణ్యాలు ఏంటి అనేది మనము యీ ఆర్టికల్ లో చూద్దాం.
1. కాపీరైటింగ్ స్కిల్స్
డిజిటల్ మార్కెటింగ్‌లో కంటెంట్ మార్కెటింగ్ చాలా కీలకమైన విభాగం. కంటెంట్ ఏ ఫార్మాట్‌లో ఉన్నప్పటికీ, ముందు వ్రాతపూర్వకంగా దాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఉదాహారణకు ఒక సినిమా తీయాలనుకున్నా సరే, ముందు కథ సిద్ధం అవ్వాలి. అంటే, వీడియో ఫార్మాట్‌లో ఉండే కంటెంట్, ముందు లిఖితపూర్వకంగా ఉండాల్సి ఉంటుంది. ఒక సినిమా దర్శకుడికి కథ పట్ల ఎంత గ్రిప్ ఉంటే అంత మంచిది. అలాగే డిజిటల్ మార్కెటింగ్‌లో కూడా కంటెంట్ మార్కెటింగ్‌లో ముందు రాయగలగాలి. బ్లాగ్‌ల రూపంలో, ఇమేజ్, వీడియో, ఇన్‌పోగ్రాఫిక్, ఆడియో, ఈ బుక్స్, ఇలా మొదలైన ఫార్మాట్‌లలో కంటెంట్ ఉంటుంది.
ఏ కంటెంట్ సిద్ధం చేయాలన్నా సరే ముందు కంటెంట్‌ని లిఖిత పూర్వకంగా రాయాల్సి ఉంటుందని మర్చిపోవద్దు.
కంటెంట్ మార్కెటింగ్ సరిగ్గా చేయగలిగితే ఆన్‌లైన్ ఆడ్వర్‌టైసింగ్‌కి కావాల్సిన ఆడ్ కాపీలను కూడా సమర్థవంతంగా సిద్ధం చేయగలరు. డిజిటల్ మార్కెటింగ్‌లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండేది కంటెంట్ మార్కెటింగ్ విభాగంలోనే.
కాపీ రైటింగ్ మంచిగా నేర్చుకోవాలనుకుంటే జోసప్ షుగర్‌మెన్ రాసిన పుస్తకాన్ని చదవండి. మేము కాపీ రైటింగ్ నేర్చుకున్నది కూడా యీ పుస్తకం ద్వారానే
టిప్: కంటెంట్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే రాయడం ప్రారంభించాలి.
2. వార్డుప్రెస్
ఇక్కడ వార్డుప్రెస్ అంటే కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CMS) అని అర్థం. కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ చాలానే ఉన్నప్పటికీ, ఎక్కువ వాడుకలో ఉన్నది వార్డుప్రెసు మాత్రమే. ఇంటర్నెట్‌లో ఉండే వెబ్‌సైట్లు, బ్లాగులు 30% వార్డుప్రెసులోనే ఉంటాయంటే అతిశయయోక్తి కాదు. తర్వాత స్థానాల్లో జూమ్లా, డ్రూపాల్, గోస్ట్ ఇలా వేరే కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (CMS lu) ఉన్నయి. ఒక్క వార్డుప్రెస్ నేర్చుకున్నా సరే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
టిప్: వార్డుప్రెస్ నేర్చుకోవాలనుకుంటే సొంతంగా ఒక బ్లాగ్‌ను ప్రారంభించి నేర్చుకోవాలి
3. గ్రాఫిక్ డిజైనింగ్
గ్రాఫిక్ డిజైనింగ్ పై ప్రాథమిక అవగాహన ఉండాల్సి ఉంటుంది. కంటెంట్‌ని విజువల్‌గా ప్రెసెంట్ చేయాలంటే గ్రాఫిక్ డిజైనింగ్ తప్పనిసరి. ఇన్‌ఫో గ్రాఫిక్స్, బ్యానర్ ఆడ్స్, జిఫ్ ఇమేజ్, ఇలా చాలా చోట్ల గ్రాఫిక్ డిజైనింగ్ అవసరం ఉంటుంది. గ్రాఫిక్ డిజైనింగ్ గురించి ఏమి తెలియదు అనుకునే వాళ్లు, కాన్వా లాంటి టూల్స్‌తో సులభంగా వేగంగా డిజైనింగ్ చేయొచ్చు. కానీ, ఫోటోషాప్ నేర్చుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. గ్రాఫిక్ డిజైనింగ్ లో మీరు మఖ్యంగా నేర్చుకోవాల్సినవి, కలర్, ఫాంట్, తరచూ వాడే బ్యానర్‌ల సైజులు, అయికాన్స్.
గ్రాఫిక్ డిజైనింగ్‌పై త్వరలో డిజిటల్ బడిలో ఒక కోర్సును ప్రారంభిస్తున్నాము. నేర్చుకోవాలనుకునే వారు డిజిటల్ బడిని సంప్రదించండి.
టిప్: గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవడం ప్రారంభించండి
4. డేటా విశ్లేషణ (డేటా ఎనాలిసిస్)
డిజిటల్ మార్కెటింగ్ లో మీరు చేసే ప్రతి పనిని విశ్లేషించాలంటే మీకు మంచి అనాలటికల్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. క్యాంపెన్ అనాలసిస్, మెట్రిక్స్ మరియు కన్‌వర్షన్‌ల గురించి మీకు తెలియాలంటే ఖచ్చితంగా కొంత ఆప్టిట్యూడ్ స్కిల్స్ ఉండాల్సిందే. అడ్వాన్స్‌డ్ మైక్రోసాప్ట్ ఎక్సెల్ గనుక మీకు తెలిస్తే మీకు యీ పని చాలా సులభం. గూగుల్ అనాలటిక్స్ కోర్సును నేర్చుకోండి. డిజిటల్ మార్కెటింగ్‌లో దీన్ని అత్యంత కీలకమైన స్కిల్‌గా పరిగణిస్తారు. దీని యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని డిజిటల్ బడి అందిస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో అడ్వాన్స్‌డ్ మైక్రోసాప్ట్ ఎక్సెల్ కోసం ప్రత్యేకంగా ఒక మాడ్యూల్‌ని కేటాయించండం విశేషం.
టిప్: ఒక బ్లాగ్‌ని ప్రారంభించి గూగుల్ అనాలటిక్స్‌ని ఇంటిగ్రేట్ చేసి గూగుల్ అనాలటిక్స్ నేర్చుకోండి
5. ఎప్పుడూ నేర్చుకునే తత్వం
డిజిటల్ మార్కెటింగ్ అనేది డైనమిక్ రంగం. అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే నిరంతంర విద్యార్థిగా మారాల్సి ఉంటుంది.
టిప్: డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న టాప్ బ్లాగ్‌లను ఫాలో అవ్వాలి.
6. టెక్నికల్ స్కిల్స్
డిజిటల్ మార్కెటింగ్ కి టెక్నికల్ స్కిల్స్ తప్పనిసరి. ఎందుకంటే, మీరు ఏ పని చేసినా అది టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ చేయాలనుకుంటే మీకు కనీసం వెబ్‌సైట్ టెక్నాలజీల (వార్డుప్రెస్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్) గురించి ప్రాథమిక అవగాహన ఉండాల్సి ఉంటుంది.
7. ముగింపు
ఇప్పటివరకు వివరించిన ముఖ్యమైన స్కిల్స్ ని ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం కోసం తెలుగులో ఒక మంచి ఆన్‌లైన్ కోర్సును డిజిటల్ బడి టీమ్ రూపొందించింది. డిజిటల్ మార్కెటింగ్ కోర్సును నేర్చుకోవాలని అనుకునే వారు డిజిటల్ బడి టీంని సంప్రదించండి.
తెలుగులో డిజిటల్ మార్కెటింగ్‌పై ఇంకా ఆర్టికల్స్‌ని, బుక్స్, కోర్సులను సిద్ధం చేస్తున్నాం. వాటి అప్‌డేట్స్ కోసం మా బ్లాగ్‌కి మరలా సందర్శించండి.
Contact us to learn digital marketing course in Telugu
Call 6309973292 / 9573439404