ప్రీలాన్సింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌డం ఎలా?

ప్రీలాన్సింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌డం ఎలా?

ఆన్‌లైన్‌లో డ‌బ్బులు ఎలా సంపాదించాలి అనేది చాలా మందిలో ఉన్న సందేహం. యీ ఆర్టిక‌ల్‌లో అస‌లు డ‌బ్బులు సంపాదించ‌డానికి గ‌ల కొన్ని ఉత్త‌మ మార్గాల‌ను మీకు తెలియ‌జేస్తాను.

1. ప్రీలాన్సింగ్

ప్రీలాన్సింగ్ అంటే స్వ‌యం ఉపాధి. అవును, ప్రీలాన్సింగ్ ప‌దంలో ప్రీ ఉంది కాబ‌ట్టి ఇది ఉచితం అని అనుకోవ‌ద్దు. ప్రీలాన్సింగ్ అంటే ఏదైనా ఒక ప‌ని నిమిత్తం నియ‌మించుకొని ఆ ప‌నికి ఎంత అయితే ఇవ్వాలో, అంత డ‌బ్బు చెల్లించ‌డం.

ఉదాహ‌ర‌ణ‌కు, మీ ఇంటికి పేయింటింగ్ వేయాలి అనుకోండి, మీరు పేయింట‌ర్‌కి ఉద్యోగం ఇవ్వ‌రు. ఎందుకంటే ఆ ప‌ని కొన్ని రోజుల్లో అయిపోతుంది, త‌రువాత పేయింట‌ర్‌కి ప‌ని ఉండ‌దు. నెల నెల జీతం ఇవ్వ‌డం కూడా వృధా అవుతుంది. అలాంట‌ప్పుడు మీరు పేయింటింగ్ వేయించుకొని ఎంత డ‌బ్బు అయితే ఇవ్వాలో అంత డ‌బ్బు చెల్లిస్తారు. ఇది స‌హ‌జం. ఇక్క‌డ మ‌నం పేయింట‌ర్‌ని ప్రీలాన్స‌ర్ అని అనుకోవ‌చ్చు.

పైన పేర్కొన‌బ‌డిన విధంగా ఏ రీతిగానైతే మీరు మీ పేయింటింగ్ ప‌నిని ఒక పేయింట‌ర్‌కి అప్ప‌గిస్తారో, అదే విధంగా కంపెనీలు కూడా వాళ్ళ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టు ఒక ప్ర‌త్యేక ప‌ని కోసం నియ‌మించుకొని ప‌ని(ప్రాజెక్టు)  పూర్తి అయిన‌ త‌రువాత డ‌బ్బు చెల్లిస్తారు.

ఆన్‌లైన్ ద్వారా చాలా ర‌కాల సేవ‌ల‌ను కంపెనీల‌కు మ‌నం ఇవ్వ‌వ‌చ్చు. వాటిలో నేను ఇప్పుడు డిజిట‌ల్ మార్కెటింగ్‌కి సంబంధించిన సేవ‌ల‌ను ప్ర‌స్తావిస్తున్నాను.

  1. SEO
  2. SEM
  3. Facebook Ads
  4. Social Media Marketing
  5. Content Marketing
  6. Web Development
  7. Graphic Designing
  8. E-mail Marketing
  9. Video Marketing, మొద‌లైన‌వి

మీరు ఏ సేవ‌ల‌ను అయితే ఆన్‌లైన్ ద్వారా ఇస్తూ డ‌బ్బులు సంపాదించాల‌ని అనుకుంటున్నారో, వాటిపై మంచి ప‌ట్టు సాధించాలి. నెపుణ్యం అత్యంత కీల‌కం. మీరు ఒక వేళ లోగో డిజైన్ చేయాల‌నుకుంటే, వృత్తిరీత్యా డిజైన‌ర్లు వాడే సాప్ట్‌వేర్‌ల‌ను నేర్చుకోవాల్సిందే. లోగో డిజైనింగ్‌కి ప్రొపెష‌న‌ల్ డిజైన‌ర్లు పోటోషాప్‌, యిల్లుస్ట్రేట‌ర్ లేదా కోర‌ల్ డ్రా సాప్ట్‌వేర్‌ల‌ను వాడ‌తారు. కేవ‌లం కంపెనీల‌కు లోగోల‌ను మాత్ర‌మే డిజైన్ చేస్తూ కూడ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్న గ్రాఫిక్ డిజైన‌ర్లు చాలా మంది ఉన్నారు.

ఒక‌వేళ మీరు డిజిట‌ల్ మార్కెటింగ్ సేవ‌ల‌ను ఇస్తూ డ‌బ్బులు సంపాదించాలి అనుకుంటే మీరు ముందు డిజిట‌ల్ మార్కెటింగ్‌ని నేర్చుకొని ఉండాలి. డిజిట‌ల్ మార్కెటింగ్ సేవ‌ల‌కు కూడా ప్ర‌స్తుతం భారీ డిమాండ్ ఏర్ప‌డింది మ‌న దేశంలో. దానికి ముఖ్య కార‌ణం ఏంటంటే, వినియోగ‌దారులు ఎక్కువ‌గా ఇంట‌ర్‌నెట్ వాడ‌డం. ప్ర‌స్తుతం మ‌న దేశంలో మంచి డిజిట‌ల్ మార్కెట‌ర్‌లు లేక డిజిట‌ల్ మార్కెట‌ర్‌ల కొర‌త తీవ్రంగా ఉంది. ఇక్క‌డే మంచి నిష్టాతులైన డిజిట‌ల్ మార్కెట‌ర్‌ల‌ను కొన్ని ప‌నుల నిమిత్తం నియ‌మించుకొని ప‌ని చేయాల‌ని కంపెనీలు అనుకుంటున్నాయి. మంచి ప్రీలాన్స‌ర్‌లు కంపెనీల‌కు దొర‌క‌క‌పోతే డిజిట‌ల్ మార్కెటింగ్ ఏజేన్సీల‌కు కంపెనీలు ప‌నులు అప్ప‌గిస్తారు. మంచి మార్కెటింగ్ బ‌డ్జెట్ గ‌నుక ఉంటే ఫుల్ టైం డిజిట‌ల్ మార్కెటింగ్ ఉద్యోగం కూడా కంపెనీలు ఇవ్వ‌వ‌చ్చు.

2. సొంత డిజిట‌ల్ మార్కెటింగ్ ఏజెన్సీ

కేవ‌లం ఫ్రీలాన్స‌ర్‌గానే కాకుండా, డిజిట‌ల్ మార్కెటింగ్ నేర్చుకున్న‌వాళ్ళు సొంతంగా డిజిట‌ల్ మార్కెటింగ్ ఏజెన్సీల‌ను ప్రారంభించి సొంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించ‌వ‌చ్చు. అయితే ఏజెన్సీ స్టార్ట్ చేసే ముందు కొంత ప‌ని అనుభ‌వాన్ని సంపాదించి మార్కెట్‌పై అవ‌గాహ‌న పెంచుకొని స్టార్ట్ చేస్తే మంచిది అని నా అభిప్రాయం.

ఏజెన్సీ కాకుండా మీ సొంత వ్యాపారాన్ని కూడా మీరు ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హించాల‌నుకుంటే కూడా ప్రారంభించ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు హ్యాండ్ బాగ్స్ త‌యారు చేస్తున్నారు అనుకోండి, మీరు త‌యారు చేస్తున్న హ్యాండ్ బాగ్స్‌ని ఆన్‌లైన్ మార్కెటింగ్ చేసుకొని మీకు ఉన్న వ్యాపారాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హించుకోవ‌చ్చు.

మీరు డిజిట‌ల్ మార్కెటింగ్‌లో ప్రీలాన్స‌ర్‌గా రాణించాల‌న్నా, సొంత ఏజెన్సీ స్టార్ట్ చేయాల‌న్నా, ముందు డిజిట‌ల్ మార్కెటింగ్‌ని చ‌క్క‌గా నేర్చుకొని ఉండాలి. డిజిట‌ల్ మార్కెటింగ్‌పై మంచి శిక్ష‌ణ‌ని మేము డిజిట‌ల్ బ‌డి ద్వారా ఆన్‌లైన్‌లో అందిస్తున్నాము. మీరు గ‌నుక డిజిట‌ల్ బ‌డి ద్వారా డిజిట‌ల్ మార్కెటింగ్‌ని నేర్చుకోవాల‌నుకుంటే డిజిట‌ల్ బ‌డిని సంప్ర‌దించండి. డిజిట‌ల్ బ‌డి అందిస్తున్న కోర్సు తెలుగు భాష‌లోనే ఉంటుంది కాబ‌ట్టి మీరు సులువుగా అర్థం చేసుకోవ‌చ్చు.

Contact us to learn digital marketing course in Telugu

Call 6309973292 / 9573439404

Written by
Digital John
Join the discussion

Digital John

Digital John writes blogs from his own experience and knowledge

Are You Interested to Learn Digital Marketing?

We are Here to Help You

Fill this Form, We Will Guide You