హైద‌రాబాద్‌లో విజ‌య‌వంతంగా జ‌రిగిన‌ కోరా వ‌ర‌ల్డ్ మీట‌ప్ 2019

హైద‌రాబాద్‌లో విజ‌య‌వంతంగా జ‌రిగిన‌ కోరా వ‌ర‌ల్డ్ మీట‌ప్ 2019

కోరా ప్ర‌తి సంవ‌త్స‌రం వ‌ర‌ల్డ్ మీట‌ప్‌లు 2017 నుండి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ న‌గ‌రాల‌లో నిర్వ‌హిస్తుంది అని మ‌నంద‌రికి తెలిసిందే. ఇది 3వ వ‌ర‌ల్డ్ మీట‌ప్‌. యీ సారి హైద‌రాబాద్‌లో మీట‌ప్ నిర్వ‌హించ‌డానికి డిజిట‌ల్ బ‌డి టీం ముందుకొచ్చి చొర‌వ తీసుకుంది. యీ మీట‌ప్ ఎలా జ‌రిగింది అనేది చూద్దాం ఇప్పుడు.

సంగీతంతో ప్రారంభం

ఇచ్చిన టైం ప్రకారం స‌రిగ్గా సాయంత్రం 5.30 కు కోరా మీట‌ప్ క‌ళ్యాణ్ మ్యూజిక్ ట్రూప్ సంగీతంతో ప్రారంభ‌మైంది. కొన్ని ఇంగ్లీష్‌, హిందీ మ‌రియు తెలుగు పాట‌ల‌తో ముందుకు తీసుకెళ్ళాడు క‌ళ్యాణ్‌. యీ మీట‌ప్‌కి ఫోటోగ్ర‌ఫీ బాధ్య‌తని కూడా క‌ళ్యాణ్‌యే చూసుకున్నాడు.

ఒక‌రినొక‌రి ప‌రిచ‌యం

ఆ త‌రువాత యీ మీట‌ప్‌ని నిర్వ‌హించ‌డానికి ముఖ్య పాత్ర పోషించిన రోనీ సామ్యేల్ ముందుకు వ‌చ్చి ప్ర‌తి ఒక్క‌రిని ప‌రిచ‌యం చేసుకోమ‌ని కొంత స‌మ‌యం ఇచ్చాడు. ఎవ‌రికి వారు ప‌రిచ‌యం చేసుకుంటూనే వారికి కోరా ఎలా స‌హాయ‌ప‌డింది, కోరాని వారు ఎలా వాడుతున్నారో ఇత‌రుల‌తో పంచుకున్నారు.

పున‌రాలోచించేలా ర‌త్నాక‌ర్ సార్ సెష‌న్‌

అనంత‌రం ఈవెంట్‌కి వ‌చ్చిన స్పీక‌ర్ల‌లో ర‌త్నాక‌ర్ సదస్యుల సార్ “ఫాలో యువ‌ర్ ఫ్యాష‌న్” (Follow Your Passion) అనే టాపిక్‌పై అద్భుతంగా మాట్లాడారు. ఫ్యాష‌న్‌ని ఫాలో అవ‌డం అనేది పూల పాన్పు (Bed of Roses) కాదు. అందులో ఉండే స‌వాళ్ళు, స‌మ‌స్య‌ల గురించి చ‌క్క‌టి ప్ర‌శ్న‌ల‌ను మ‌న‌కి మ‌నమే వేసుకుని నిర్ణ‌యం తీసుకునేలాగా ఈ సెష‌న్‌ని ముందుకు తీసుకెళ్ళిన తీరు అద్భుతం అనే చెప్పాలి.

ఈవెంట్‌లో ఇంత‌టి విలువైన సూచ‌న‌ల‌ను త‌న వ్య‌క్తిగ‌త అనుభ‌వాల నుండి సేక‌రించి మాకు వివ‌రించిన ర‌త్నాక‌ర్ సార్‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.

ఈవెంట్‌ని చ‌క్క‌గా నిర్వ‌హించారు అని పేర్కొన్న పోస్ట్‌.

మెరుగౌతున్న ప్ర‌పంచం

అనంత‌రం, రెండ‌వ స్పీక‌ర్ క‌ట‌కం మ‌న‌స్ తేజ కాగ్నిటివ్ సైకాల‌జీపై ఒక శాస్త్రీయ వివ‌ర‌ణ‌తో కూడిన సెష‌న్ తీసుకున్నారు. ఈ సెష‌న్ వ‌ల్ల మాకు కొన్ని కొత్త విష‌యాలు నేర్చుకున్నాం. ప్ర‌పంచం రోజురోజుకు ఎంత బెట‌ర్‌గా అవుతుంది అనేది వివ‌రించారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ సైకాల‌జీని ఎలా వాడుకుంటుంది, మ‌నం ఒకేసారి రెండు ప‌నుల‌ను ఎందుకు చేయ‌కూడ‌దు, ఇటువంటి వాటిపై తేజ మాట్లాడారు. వీటిపై హాజ‌రైన వారి నుండి కొన్ని ప్ర‌శ్న‌ల‌ని తీసుకొని జ‌వాబిచ్చారు. ప్ర‌పంచం మెరుగౌతుంది అనే మంచి ఆలోచ‌న‌తో సెష‌న్‌ని ముగించారు. తేజ‌కి కూడా స్పెష‌ల్ థాంక్స్‌.

ఈవెంట్‌లో మాట్లాడిన ఇద్ద‌రు స్పీక‌ర్లు కూడా కోరా టాప్ రైట‌ర్స్‌

ఈవెంట్ అనంత‌రం ఒక గ్రూప్ పోటో తీసుకుని నెట్‌వ‌ర్కింగ్ చేసుకున్నాం.

త‌రువాత నిర్వ‌హించే కోరా మీట‌ప్‌ల‌కు లేదా ఇత‌ర డిజిట‌ల్ మార్కెటింగ్ మీట‌ప్‌ల‌కి అటెండ్ అవ్వాలనుకుంటే మీరు ఈ ఫేస్‌బుక్ గ్రూప్‌లో చేరండి

ఈవెంట్ ఇంత బాగా జ‌ర‌గ‌డానికి స‌హాక‌రించిన అక్టో స్పెసెస్ కో వ‌ర్కింగ్ స్పేస్ యాజ‌మాన్యానికి ధ్యాంక్స్‌

Event Sponsors

Written by
Digital John
Join the discussion

Digital John

Digital John writes blogs from his own experience and knowledge

Are You Interested to Learn Digital Marketing?

We are Here to Help You

Fill this Form, We Will Guide You