Table of Contents
హైదరాబాద్‌లో విజయవంతంగా జరిగిన డిజిటల్ మార్కెటింగ్ డే ఈవెంట్‌పై డిజిటల్ బడి ప్రత్యేక కథనం
1. డిజిటల్ మార్కెటింగ్ డే ఎలా ప్రారంభమైంది?
ప్రతి ఒక్కరికి ప్రత్యేక రోజులు ఉన్నాయి. ఉదాహరణకు ఆగష్టు 19వ తారీఖు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటారు. నవంబర్ 14వ తారీఖు బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ దినోత్సవాన్ని డిసెంబర్ 16వ తారీఖున భారతదేశంలో ప్రారంభించాలని సౌరవ్ జేన్ ఇచ్చిన పిలుపును ఇంచుమించు అన్ని నగరాల డిజిటల్ మార్కెటర్‌ల నుండి సానుకూల స్పందన రావడంతో డిజిటల్ మార్కెటింగ్ డే కార్యరూపం దాల్చింది.
ఈ ఈవెంట్‌ని ఆయా నగరాలలో నిర్వహించడానికి సౌరవ్ జేన్ కొంత మంది డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌ప్లూయెన్సర్స్‌కి అవకాశం ఇచ్చాడు, హైదరాబాద్‌లో నిర్వహించడానికి డిజిటల్ జాన్ బృందానికి అవకాశం ఇచ్చాడు.
2. ఈవెంట్ స్పీకర్స్
1. స్మార్ట్ తెలుగు రవి కిరణ్
ఈవెంట్‌కి ముఖ్య స్పీకర్‌గా మనందరికి సుపరిచితులైన స్మార్ట్ తెలుగు రవి కిరణ్ గారు రావడం జరిగింది. వారు బ్లాగింగ్‌పై తనదైన శైలిలో సెషన్‌ని ముందుకు తీసుకెళ్ళారు. బ్లాగింగ్‌లో బ్లాగర్స్ తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు,బ్లాగింగ్ ద్వరా రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోవొచ్చు అనే అంశాలపై వివరించారు. ఆ తరువాత బ్లాగింగ్‌పై అడిగిన అనేక ప్రశ్నలకు క్లుప్తంగా జవాబులు ఇచ్చారు. బ్లాగింగ్‌పై రవి కిరణ్‌గారు తీసుకున్న సెషన్ చాలా మందిని ఆకట్టుకుంది అని ఈవెంట్ అనంతరం మేము తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌లో తెలియజేశారు.
2. రోని సామ్యేల్ PPC సెషన్
రోని చిన్న డిజిటల్ మార్కెటింగ్ క్విజ్‌తో తన సెషన్‌ని ఎనర్జిటిక్‌గా ప్రారంభించాడు. గూగుల్ అడ్వర్‌టైసింగ్‌పై రోని కొన్ని చాలా విలువైన విషయాలు చెప్తూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వారు పీపీసీ ఎక్స్‌పర్ట్ ఎలా అవ్వొచ్చో తెలియజేశాడు.
3. నితీష్ తల్లా – డిజిటల్ విజ్ఞాన్
నితీష్ సోషల్ మీడియా లిసనింగ్ & మానిటరింగ్‌పై సెషన్ తీసుకున్నారు. సోషల్ మీడియా మానిటరింగ్, మన టార్గెట్ ఆడియన్స్‌ని
ఎలా ట్రాక్ చేయొచ్చు, ఇన్‌బౌండ్ మార్కెటింగ్, కస్టమర్లు మన బ్రాండ్ గురించి సోషల్ మీడియాలో ఏం చర్చించుకుంటున్నారో తెలుసుకోవడానికి అవసరమైన టూల్స్ గురించి వివరించారు.
4. డిజిటల్ జాన్ – డిజిటల్ బడి
నేను చెప్పాలి అనుకున్న టాపిక్‌ని రవి కిరణ్ గారు తను తీసుకున్న బ్లాగింగ్ సెషన్‌లో కవర్ చేయడంతో నేను నా టాపిక్‌ని స్కిప్ చేసాను. ఆ తరువాత నన్ను నేను పరిచయం చేసుకొని Q & A సెషన్‌ని తీసుకున్నాను.
Digital John
3. Q & A సెషన్
స్పీకర్‌ల సెషన్ల అనంతరం Q & A సెషన్‌ని ప్రారంభించాం. బ్లాగింగ్, SEO, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా, వార్డుప్రెస్సు మొదలైన వాటిపై అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా జవాబులు ఇవ్వడం జరిగింది. Q & A సెషన్‌లో స్సీకర్స్ అందరు జవాబులు ఇచ్చారు.
Event Speakers
4. నెట్‌వర్కింగ్
నెట్‌వర్కింగ్ సెషన్‌లో ఒకరినొకరు పరిచయం చేసుకొని స్పీకర్స్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం వచ్చిన వారందరికి ఏర్పాటు చేసిన రీప్రెష్‌మెంట్స్ తీసుకొని ముచ్చటించాం.
cheers
ఈవెంట్ మొత్తం అయిపోయిన తరువాత మళ్ళీ ఎప్పుడు ఇటువంటి ఈవెంట్ లేదా వర్క్‌షాప్ నిర్వహిస్తారు అని చాలా మంది అడిగారు. డిజిటల్ జాన్ బృందం 2019లో మంచి ఎడ్యూకేషనల్ వర్క్‌షాప్స్ పెట్టడానికి సిద్ధమవుతుంది. 2019లో పెట్టే వర్క్ షాప్స్‌లో మీరు కూడా పాల్గొనాలనుకుంటే మీరు నేరుగా డిజిటల్ జాన్‌ని సంప్రదించండి +91-9573439404. డిజిటల్ జాన్ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్‌లో చేరానుకుంటే డిజిటల్ జాన్‌ని వాట్సాప్ ద్వారా గ్రూప్ రిక్వెస్ట్ పెట్టండి.
Contact Us to learn digital marketing course in Telugu
[mailerlite_form form_id=2]