Table of Contents
ఫ్రీ బ్లాగ్ వర్సెస్ సెల్ఫ్ హోస్టెడ్ బ్లాగ్
ఇంటర్‌నెట్‌లో ఉచితంగానే బ్లాగులు తయారు చేసుకొని బ్లాగింగ్ చేయడానికి చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. కానీ వాటిని ఎందుకు మనం ఎంచుకోకూడదు అనేది మీకు క్లుప్తంగా ఒక చిన్న కథతో మీకు వివరించి సెల్ఫ్ హోస్టెడ్ బ్లాగ్ గురించి తెలియజేసి ఆర్టికల్‌ని ముగిస్తాను.
1. Free Blogsని అర్థం చేసుకుందాం
హైదరాబాద్‌కి సమీపంలో శంషాబాద్ అనే ప్రాంతం ఉంది. శంషాబాద్ కి దగ్గర్లో సంతోష్ అనే వ్యక్తి ఒక చిన్న ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. నిర్మాణం జరుగుతూ ఉండగా ప్రభుత్వం నుండి నోటీసులు వచ్చాయి. నిర్మాణం చేయడానికి వీలు లేదు, ఎందుకంటే నిర్మాణం చేపట్టిన స్థలం సంతోష్‌ది కాదు అని అధికారులు స్థలాన్ని సీజ్ చేసి వెళ్ళిపోయారు. సంతోష్ ఇంటి నిర్మాణానికి అప్పటికే ఎంతో సమయం, శ్రమ, డబ్బు ని ఖర్చు చేశాడు. ఇప్పుడవన్నీ వృధా అయిపోయాయి.
ఈ కథలో సంతోష్ తనది కాని స్థలంలో ఇంటిని నిర్మించాలనుకున్నాడు. ఉచిత బ్లాగులు కూడా అలాంటివే. ఏ క్షణంలోనైనా ఉచిత బ్లాగింగ్ ఫ్లాట్‌ఫాం వాళ్ళు మార్పులు తీసుకువచ్చి మీ బ్లాగ్‌ని కూకటి వేళ్ళతో సహా తీసివేయగలరు. ఉచిత బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ఏదైనా కావొచ్చు. బ్లాగర్.కామ్, వార్డ్‌ప్రెస్.కామ్, విక్స్.కామ్, ఇలా చాలా ఉన్నాయి.
ఉచిత బ్లాగ్ ఫ్లాట్‌ఫాంలలో బ్లాగ్ నిర్వహిస్తున్న వాళ్ళు అందరు సంతోష్ లాగే తమది కాని బ్లాగ్‌లో బ్లాగింగ్ చేస్తున్నట్లే.
ఉదాహరణకి
- https://bairapagajohn.wordpress.com/
- https://bairapagajohn.blogger.com/
- https://bairapagajohn.wix.com/ ఇంకా ఇలా చాలానే ఉన్నాయి.
2. Paid Blogs
సంతోష్ ఎదుర్కొన్న సమస్య మీకు రావొద్దు అనుకుంటే మీరు ఖచ్చితంగా ముందు స్థలం కొనుక్కొని, ఆ తరువాత ఇంటి నిర్మాణం చేపట్టాలి. అయితే, సొంత స్థలంలో ఇంటిని నిర్మించాలనుకుంటే మీకంటూ ఒక కొత్త వెబ్‌సైట్ పేరుని (Domain Name) కొనుక్కొని నిర్మించుకోవచ్చు. దీనిపై పూర్తి హక్కులు మీకు ఉంటాయి.
అందుకోసం ఒక డొమైన్ కొనుక్కొని, వెబ్ హోస్టింగ్ కూడా కొనుక్కొని మీరు ప్రారంభించవచ్చు. ఇక్కడ నేను మాట్లాడుతున్నది సెల్ఫ్ హోస్టెడ్ వార్డుప్రెస్ బ్లాగ్ గురించి. వార్డ్‌ప్రెస్.కామ్ కి సెల్ఫ్ హోస్టెడ్ వార్డుప్రెస్ బ్లాగ్‌కి తేడాలు ఉన్నాయి.
నేనైతే మీకు సెల్ఫ్ హోస్టెడ్ వార్డుప్రెస్ బ్లాగ్ ని (సొంత స్థలంలో ఇంటిని) ప్రారంభించమని చెప్తాను.
సెల్ఫ్ హోస్టెడ్ బ్లాగ్
అంటే మీరే సొంతంగా వెబ్‌సైట్ పేరు కొనుక్కొని, ఆ బ్లాగ్‌ని ఇంటర్‌నెట్‌లో హోస్ట్ చేయాలంటే వెబ్ హోస్టింగ్‌ని కొనుక్కొని వార్డుప్రెస్సుని మీరే ఇన్‌స్టాల్ చేయడం. ఇలా చేస్తే బ్లాగ్‌పై పూర్తి అధికారం మీకు ఉంటుంగి. ఏ రూల్స్, పాలసీలు, గైడ్‌లైన్స్ మీకు అడ్డంకిగా ఉండవు. సీరియస్‌గా బ్లాగింగ్ చేయాలనుకునే ఏ బ్లాగర్ అయినా సెల్ఫ్ హోస్టెడ్ వార్డుప్రెస్సు బ్లాగ్ వైపే మొగ్గు చూపుతారు.
బ్లాగింగ్‌పై మీకు ఏవైనా సందేహాలు ఉన్నా, బ్లాగింగ్ నేర్చుకోవాలన్న ఆసక్టి మీకు ఉన్నా, డిజిటల్ బడి అందిస్తున్న బ్లాగింగ్ కోర్సులో చేరి నేర్చుకోవచ్చు.
కోర్సు వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9573439404
Reach us to learn digital marketing course in Telugu