Table of Contents
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి నా దగ్గరకి చాలా మంది విద్యార్థులు గ్రామాల్లో నుండి వస్తారు. ఎన్నో ఆశలు, ఎన్నో అంచనాల నడుమ బ్యాచ్ లు మొదలౌతాయి. విద్యార్థుల కంటే ఎక్కువ బాధ్యత నా పై ఉంటుంది. ఒక్కో సారి విద్యార్థుల తలిదండ్రులు విద్యార్థుల పై పెట్టుకున్న ఆశలు నాతో పంచుకుంటారు. అందరు విద్యార్థులు విజయాన్ని చేరుకోకపోవచ్చు. కారణాలు అనేకం.
కానీ, ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఒక విద్యార్థి డిజిటల్ బడిలో చేరి, ఈరోజు ఎంతో మంది గ్రామీణ విద్యార్థులకు ఆదర్శంగా ఉన్న ఆ విద్యార్థి గురించి మనం తెలుసుకుందాం.
విద్యార్థి పేరు Rakesh Bandari, పర్సనల్ బ్రాండింగ్ కోసం Rakesh Ranks గా మార్చడం జరిగింది.
రాకేష్ స్టోరీ ద్వారా ప్రతి గ్రామీణ విద్యార్థి స్ఫూర్తి పొందాలనే ఉద్దేశం తో నేను ఈ స్టోరీ రాస్తున్నాను.
అసలు రాకేష్ స్టోరీలో ఏం జరిగింది అనేది క్లుప్తంగా చూద్దాం.
స్టోరీ
డిజిటల్ బడి లో ఒక కొత్త డిజిటల్ మార్కెటింగ్ బ్యాచ్ ప్రారంభం అవ్వబోతుంది అని Youtube లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ బ్యాచ్ లో చేరడానికి, రాకేష్ నన్ను (డిజిటల్ జాన్) సంప్రదించాడు. కోర్స్ లో చేరాడు. రాకేష్ చేరిన బ్యాచ్ లో క్లాస్ లకు అటెండ్ అవ్వాలంటే కొంత కష్టమే. ఎందుకంటే ఉదయం 6 గంటలకు క్లాస్ ఉంటుంది. ప్రతి క్లాస్ కి కొన్ని నిమిషాల ముందే చేరేవాడు. నేర్చుకున్న వాటిని చాల అద్భుతంగా implement చేసేవాడు. తన బ్యాచ్ లో ఉన్న తోటి విద్యార్థులకి కూడా చాల సహాయం చేసేవాడు. తను నేర్చుకుంటేనే మిగతా వాళ్ల Doubts కూడా క్లియర్ చేసేవాడు.ఇప్పటి వరకు అంత బాగానే ఉంది.
కానీ కాలం ముందుకెళ్తున్నప్పుడు మనం అనుకోని ప్రతి కూల పరిస్థితులు మనకు ఎదురవుతాయి అవి మనం ముందే ఊహించలేము. అటువంటి పరిస్థితి రాకేష్ కి ఎదురైంది.
డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడానికి దాచుకున్న ద్రవ్యము కొన్ని Health issues రావడం వల్ల ఖర్చు అయిపోయింది. కోర్స్ ని ఎలా పూర్తి చేయాలి? అనే ప్రశ్న కి సమాధానం లేదు. కోర్స్ ని మధ్యలోనే ఆపేద్దాం అనుకున్నాడు. కానీ ఆర్థికంగా చేయూతని ఇవ్వడం తో మళ్ళీ కోర్స్ ని ప్రారంభించాడు. ఆసుపత్రి పడక పై నుండే క్లాస్ లకు హాజరయ్యే వాడు. ఒక 3 నెలలు కోర్స్ చేసాడు. ఇచ్చిన assignments చాల త్వరగా కంప్లీట్ చేసేవాడు. ఆ తర్వాత ఒక 3 నెలలు డిజిటల్ బడి లోనే ఇంటర్న్షిప్ చేసాడు. ఆ తరువాత Freelancing Projects చేస్కుకుంటూ డిజిటల్ బడికి పార్ట్ టైమర్ గా తన సేవలని అందిస్తున్నాడు.
SEO, WordPress వెబ్సైట్లు చేయడం లో రాకేష్ ప్రావీణ్యం అద్భుతం అనే చెప్పాలి. పని చూస్తే మీకే అర్ధం అవుతుంది.
రాకేష్ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు చూద్దాం
1. నిలకడ
డిజిటల్ మార్కెటింగ్ లో విజయం అన్ని సార్లు అంత తొందరగా రాదు. చాలా మంది విద్యార్థులను నేను చూసాను, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటారు. తక్కువ జీతం తో ప్రారంభించాలా నా కెరీర్ అనుకోని అమీర్ పేట్ లో సాఫ్ట్ వెర్ కోర్స్ లు నేర్చుకోవడానికి డెమో లు అటెండ్ అవుతూ ఉంటారు. ఏ కెరీర్ అయినా ఎక్కువ శాతం తక్కువ జీతం తోనే ప్రారంభించాలి. అనుభవం పెరిగే కొద్దీ జీతం పెరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు నిలకడగా ఉండాలి.
సక్సెస్ కి షార్ట్ కట్ లేదు, కొంత కాలం వేచి చూడాలి.
2. Focusing on strengths
రాకేష్ పూర్తి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తరువాత కొన్ని మోడ్యూల్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు. వాటిలో SEO, WordPress, కంటెంట్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ పై చాలా తక్కువ సమయంలో ప్రావీణ్యాన్ని సాధించాడు.
మనం ఎంత సేపు మన బలహీనతలపై దృష్టి పెడుతూ మన పై మనమే నమ్మకాన్ని కోల్పోతూ మనకు మనమే బలహీన పరుచుకుంటుంటాము. మన బలం ఏంటి? అనే వాటిపై దృష్టి పెడితే ప్రపంచం మనకు ఇంకో లాగ కనబడుతుంది.
సైకాలజిస్ట్ లు ప్రతీ సారి “మిమ్మల్ని మీరు నమ్మాలి” అని అంటుంటారు.
3. అందుబాటులో ఉండడం
రాకేష్ ఉండేది ఉప్పల్ గ్రామం, ఇది హుజురాబాద్ ప్రాంతంలో ఉంది. ముందు నుంచి ఇంటి నుండే పని చేస్తున్నాడు. పని విషయం లో ఎంతో నమ్మకంగా ఉంటూ, అందుబాటులో ఉండడం రాకేష్ ప్రత్యేకత.
Availability matters
ఇంటి నుండే పని చేస్తున్న ఉద్యోగుల గురించి రాస్తున్నాను, మీరు ఎంత శాతం అందుబాటులో ఉంటున్నారో ఒక్క సారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కొంత మంది నిబంధనలకు విరుద్ధంగా రెండు లేదా మూడు ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు కంపెనీ కి చాలా నమ్మకమైన ఉద్యోగులుగా పేరు తెచ్చుకోవాలి.
4. ఆలోచన విధానం
రాకేష్ & నేను ఒకే విధంగా, ఒకరికి తెలియకుండ ఒకరు ఆలోచించడం జరుగుతుంది. చాలా సార్లు ఇలా అయింది. ఈ విధంగా నాకు ఇంకా ఎవ్వరితో ఏ పనిలో కూడా ఇంతవరకు అవ్వలేదు. అంతగా sync అయ్యాము.
5. బలహీనతలను బలపరచుకోడం
రాకేష్ కి కూడా అకడమిక్, కెరీర్ పరంగా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఉదా: ఇంగ్లీష్ లో కంటెంట్ రాయడం, మాట్లాడడం రాదు. అలా అని ఇంగ్లీష్ ని విడిచిపెట్టలేదు. ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాడు. తనకు రాని పనులను నేర్చుకుంటూ, మెరుగు పరుచుకోవడానికి నిరంతర కృషి చేస్తూనే ఉన్నాడు.
ఈ ఆర్టికల్ చదువుతున్న నీ పరిస్థితి ఏంటి? నువ్వేం చేస్తున్నావు నీ బలహీనతలను? వాటిని మెరుగు పరుచు కుంటున్నవా? లేకపోతే ఎప్పుడో విడిచిపెట్టి ముందుకు వెళ్తున్నావా? ఒక సారి ఆలోచించు. పైకి రావాలి అనుకుంటే నేర్చుకునే లక్షణం తప్పనిసరి.
ఇకనైనా
రాకేష్ నేర్చుకున్న మొదటి కోర్సు డిజిటల్ మార్కెటింగ్ కాదు. ఎథికల్ హ్యాకింగ్, జావా లాంటి కోర్సు లు చేసాడు. కానీ, అందులో నిలదొక్కుకోలేదు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తరువాత కూడా డిజిటల్ మార్కెటింగ్ నుండి వైదొలగాలని అనుకున్నాడు. కానీ, ఇంకా ఏది నేర్చుకున్నా మళ్ళీ మొదటి నుండి నేర్చుకోవాలి. పైగా మళ్ళీ కొంత డబ్బు, సమయం వృధా అవుతుంది అని డిజిటల్ మార్కెటింగ్ నే ఉడుం పట్టు లాగా పట్టాడు. సక్సెస్ కొట్టాడు.
కెరీర్ పై క్లారిటీ నేటి యువతకు చాలా అవసరం. అయ్యో, నాకు ఎవ్వరూ చెప్పేవాళ్ళు లేరు అని కారణాలు చెప్పే రోజులు పోయాయి. ఏ కెరీర్ బాగుంది అని తెలుసుకోవడానికి అందరి చేతిలో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉంది. ఉపయోగించండి. కెరీర్ పట్ల ఏ సందేహాలు ఉన్నా, డిజిటల్ జాన్ ని నేరుగా వాట్సప్ ద్వారా సంప్రదించండి. 9573439404.
రాకేష్ స్టోరీ మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకుంటే కామెంట్ రూపం లో తెలియజేయండి. ఇలా మీలో స్ఫూర్తి నింపే డిజిటల్ బడి విద్యార్థుల స్టోరీస్ ని మీ కోసం రాస్తాను.
ఇట్లు
మీ డిజిటల్ జాన్
టచ్ అయింది అన్నా ..thanks
రాకేష్ గారి గురించి రాసినందుకు థాంక్యూ జాన్ గారు, డిజిటల్ మార్కెటింగ్ డే ఈవెంట్ లో ఒక స్పీకర్ గా రాకేష్ గారు SEO గురించి ఒక సీనియర్ ఎక్స్పర్ట్ లాగా చెప్తుంటే విని చాలా ఇంప్రెస్ అయ్యాను. మీరు రాసినట్లు గా రాకేష్ గారి లాగా అందరూ తమని తాము నమ్ముతూ, తమ బలహీనతలను బలంగా మార్చుకుంటూ, పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. ఇలాగే రాకేష్ గారు ఇంకా లైఫ్ లో అనేక విజయాలు సాధించాలని మరెందరికో స్ఫూర్తి గా నిలవాలని కోరుకుంటున్నాను..
Good commitment sir .. స్థిరమైన ఆలోచనలకు బలమైన పునాది నమ్మకం. బలమైన నమ్మకమే మన విజయం !
Congratulations Annaya
I am really inspiration sir
Rakesh sir ur reall HERO
Tq john sir
I LEARNED
Belive my self
Focus on goals