డిజిట‌ల్ బ‌డి తెలుగు బ్లాగింగ్ కోర్సు రివ్యూ

డిజిట‌ల్ బ‌డి తెలుగు బ్లాగింగ్ కోర్సు రివ్యూ

హాయ్, నా పేరు ఉదయ్ తాటి. నేను బ్లాగింగ్ చేయ‌డానికి గల కారణాలు మరియు బ్లాగింగ్ చేయ‌డానికి సహకరించిన అన్ని విషయాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా మీకు వివ‌రిస్తాను.

నాకు అసలు బ్లాగింగ్ చెయ్యాలని ఆలోచన రావడానికి గల కారణాలు:

నేను ఎక్కువగా ఆన్లైన్ లో సమయాన్ని గడిపేవాడిని.  రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేవాడిని. అప్పుడు నాకు బ్లాగింగ్ అంటే అసలు ఏమి తెలియదు. ఆన్లైన్ లో జాబ్ చేయాలి అనే చిన్న కోరిక నాకు కలిగింది.

  1. దానికోసం ప్రతిరోజు ఆన్లైన్లో ఎలా జాబ్ చేయాలి?
  2. ఏ విధమైన జాబ్స్ మనకు దొరుకుతాయి?
  3. అసలు నాకున్న స్కిల్స్ ఏంటి?

అనే ప్ర‌శ్న‌ల‌తో జాబ్స్ వెతికేవాన్ని

ఆన్లైన్ లో జాబ్స్  చాలావరకు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాదు

చాలామంది మోసపోయాక వాళ్లకు జరిగిన అనుభవాన్ని మనకు తెలియ‌జేస్తారు. అలాంటి ఆర్టికల్స్ అన్ని చదివి అసలు నిజంగా ఎటువంటి మోసం లేకుండా ఆన్లైన్ లో జాబ్స్ ఎలా చెయ్యాలి అనే విషయాన్నీ తెలుసుకున్నాను. జీవితంలో సూపర్ హీరో కావాలి అని చిన్నపాటి హీరో కూడా కాకుండా జీరో లా చాలామంది మిగిలిపోతున్నారు.  దానికి గల కారణం మనకంటూ ఒక దారిచూపించే గురువు లేకపోవడం.

సరైన నిర్ణయాలు తీసుకోనే అంత తెలివి లేకపోవడం

కానీ ప్రస్తుతం మనకు అటువంటి స‌మ‌స్య‌లు  లేవు

మన తెలుగులో మంచి మంచి గురువులే ఉన్నారు

తమకున్న తెలివితేటలను తమతోనే ఆగిపోకుండా ఇతరులకు తమ తెలివితేటలను ఆన్‌లైన్‌ కోర్సుల ద్వారా పంచుతూ తమతో పాటు ఇతరులు కూడా గొప్పవాళ్ళు కావాలి అనే ఉద్దేశంతో మన డిజిటల్ జాన్  డిజిట‌ల్ బ‌డి అనే తెలుగు ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించాడు. జాన్  ప్ర‌స్తుతం డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ గా బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నారు.

యూట్యూబ్ మరియు బ్లాగ్స్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ మరియు బ్లాగింగ్ ను ఫ్రీ గా అందిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ మేనేజ‌ర్‌గా ఉద్యోగం చేస్తూనే, అంత వర్క్ బిజీ లో ఉన్నా, మన తెలుగు వారి కోసం కొంత సమయాన్ని కేటాయించి యూట్యూబ్ మరియు బ్లాగ్స్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ మరియు బ్లాగింగ్‌ని ఆన్‌లైన్ కోర్సుల ద్వారా నేర్పిస్తున్నారు. జాన్ చెప్పిన విధంగా నేర్చుకుంటే డిజిట‌ల్ మార్కెటింగ్ రంగంలో మంచి ఇంట‌ర్న్‌ష‌ప్ /ఉద్యోగ అవ‌కాశాలు కూడా వ‌స్తాయి.

Earn Money Online by Blogging – Digital Badi

ఇంట‌ర్‌నెట్లో దొరికే కాన్‌టెంట్ ఎక్కువ శాతం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. తెలుగులో తెలుగు వారికోసం ఇలా నేర్పించండం అనేది ఒక మంచి కార్య‌క్ర‌మం అని చెప్ప‌వ‌చ్చు. ప్రతి ఒక్క విషయాన్ని మన తెలుగులో నేర్పిస్తూ మన తెలుగుకి అంటూ ఒక గుర్తింపుని ఇంటర్నెట్ లో తీసుకువచ్చారు.

మన తెలుగుకి ఇంటర్ నెట్ లో ఇంకొక 5 సంవత్సరాలలో చాలా డిమాండ్ పెరగబోతుంది

మన తెలుగులో కాన్‌టెంట్ ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు చాలా తక్కువ. తెలుగులో కాన్‌టెంట్‌ని కావాలి అనుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది అని గూగుల్ తెలియ‌జేస్తుంది. గూగుల్ మన తెలుగు భాషలో రాసిన బ్లాగ్స్ కి కూడా యాడ్‌సెన్స్ అప్రూవ‌ల్ ఇస్తుంది.యీ విష‌యాన్ని డిజిట‌ల్ జాన్ ఏనాడో త‌న యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా తెలియ‌జేసి, తెలుగులో బ్లాగింగ్ చేస్తున్న‌వారిని ప్రోత్సహించాడు.

ప్రస్తుత కాలంలో ఏ చిన్న  విషయం అయినా, సోషల్ మీడియాలో ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో మీకు తెలుసు. అంత పవర్ ఉన్న సోషల్ మీడియాస్ ను ఉపయోగించి  ఎన్నో అద్భుతాలను చేయవచ్చు. మనం ఉదయాన్నే లేవగానే ఉపయోగించే టూత్ పేస్ట్ దగ్గర నుండి నైట్ వేసుకునే లైట్ వరకు ఒకరు మనకు చెప్పినవే అది డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్నెట్ కి వున్నా పవర్. ఇదంతా చెప్పుకుంటూ వెళితే ఎక్కడికో వెళుతుంది కానీ అసలు విషయానికి వస్తే.

ఆన్‌లైన్ అన్వేష‌ణ‌

నేను కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్ లో  నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను మన మాతృ భాషలో ఆర్టికల్ రూపంలో రాసి తెలియచేయాలనుకున్న. కానీ బ్లాగింగ్ చెయ్యడం నాకు రాదు.

అలా నేను బ్లాగింగ్ చేయ‌డానికి కోర్స్ కోసం వెతుకుతున్నపుడు యూట్యూబ్ లో డిజిటల్ మార్కెటింగ్ గురించి వీడియోస్ మన తెలుగులో ఉండటం చూసా. మన తెలుగునే కదా ఒకసారి చూస్తే అసలేంటో తెలుస్తుంది అని ఆలా కొన్ని వీడియోస్ చూసా, క్లాసెస్ చాల సులువుగా అర్థం అవుతున్నాయి. అలా వీడియోస్ చూస్తుండగా నాకు కావలసిన బ్లాగింగ్ కోర్సు గురించి జాన్  ఫ్రీ వీడియో కోర్స్ పెట్టారు. అంతే ఇక, అప్పటినుండి నేను ఆగలేదు.

ప్రతిరోజు బ్లాగింగ్ గురించి నేర్చుకుంటూ ఉన్న ఒక సంవత్సరం పాటు బ్లాగింగ్ గురించి పూర్తి వివరాలు నేర్చుకున్న. ప్రస్తుతం బ్లాగ్ నిర్వహిస్తున్న.

డొమైన్ తీసికోడం దగ్గర నుండి బ్లాగ్ నిర్వహించడంలో ఎటువంటి సందేహం వచ్చిన డిజిట‌ల్ జాన్‌ని అడిగేవాడిని. జాన్‌ ఎంత బిజీగా వున్నా వాట్సాప్ లో సమాధానాన్ని ఇచ్చేవారు. బ్లాగింగ్ కోర్సు స్టూడెంట్స్‌కి అత‌ను ఇచ్చే స‌పోర్టు అద్భుతం. డ‌బ్బులు క‌ట్టి కొనుక్కున్న బ్లాగింగ్ కోర్సుల‌కు స‌పోర్టు ఇవ్వ‌డం లేదు. రుజువు కావాల‌నుకుంటే మీరే ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవ‌చ్చు. 

ప్రతి శుక్రవారం సాయంత్రం 9 గంట‌ల‌కు యూట్యూబ్ లైవ్ చేస్తారు. ఆ లైవ్ లో అడిగిన సందేహాలను సమాధానం ఇచ్చేవారు.

మన తెలుగు లో డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎక్కువ వీడీయోలు చేసింది మన డిజిట‌ల్ జానే. 

అంతేకాకుండా సార్ మల్టి టాలెంటెడ్ . ఏ ప్రశ్నఅడిగిన లైవ్ లోసమాధానం ఇచ్చేవారు. ఏ కోర్స్ నేర్చుకుంటే మార్కెట్ లో మనకంటూ ఒక గుర్తింపు ఉంటుందో ,ఆ కోర్సులను సిద్ధం చేసి ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నారు.

ఫ్రీ గా ఇస్తే కోర్స్  విలువ‌ అర్థం కాదు అనే ఉదేశ్యం తో చిన్నపాటి అమౌంట్ తో కోర్స్ ను అందిస్తున్నారు.

కోర్సును కొనే ఆర్థిక స్థోమ‌త లేని వాళ్ళు Johnని అడిగితే చాల తక్కువ మొత్తానికే కోర్స్ ను అందచేస్తారు. ఇది ప‌రోక్షంగా స్కాల‌ర్‌షిప్ లాగా విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

నేను బ్లాగింగ్ చెయ్యడానికి John కోర్సు లేకపోతే ఇంకా చాలా సమయం పట్టి ఉండేది.  తెలుగు లో బ్లాగింగ్‌ చెయ్యొచ్చా అనే దగ్గరే ఆగిపోయే వాడిని

John కోర్స్ ద్వారా బ్లాగింగ్ అంటే ఏమిటి అనే స్టేజ్ నుండి బ్లాగింగ్ అంటే ఏమిటి అని అడిగే వాళ్లకు బ్లాగింగ్ అంటే ఇది  సంగతి అని చెప్పే స్టేజి వరకు వచ్చాను. బ్లాగింగ్ లో ఒక స్టేజి కి వచ్చాక డిజిటల్ మార్కెటింగ్ కూడా సర్ కోర్స్ నే ఫాలో అవుతా. 

బ్లాగింగ్ గురించి నన్ను అడిగితే సులభంగా చెప్పగలను. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకుంటాను డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది అని చెప్పే స్టేజి కి వెళతాను.

అంత నమ్మకమా అంటే అవును అనే చెప్తాను. Digital John  కోర్స్ ఉందిగా, అదే నా పవర్.

డిజిటల్ మార్కెటింగ్ కి చాలా మంచి లైఫ్ వుంది. దానికోసం బ్లాగింగ్ చెయ్యడం రావాలి అని John యూట్యూబ్ వీడీయోస్ చూసినపుడు మొదటగా నేను ఎలాగో బ్లాగింగ్ చెయ్యాలి అనుకున్న, John అదే చెప్పారు బ్లాగింగ్ పూర్తి చేసాక డిజిటల్ మార్కెటింగ్ లో జాయిన్ అవ్వొచ్చని మొదటగా బ్లాగింగ్ ను నేర్చుకున్నాను.

డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అయినా ఏ మాత్రం గర్వం లేకుండా ఎవరైనా సార్‌ అంటే, పర్లేదు బ్రో అంటే సరిపోతుంది అనే వారు.

మన జాన్, యూజర్స్ ని పరాయి వాళ్ళలా కాకుండా తమ్ముళ్ళలా చూస్తారు.

నిజామా? ఓవర్ గా చెప్తున్నావ్‌ అనే డౌట్ రావొచ్చు! తప్పులేదు. మీరే కోర్స్ ఫాలో అవండి, మాట్లాడి చూడండి మీకే అర్థమవుతుంది.

జాన్ సర్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ఇవన్నీ చెప్పవలసిన అవ‌స‌రం లేదు కానీ మన తెలుగు వాళ్ళు డిజిటల్ గా వెనుకపడకూడదు.

ఇంకా నిరుద్యోగులుగా, బద్దకస్తులుగా,  ఉండిపోకూడదు అని తన వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. విద్యార్థుల‌కు కావ‌ల‌సినంత ప్రోత్సాహాన్ని, స్పూర్థిని ఇస్తున్నాడు

John నాకు అందించిన జ్ఞానాన్ని నాతో ఆగిపోకుండా చాలా మందికి చేరవేస్తాను.

నేనూ నా బ్లాగ్ ద్వారా అందరిని మోటివేట్ చేస్తాను.

Written between 1-3 AM

బ్లాగింగ్ కోర్సుపై ఏవైనా సందేహాలు ఉంటే డిజిట‌ల్ జాన్‌ని వాట్సాప్ లేదా ఇమెయిల్ ద్వారా సంప్ర‌దించండి. కోర్సు మొద‌టి బ్యాచ్ మే 1, 2019 కి ప్రారంభ‌మైంది. ప్ర‌తి నెల ఒక బ్యాచ్‌ని ప్రారంభిస్తున్నాము. కోర్సులో చేరే ఆస‌క్తి ఉంటే మీరు చేర‌వ‌చ్చు.

Contact us to learn blogging course in Telugu

[mailerlite_form form_id=2]
Written by
Digital John
Join the discussion

Please note

This is a widgetized sidebar area and you can place any widget here, as you would with the classic WordPress sidebar.

Are You Interested to Learn Digital Marketing?

We are Here to Help You

Fill this Form, We Will Guide You