Table of Contents
ల్యాండింగ్ పేజ్ అనేది కూడా ఒక వెబ్ పేజ్‌యే. కాకపోతే ఒక ప్రత్యేక పని కోసం మనం ల్యాండింగ్ పేజిని సృష్టించి ఆ ప్రత్యేక పని కోసం వినియోగిస్తుంటాం డిజిటల్ మార్కెటింగ్‌లో.
మనకు తెలుసు, ఒక వెబ్‌సైట్‌కి మనం వెళ్తే హోం పేజిని, కాంటాక్ట్ పేజి, ఇతర పేజీలను మనం చూస్తాం. అలాగే ల్యాండింగ్ పేజి కూడా ఒక వెబ్ పేజ్‌యే.
ఎక్కడైతే వెబ్ విసిటర్స్ ల్యాండ్ అవుతారో అదే ల్యాండింగ్ పేజ్. ల్యాండింగ్ పేజీలను ఎక్కువ శాతం ఆడ్వర్టైజింగ్ కోసం వాడుతాంటారు లీడ్స్ కోసం.
1. ల్యాండింగ్ పేజ్‌ని ఎలా క్రియేట్ చేస్తారు?
వెబ్‌పేజిని మనం ఎలా క్రియేట్ చేస్తామో, ల్యాండింగ్ పేజి కూడా అలాగే క్రియేట్ చేస్తాం. కాకపోతే ల్యాండింగ్ పేజికి కొన్ని తప్పనిసరి నియమాలు పాటించాల్సి ఉంటుంది. Best Practicesలోభాగంగా.
ల్యాండింగ్ పేజిని ఆన్‌లైన్‌లో క్రియేట్ చేయడానికి చాలా టూల్స్ ఉన్నాయి. అందులో అన్‌బౌన్స్ చాలా పాపులర్ టూల్, ఖరీదైనది కూడా. ఇన్‌స్టాపేజి కూడా ఇంకొక టూల్. ల్యాండింగ్ పేజీ కోసమే ఉన్న టూల్స్ చాలా ఉన్నాయి. వార్డుప్రెస్సు థీమ్స్ కూడా చాలా ఉన్నాయి కేవలం ల్యాండింగ్ పేజి థీమ్స్‌గా.
Digital Badi Landing Page has more than 20% conversion rate
2. ల్యాండింగ్ పేజ్‌కి బెస్ట్ Practices
- ల్యాండింగ్ పేజి నుండి యూజర్‌ని ఏ ఇతర లింక్‌కి మళ్ళించొద్దు.
- ల్యాండింగ్ పేజి వేగంగా లోడ్ అయ్యేట్టు చూడండి. (మంచి హోస్టింగ్ తప్పనిసరి)
- ల్యాండింగ్ పేజ్‌కి కావలసిన యాడ్ కాపీని సెపరేట్ కాపీ రైటర్‌తో రాయిస్టే మంచిది ( కాపీ రైటర్‌కి మరియు కంటెంట్ రైటర్ వేరు, రెండు ఒకటి కాదు)
- కాల్ టూ యాక్షన్ బటన్ క్లియర్‌గా ఉండాలి
- ల్యాండింగ్ పేజి మొత్తం ఒకే పాయింట్ గురించి మాట్లాడుతూ చివరికి యూజర్ వివరాలు నమోదు చేసేలా ఉండాలి
Contact Us to Learn Digital Marketing Course in Telugu