హలో , వెల్కమ్ టూ డిజిటల్ బడి బ్లాగ్
ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయ్, వాటిలో డబ్బు సంపాదించడానికి ఉపయోగపడే 10 విధానాల గురించి మీరు యీ ఆర్టికల్ ద్వారా తెలుసుకుంటారు.
ఇప్పుడు మనం మన topic లోకి వెళదాం. 10 మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి
Blogging
బ్లాగింగ్ అనేది ఒక ఉత్తమమైన మార్గం అనుకోవొచ్చు ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడానికి. Blogging ద్వారా కూడా చాలా ఉంటాయి. వాటిలో కొన్ని నేను మీకు చెప్తాను ఈ ఆర్టికల్ చివరిలో. దీని ద్వారా ఎలా సంపాదించాలి అనేది నేను మీకు చెప్తాను అంతకంటే ముందు వేరే వి కూడా తెలుసుకుందాం.
బ్లాగింగ్ ద్వారా సంపాదించడానికి 4 మార్గాలు
Affiliate Marketing
Affiliate Marketing అంటే ఏంటి అంటే ఒక వేళ మీరు ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే ఇది కూడా ఒక మార్గం Friends. ఇక్కడ డబ్బు ఎలా వస్తుంది అంటే ఏదైనా మధ్యవర్తిత్వం అనుకోండి.
ఉదా:- ఏదైనా స్థలం గనుక మధ్యవర్తి ద్వారా అమ్ముడు పోయింది అనుకోండి ఆ మధ్యవర్తికి కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఆ కమిషన్ ఏదైతే ఉందొ ఆ మధ్యవర్తి ద్వారా అమ్ముడైంది కాబట్టి ఆ మధ్యవర్తి కి ఎలాగైతే కమిషన్ ఇస్తున్నామో అలాగే ఇక్కడ కూడా అలా ఉంటుంది అంటే మన ద్వారా sale అయింది కాబట్టి ఆ ప్రొడక్ట్ అమ్మకంలో మనకు కొంత కమిషన్వస్తుంది. ఎంత కమిషన్ ఉంటుంది అన్నది ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్క percentage ఉంటుంది. కొన్ని వాటికి 30%, 50% కూడా ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్క percentage ఉంటుంది. అది తక్కువ కావచ్చు లేదా ఎక్కువైనా కావచ్చు అది కంపెనీ లోని ప్రొడక్ట్ ని బట్టి ఉంటుంది. ఇది కూడా ఒక మంచి మార్గం.
Selling Own Products
ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించాలను కుంటే సొంత ఉత్పత్తులను అమ్మడం ద్వారా కూడా సంపాదించవచ్చు. మీరు ఒకవేళ భౌతికంగా తయారు చేస్తున్నా సరే లేకపోతే డిజిటల్ గా అయినా సరే డిజిటల్ గ అంటే ఏవైనా వీడియోస్ కావచ్చు, లేదా Files కావచ్చు, లేదా ఒక e -బుక్ కావచ్చు.
Reseller
ఇది Affiliate marketing కి దగ్గరగా ఉంటుంది. మీరు Reseller గా చేరి వేరే ప్రొడక్టు ని Recommend చేయచ్చు అన్నమాట.అలా recommend చేసినప్పుడు మీరు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. నేను కొన్ని చూసాను వాళ్ళు 70% కూడా సంపాదిస్తారు. అంటే వాళ్ళు 70%కమిషన్ ని సంపాదిస్తారు Reseller పైన. కాబట్టి ఇది కూడా ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.
Sponsored Articles
Sponsered Articles అంటే దీని ద్వారా మీరు డబ్బు సంపాదించాలనుకుంటే మీకు ఖచ్చితం గా బ్లాగ్ ఉండాలి. బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే కొన్ని మార్గాలు ఉన్నాయ్ అని చెప్పాను కదా అందులో ఇది ఒకటి. Sponsered Article అంటే మీ బ్లాగ్ కి ఉన్న ట్రాఫిక్ ని బట్టి వీళ్ళు డబ్బు ఇస్తుంటారు మీకు. ఎంత లేదు అనుకున్నా మినిమం 1000 Rs కంటే ఎక్కువ మీకు ఇస్తుంటారు మీ బ్లాగ్ ట్రాఫిక్ ని బట్టి మీరు డిమాండ్ చేయ వచ్చు. స్పాన్సర్ ఆర్టికల్ అంటే ఏమి లేదు ఒక బ్లాగ్ ఉంటుంది. వాళ్ళు మీకు ఆర్టికల్ ఇచ్చి మీ పేరు మీదనే బ్లాగ్ లో పోస్ట్ చేయమంటారు. మీరు అడిగినంత డబ్బు వాళ్ళు ఇస్తారన్నమాట.
Fiverr
Fiverr అనేది ఏమిటి అంటే ఇది ఒక Website. దీని ద్వారా మీరు ఏదైనా సేవలు ఇవ్వగలిగితే ఆ సేవలను అమ్ముతూ మీరు డబ్బుని సంపాదించవచ్చు. వాటిలో భాగంగా కొన్ని సేవలు మీకు చెప్తున్నాను. గ్రాఫిక్ డిజైనర్ సేవ కావచ్చు లేకపోతే Content marketing సేవ కావచ్చు ఇంకా కాపీ రైటర్ సేవ కావచ్చు ఇలా మీకు ఏదైనా పని వచ్చి ఉంటుంది కదా మీరు అదే పనిని సేవల రూపంలో అమ్మవచ్చు fiverr.com లో. మీరు ఇస్తూ డబ్బు ని సంపాదించ వచ్చు అన్నమాట. ఒకవేళ సేవలు ఇచ్చిన తర్వాత డబ్బు ని ఇవ్వకపోవడం ఆలా ఏమి ఉండదు. Fiverr అనేది మీకు మధ్యవర్తి గ ఉంటుంది . ముందు క్లయింట్ నుండి అది డబ్బు తీసుకున్నాకే మీకు పని ఇస్తుంది కాబట్టి మన పనికి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మోసపోవడానికి అవకాశాలు ఉండవు. దీని ద్వారా గనుక మీరు డబ్బు సంపాదించాలనుంటే? ఇది మంచి వెబ్సైటు అని చెప్పవచ్చు.
ఇలాంటి వెబ్ సైట్స్ ఇంటర్నెట్ లో కోకొల్లలు. సందార్భాన్ని బట్టి ఒకటి పరిచయం చేసాను.
Digital Marketing Services
డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అమ్మవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ని గనుక నేర్చుకుంటే, సోషల్ మీడియా మార్కెటింగ్ కావచ్చు లేదా SEO సర్వీసెస్ Or SEM కావచ్చు Faccebook ప్రకటనలు కావచ్చు ఏవైతే మీరు నేర్చుకుంటారో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు లో వాటిని మీరు సేవలుగా అందించవచ్చు. అంటే ఇది కూడా Online లోనే. ఇంతకుముందే మీకు Fiverr గురించి చెప్పాను కదా ,అక్కడ మీరు డిజిటల్ మార్కెటింగ్ సేవలను కూడా అందించవచ్చు. అలాగే సొంతంగా కూడా అంటే డిమాండ్ పెరిగేకొద్దీ మీ అంతట మీరే ఒక సొంత డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ని మొదలుపెట్టవచ్చు. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ సేవలను అందించాలనుకుంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి ఒకవేళ మీకు డిజిటల్ మార్కెటింగ్ రాదు. మాకు తెలియదు నేర్చుకోవాలనుకుంటే గనుక. ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ని మేము అందిస్తున్నాము ఆన్లైన్ ద్వారా. ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ డిజిటల్ బడిలో చేరి మీరు నేర్చుకోవచ్చు. కోర్స్ వివరాల కోసం 9573439404 నెంబర్ ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి.
Google Adsense
గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మీరు డబ్బు సంపాదించ్చవచ్చు. ఇది ఎలా అంటే దీన్ని మళ్ళీ బ్లాగింగ్ కి ముడిపెడుతున్నాను. దీని ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే మీకు బ్లాగ్ ఉండాల్సిందే. బ్లాగ్ ఉంటె ఏమౌతుంది అంటే Display Ads గూగుల్ ఇస్తుంది. వాటిని గనుక మీరు గూగుల్ యాడ్సెన్స్ కి కలుపుకుంటే మీ బ్లాగ్ లో Display Ads ని చూపిస్తూ ఉంటుంది . వాటిని బట్టి మీరు డబ్బు ని సంపాదించ వచ్చు. గూగుల్ యాడ్సెన్స్ గురించి చాలా మందికి తెలుసు, ఇది కూడా ఒక డబ్బు సంపాదించే మార్గం అని చెప్పగలుగుతా. ఒకవేళ మీకు బ్లాగ్ ఉంటేనే ఇది అవుతాది. ఇంకా మీకు Sponcered Articles అలాగే Affiliate marketing అలాగే గూగుల్ Adsense బాగా చేయాలనుకుంటే మీకు ఖచ్ఛితంగా బ్లాగ్ ఉండాల్సిందే అందుకే బ్లాగింగ్ ని మేము మొదటి స్థానంలో పెట్టాం. ఒకవేళ మీరు బ్లాగింగ్ మాత్రమే నేర్చుకోవాలనుకుంటే, బ్లాగింగ్ పై కూడా కోర్స్ ఉంది. బ్లాగింగ్ కోర్స్ వివరాల కోసం
Youtube
యూట్యూబ్ ద్వారా మీరు డబ్బుని సంపాదించవచ్చు. దీని ద్వారా డబ్బుని ఎలా సంపాదిస్తారు అంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దీన్ని మీరు monetize చేసుకోవడం. మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు కొన్ని వీడియో Ads వీడియో చూసే ముందే వస్తుండడం గమనించే ఉంటారు. అలా మీ ఛానల్ ని Monetize చేయడం ద్వారా మీకు ఆదాయం వస్తుంది. మీరు ఇందులో ఎంతైనా సంపాదించవచ్చు అంటే ఇందులో మీకు వచ్చే వ్యూస్ (views) ని బట్టి మీరు డబ్బుని సంపాదించవచ్చు. కాబట్టి ఇది కూడా ఆదాయ వనరు గా చెప్పవచ్చు మీకు ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించాలి అనుకుంటే.
Teaching Online
ఇప్పుడు ఉన్న covid-19 వల్ల చదవడం అనేది offline అంటే college కి వెళ్లి చదవడం అనేది online లోకి మారింది చాలా వరకు. Classes ని online లోనే తీసుకోవడం మనం చూస్తూ నే ఉన్నాం. కాబట్టి మీకు ఏదైనా సబ్జెక్టు తెలిసి ఉంటె అది ఏ నైపుణ్యం అయినా సరే ఒకవేళ మీరు గణితంలో కానీ చరిత్ర, ఇంకా పొలిటికల్ సైన్స్ వీటిని మీరు ఆన్లైన్ clasess చెప్పి డబ్బు సంపాదించవచ్చు.ఏ సబ్జెక్టు పై మీకు పట్టు ఉంది అనుకుంటే టీచింగ్ ద్వారా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు . దీన్ని మనము online training industry అని చెప్తాము. ఇది covid-19 తరువాత ఎక్కువ అవుతుంది మన దేశంలో
Lead Sales
ఇది ఏంటి అంటే ఉదా:- మీ దగ్గర ఒకవేళ ఇంజనీరింగ్కి సంబంధించిన బ్లాగ్ ఉంది అనుకోండి అంటే ఒకవేళ Career Guidanceకి సంబంధించిన బ్లాగ్ ఉంటె విద్యార్థులు వస్తుంటారు కాబట్టి విద్యార్థులు ఎవరైతే వుంటారో వాళ్ళ వివరాలు గనుక సేకరించి మీరు వాటిని అమ్మవచ్చు. వీటినే లీడ్ సేల్ అంటుంటారు. నేను కొన్ని బ్లాగ్స్ ని చూసాను వాళ్ళు 800 రూ. కి కూడా ఒక్క లీడ్ సేల్ అంటే ఆ ఒక్క విద్యార్ధి వివరాలు వాళ్ళ కాలేజ్ కి అమ్ముతుంటారు. ఒకవేళ మీరు గనుక మీ బ్లాగ్ ద్వారా ఎవరి వివరాలను ఎలాంటి వారి వివరాలను అమ్మాలి అనేది నిర్ణయించుకోండి. అది కూడా ఆదాయ వనరు అని చెప్పగలుగుతా. మనం చూస్తాం just dail కూడా అంటే వాళ్ళ వ్యాపారం వినియోగదారుల నుండి వివరాలను సేకరించి ఎవరైతే సేవలు అందిస్తున్నారో వారికే అమ్ముతుంటారు. కానీ ఈ లీడ్స్ ని ఉచితంగా ఇవ్వరు వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి 10000 కావచ్చు 30000 కావచ్చు మీరు ఇచ్చిన డబ్బుని బట్టి వాళ్ళు లీడ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి Leadsales కూడా ఒక ఆదాయ వనరుగా చెప్పగలుగుతా.
ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడానికి మీకు నేను కొన్ని మార్గాలు చెప్పాను యీ ఆర్టికల్ ద్వారా. ఒకవేళ మీరు డబ్బుని ఆన్లైన్ ద్వారా సంపాదించాలనుకుంటే. అయితే మీకు బ్లాగ్ గనుక ఉండగలిగితే ఇంకా బాగా చేసుకోగలరు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోగలిగితే వాటి సేవలను మీరు ఇస్తూ డబ్బుని సంపాదించ వచ్చు.
అయితే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మేము కొద్ది రోజుల క్రితమే మేము ప్రవేశపెట్టాము. మీరు గనుక నేర్చుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఒకవేళ మీకు ఎక్కువ వివరాలు కావాలనుకుంటే ఆ వివరాలు కూడా మేము మీకు ఇస్తాం. మా కాంటాక్ట్ :- 9573439404 & వాట్సాప్ కూడా. ఇది కాకుండా మీరు మాకు ఇమెయిల్ కూడా చేయ వచ్చు. ఇమెయిల్ id : [email protected]