Table of Contents
బ్లాగింగ్ ద్వారా డబ్బులు చాలా విధాలుగా సంపాదించవచ్చు. కానీ ప్రస్తుతం 2019 బ్లాగింగ్ ట్రెండ్ ని బట్టి డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనేదానిపై విశ్లేషించి 4 టాప్ ఆదాయ వనరులను మీకు యీ ఆర్టికల్ ద్వారా పరిచయం చేస్తున్న
Earn Money Online by Blogging – Digital Badi
1. 4 టాప్ ఆదాయ వనరులు
- సమాచార ఉత్పత్తులు
- అఫిలియట్ మార్కెటింగ్
- స్పాన్సర్డ్ ఆర్టికల్స్
- గూగుల్ యాడ్సెన్స్
2. సమాచార ఉత్పత్తులను తయారు చేసి అమ్మడం
మనం సమాచార యుగం లో బ్రతుకుతున్నాం. మనకు తెలిసిన విలువైన సమాచారాన్ని సమాచార ఉత్పత్తులుగా మార్చి అమ్మవచ్చు. వీటన్నింటిని ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ తో ఎక్కడినుండైనా మీరు చేయవచ్చు.
కొన్ని సమాచార ఉత్పత్తులను మీకు పరిచయం చేస్తాను.
1. ఆన్‌లైన్ కోర్సులు (Online Courses)
ఆన్‌లైన్ కోర్సులు ప్రస్తుతం ట్రెండింగ్ అని చెప్పగలను. ఎవరికి వారు కోర్సులు తయారు చేసి అమ్ముతున్నారు. వీడియోల ద్వారా ఎక్కువ శాతం కోర్సులు తయారు చేస్తున్నారు. ఇమెయిల్ ద్వారా text లెసన్స్‌తో కూడ కొంతమంది కోర్సులు అందిస్తున్నారు. నేను ఆన్‌లైన్ మనీ ఎర్నింగ్ కోసం ఎంచుకున్న మార్గం కూడా ఇదే. అయితే, నేరుగా వచ్చి ఆన్‌లైన్ కోర్సులు తయారు చేస్తే కష్టం. అంతకంటే ముందు మీకంటూ ఒక నిష్ (niche) ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఒక బ్లాగ్ ద్వారా తక్కువ ఖర్చులో ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది. అందుకోసమే చిన్న బ్లాగింగ్ కోర్సును తయారు చేసాను నేను.
2. E-Books (ఎలక్ట్రానిక్ పుస్తకాలు)
E-booksని కూడ మనం చాలా సులువుగా తయారు చేసి అమ్మవచ్చు. వీటికోసం మీకు కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు. ఉదాహరణకి, మీకు గణితంపై మంచి పట్టు ఉంది అనుకోండి, మీరు గణితం సబ్జెక్టుని సులువుగా నేర్చుకోవడానికి మీకు తెలిసిన చిట్కాలతో, సూత్రాలతో ఒక చిన్న పుస్తకం రాయొచ్చు. ఆ పుస్తకాన్ని ఆన్‌లైన్ ద్వారా మార్కెటింగ్ చేసుకొని అమ్మడమే తరువాయి. నేను ఇటీవలె “లోకల్ SEO” పై ఒక చిన్న పుస్తకాన్ని రాసాను. ఏడుగురు కొన్నారు ఇప్పటివరకు. ఈ పుస్తకం నన్ను రచయితని చేసింది. నేను మరిన్ని పుస్తకాలు మున్నుందు రాయడానికి స్పూర్తినిచ్చింది.
కేవలం కోర్సులు, e-పుస్తకాలు (e-books) కాకుండా మీరు Paid ఆన్‌లైన్ సెమినార్ కూడా నిర్వహించవచ్చు. వీటిని మీ మొబైల్ ద్వారా కూడ నిర్వహించవచ్చు.
మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని ప్రపంచానికి ఒక బ్లాగ్ ద్వారా తయారు చేసి తెలియజేయండి. నెమ్మదిగా సమాచార ఉత్పత్తులనూ తయారు చేయండి.
3. అఫిలియేట్ మార్కెటింగ్
వేరే కంపెనీల ఉత్పత్తులను మనం మన బ్లాగ్ ద్వారా అమ్మడం, అలా అమ్మడం ద్వారా మనకు కొంత శాతం కమీషన్ వస్తుంది. ఉదాహరణకి ఒక పుస్తకంపై మీరు రివ్యూ రాసారు అనుకోండి, ఆ రివ్యూలోనే మీరు మీ అఫిలియేట్ లింక్‌ని ఇస్తారు. మీరు రాసిన రివ్యూ చదివి, మీ బ్లాగ్ ద్వారా పుస్తకాన్ని కొంటే మీకు కొంత శాతం కమీషన్ వస్తుంది. పుస్తకం ఖరీదు 200 రూపాయలు అనుకుందాం, ఒక అమ్మకానికి 10 శాతం కమీషన్ అనుకుంటే 20 రూపాయలు మీకు వస్తుంది ప్రతి అమ్మకానికి. బ్లాగర్లు డబ్బును ఎక్కువగా సంపాదించే మార్గాల్లో ఇది ఒకటి. మీకంటూ సొంతంగా ఒక బ్లాగ్ ఉంటే ఇది కూడ ఒక అవకాశం. అన్ని ఉత్పత్తులను మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం కష్టం. మీకు ఏ నిష్‌పై పరిజ్ఞానం ఉంటే దానిపై చేయడం సులువు అవుతుంది.
4. స్పాన్సర్డ్ ఆర్టికల్స్
వేరే కంపెనీల ఉత్పత్తుల కోసం గానీ, సేవల కోసం గానీ కొంత డబ్బు తీసుకొని ఆర్టికల్స్ రాయడం. ఎంత డబ్బు అనేది మీ బ్లాగ్‌కి ఉన్న ట్రాపిక్ ని బట్టి తీసుకోవచ్చు. నాకు తెలిసి వెబ్ మీడియాకి ఎక్కువగా వచ్చే ఆదాయాల్లో ఇది కూడా ఒక మార్గం. పబ్లిక్ రిలేషన్స్‌లో భాగంగా కంపెనీలు మిమ్మల్ని (బ్లాగర్లు) సంప్రదించవచ్చు.
5. గూగుల్ యాడ్‌సెన్స్
ఇది కూడా ఆదాయ వనరులలో ఒకటి. గూగుల్ యాడ్‌సెన్స్ ద్వారా డబ్బు సంపాదించాలంటే చాలా ట్రాపిక్ ఉండాల్సి ఉంటుంది మన బ్లాగ్‌కి. ప్రస్తుతం గూగుల్ యాడ్‌సెన్స్ ఇంతకుముందు ఇచ్చినంత డబ్బు ఇవ్వట్లేదు. గూగుల్ యాడ్‌సెన్స్‌కి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మీరు ఒక నిష్ పై బ్లాగింగ్ చేస్తే మీ ఇన్వెంటరీని మీరే అమ్ముకోవచ్చు. వీటి గురించి ఇంకా నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ బడి అందిస్తున్న బ్లాగింగ్ కోర్సులో చేరి ఆన్‌లైన్ ద్వారా నేర్చుకోండి.
Contact us to learn blogging course in Telugu
Reach us to learn digital marketing course in Telugu
[mailerlite_form form_id=2]