Connect with us

Telugu Blogs

డిజిటల్ మార్కెటర్ కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి?

Published

on

skills to become a digital marketer

ఒక డిజిటల్ మార్కెటర్ కి ఉండాల్సిన నైపుణ్యాలు ఏంటి అనేది మనము యీ ఆర్టికల్ లో చూద్దాం.

1. కాపీరైటింగ్ స్కిల్స్

డిజిట‌ల్ మార్కెటింగ్‌లో కంటెంట్ మార్కెటింగ్ చాలా కీల‌క‌మైన విభాగం. కంటెంట్ ఏ ఫార్మాట్‌లో ఉన్న‌ప్ప‌టికీ, ముందు వ్రాత‌పూర్వ‌కంగా దాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఉదాహార‌ణ‌కు ఒక సినిమా తీయాల‌నుకున్నా స‌రే, ముందు క‌థ సిద్ధం అవ్వాలి. అంటే, వీడియో ఫార్మాట్‌లో ఉండే కంటెంట్, ముందు లిఖిత‌పూర్వ‌కంగా ఉండాల్సి ఉంటుంది. ఒక సినిమా ద‌ర్శ‌కుడికి క‌థ ప‌ట్ల ఎంత గ్రిప్ ఉంటే అంత మంచిది. అలాగే డిజిట‌ల్ మార్కెటింగ్‌లో కూడా కంటెంట్ మార్కెటింగ్‌లో ముందు రాయ‌గ‌ల‌గాలి. బ్లాగ్‌ల రూపంలో, ఇమేజ్‌, వీడియో, ఇన్‌పోగ్రాఫిక్‌, ఆడియో, ఈ బుక్స్, ఇలా మొద‌లైన ఫార్మాట్‌ల‌లో కంటెంట్‌ ఉంటుంది.

ఏ కంటెంట్‌ సిద్ధం చేయాల‌న్నా స‌రే ముందు కంటెంట్‌ని లిఖిత పూర్వ‌కంగా రాయాల్సి ఉంటుంద‌ని మ‌ర్చిపోవ‌ద్దు.

కంటెంట్ మార్కెటింగ్ స‌రిగ్గా చేయ‌గ‌లిగితే ఆన్‌లైన్ ఆడ్వ‌ర్‌టైసింగ్‌కి కావాల్సిన ఆడ్ కాపీల‌ను కూడా స‌మ‌ర్థ‌వంతంగా సిద్ధం చేయ‌గ‌ల‌రు. డిజిట‌ల్ మార్కెటింగ్‌లో ఎక్కువ ఉద్యోగ అవ‌కాశాలు ఉండేది కంటెంట్ మార్కెటింగ్ విభాగంలోనే.

కాపీ రైటింగ్ మంచిగా నేర్చుకోవాల‌నుకుంటే జోస‌ప్ షుగ‌ర్‌మెన్ రాసిన పుస్తకాన్ని చ‌ద‌వండి. మేము కాపీ రైటింగ్ నేర్చుకున్న‌ది కూడా యీ పుస్త‌కం ద్వారానే

టిప్: కంటెంట్ మార్కెటింగ్ నేర్చుకోవాల‌నుకుంటే రాయ‌డం ప్రారంభించాలి.

2. వార్డుప్రెస్

ఇక్క‌డ వార్డుప్రెస్ అంటే కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ (CMS) అని అర్థం. కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్స్ చాలానే ఉన్న‌ప్ప‌టికీ, ఎక్కువ వాడుక‌లో ఉన్న‌ది వార్డుప్రెసు మాత్ర‌మే. ఇంట‌ర్నెట్‌లో ఉండే వెబ్‌సైట్లు, బ్లాగులు 30% వార్డుప్రెసులోనే ఉంటాయంటే అతిశ‌య‌యోక్తి కాదు. త‌ర్వాత స్థానాల్లో జూమ్లా, డ్రూపాల్‌, గోస్ట్ ఇలా వేరే కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్స్ (CMS lu) ఉన్న‌యి. ఒక్క వార్డుప్రెస్ నేర్చుకున్నా స‌రే మీకు చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

టిప్: వార్డుప్రెస్ నేర్చుకోవాల‌నుకుంటే సొంతంగా ఒక బ్లాగ్‌ను ప్రారంభించి నేర్చుకోవాలి

3. గ్రాఫిక్ డిజైనింగ్

గ్రాఫిక్ డిజైనింగ్ పై ప్రాథ‌మిక అవ‌గాహ‌న ఉండాల్సి ఉంటుంది. కంటెంట్‌ని విజువ‌ల్‌గా ప్రెసెంట్ చేయాలంటే గ్రాఫిక్ డిజైనింగ్ త‌ప్ప‌నిస‌రి. ఇన్‌ఫో గ్రాఫిక్స్‌, బ్యాన‌ర్ ఆడ్స్, జిఫ్ ఇమేజ్, ఇలా చాలా చోట్ల గ్రాఫిక్ డిజైనింగ్ అవ‌స‌రం ఉంటుంది. గ్రాఫిక్ డిజైనింగ్ గురించి ఏమి తెలియ‌దు అనుకునే వాళ్లు, కాన్వా లాంటి టూల్స్‌తో సుల‌భంగా వేగంగా డిజైనింగ్ చేయొచ్చు. కానీ, ఫోటోషాప్ నేర్చుకుంటే మీకు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. గ్రాఫిక్ డిజైనింగ్ లో మీరు మఖ్యంగా నేర్చుకోవాల్సిన‌వి, క‌ల‌ర్‌, ఫాంట్‌, త‌ర‌చూ వాడే బ్యాన‌ర్‌ల సైజులు, అయికాన్స్.

గ్రాఫిక్ డిజైనింగ్‌పై త్వ‌ర‌లో డిజిట‌ల్ బ‌డిలో ఒక కోర్సును ప్రారంభిస్తున్నాము. నేర్చుకోవాల‌నుకునే వారు డిజిట‌ల్ బ‌డిని సంప్ర‌దించండి.

టిప్: గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవ‌డం ప్రారంభించండి

4. డేటా విశ్లేషణ (డేటా ఎనాలిసిస్)

డిజిట‌ల్ మార్కెటింగ్ లో మీరు చేసే ప్ర‌తి ప‌నిని విశ్లేషించాలంటే మీకు మంచి అనాల‌టిక‌ల్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. క్యాంపెన్ అనాల‌సిస్‌, మెట్రిక్స్ మ‌రియు క‌న్‌వ‌ర్ష‌న్‌ల గురించి మీకు తెలియాలంటే ఖ‌చ్చితంగా కొంత ఆప్టిట్యూడ్ స్కిల్స్ ఉండాల్సిందే. అడ్వాన్స్‌డ్ మైక్రోసాప్ట్ ఎక్సెల్ గ‌నుక మీకు తెలిస్తే మీకు యీ ప‌ని చాలా సుల‌భం. గూగుల్ అనాల‌టిక్స్ కోర్సును నేర్చుకోండి. డిజిట‌ల్ మార్కెటింగ్‌లో దీన్ని అత్యంత కీల‌క‌మైన స్కిల్‌గా ప‌రిగ‌ణిస్తారు. దీని యొక్క ప్రాముఖ్య‌తను దృష్టిలో ఉంచుకొని డిజిట‌ల్ బ‌డి అందిస్తున్న డిజిట‌ల్ మార్కెటింగ్ కోర్సులో అడ్వాన్స్‌డ్ మైక్రోసాప్ట్ ఎక్సెల్ కోసం ప్ర‌త్యేకంగా ఒక మాడ్యూల్‌ని కేటాయించండం విశేషం.

టిప్: ఒక బ్లాగ్‌ని ప్రారంభించి గూగుల్ అనాల‌టిక్స్‌ని ఇంటిగ్రేట్ చేసి గూగుల్ అనాల‌టిక్స్ నేర్చుకోండి

5. ఎప్పుడూ నేర్చుకునే తత్వం

డిజిట‌ల్ మార్కెటింగ్ అనేది డైన‌మిక్ రంగం. అంటే ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూ ఉంటుంది. కొత్త విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నేర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే నిరంతంర విద్యార్థిగా మారాల్సి ఉంటుంది.

టిప్: డిజిట‌ల్ మార్కెటింగ్‌లో ఉన్న టాప్ బ్లాగ్‌ల‌ను ఫాలో అవ్వాలి.

6. టెక్నికల్ స్కిల్స్

డిజిట‌ల్ మార్కెటింగ్ కి టెక్నిక‌ల్ స్కిల్స్ త‌ప్ప‌నిస‌రి. ఎందుకంటే, మీరు ఏ ప‌ని చేసినా అది టెక్నాల‌జీతో ముడిప‌డి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు, వెబ్‌సైట్ డెవ‌ల‌ప్‌మెంట్ చేయాల‌నుకుంటే మీకు క‌నీసం వెబ్‌సైట్ టెక్నాల‌జీల (వార్డుప్రెస్‌, హెచ్‌టీఎంఎల్‌, సీఎస్ఎస్‌) గురించి ప్రాథ‌మిక అవ‌గాహ‌న ఉండాల్సి ఉంటుంది.

7. ముగింపు

ఇప్ప‌టివ‌ర‌కు వివ‌రించిన ముఖ్య‌మైన స్కిల్స్ ని ప్రాక్టిక‌ల్‌గా నేర్చుకోవ‌డం కోసం తెలుగులో ఒక మంచి ఆన్‌లైన్ కోర్సును డిజిట‌ల్ బ‌డి టీమ్ రూపొందించింది. డిజిట‌ల్ మార్కెటింగ్ కోర్సును నేర్చుకోవాల‌ని అనుకునే వారు డిజిట‌ల్ బ‌డి టీంని సంప్ర‌దించండి.

తెలుగులో డిజిట‌ల్ మార్కెటింగ్‌పై ఇంకా ఆర్టిక‌ల్స్‌ని, బుక్స్‌, కోర్సుల‌ను సిద్ధం చేస్తున్నాం. వాటి అప్‌డేట్స్ కోసం మా బ్లాగ్‌కి మ‌ర‌లా సంద‌ర్శించండి.

Contact us to learn digital marketing course in Telugu

డిజిటల్ బడి న్యూస్ లెటర్

డిజిటల్ బడి యొక్క అప్ డేట్స్, కోర్స్ ఆఫర్స్, డిజిటల్ మార్కెటింగ్ టిప్స్, యూట్యూబ్ లైవ్ అప్ డేట్స్ పొందడానికి ఇప్పుడే డిజిటల్ బడి న్యూస్ లెటర్ లో చేరండి.

Please wait...

Thank you for sign up!

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Blogs

డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఎలా ?

Published

on

ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ జాబుల్లో డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. కానీ, డిజిటల్ మార్కెటింగ్ ఏలా నేర్చుకోవాలి?  ఇంటెర్నెట్ లొ  నేర్చుకోవాలా? లేదా ఒక ఇన్స్టిట్యూట్లో చేరి క్లాస్ రూమ్ ట్రైనింగ్ తీసుకోవాలా? అసలు నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవొచ్చా ? డిజిటల్ మార్కెటింగ్ లో ఉద్యోగ అవకాశాలు ఎలా వున్నాయి?  ఇలా అనేక ప్రశ్నలు మనకు వస్తుంటాయి, ఈ పోస్ట్ ద్వారా మీ ప్రశ్నల్ని నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను . పోస్ట్ ను చివరి వరకు చదవండి

1. ముందుగా మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం

ఒక కంపెనీ యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి వినియోగదారుడికి తెలియజేయడం.  దిన పత్రికల్లో ఇచ్చే యాడ్స్ , టీవీ యాడ్స్, రేడియో యాడ్స్, బిల్ బోర్డ్స్, హోర్డింగ్స్, ఇలా మొదలైన వాటి ద్వారా కంపెనీలు మార్కెటింగ్ చేస్తాయి . ప్రజలు టీవీ చూస్తున్నారు కాబట్టి టీవీ లో యాడ్స్ ఇస్తున్నారు.  కానీ, ప్రస్తుతం ఎక్కువ శాతం ప్రజలు తమ సమయాన్ని ఇంటర్నెట్ లో గడుపుతున్నారు.

2. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి ?

సింపుల్ గ చెప్పాలంటే ఇంటర్నెట్ ద్వారా మార్కెటింగ్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్.

3. డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి ?

ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు ఇస్తున్న సలహా ఏంటి అంటే, ఒక సొంత బ్లాగ్ ని తయారు చేసి డిజిటల్ మార్కెటింగ్ కు సంబంధించిన అన్ని విషయాలు బ్లాగ్ పై ప్రయోగించి నేర్చుకోవడం. దీని కోసం ఒక వెబ్ సైట్ పేరు కొనుక్కొని హోస్టింగ్ కొనుక్కుంటే చాలు. 1000 రూపాయలతో ఒక మంచి బ్లాగ్ ను తయారు చేసుకోవొచ్చు.

4. డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ నేర్చుకోవాలి ?

A. ఇంటర్నెట్ లో

డిజిటల్ మార్కెటింగ్ పై  ఇంటర్నెట్ లో చాలా కోర్స్ లు ఉన్నాయ్. విదేశీ మరియు స్వదేశీ యూనివర్సిటీలు మరియు కాలేజీలు సైతం ఈ కోర్స్ ను ఇంటర్నెట్ ద్వారా అందిస్తున్నాయి. కాకపొతే ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఫ్రీ కోర్స్ లు కూడా వున్నాయి కానీ అవి అరకొర సిలబస్ తో వున్నాయి.  తక్కువ ఖర్చుతో నాణ్యమైన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ను అందించడానికి డిజిటల్ బడిని ప్రారంభించాము.

B. క్లాస్ రూమ్ ట్రైనింగ్

కొన్ని ఇన్స్టిట్యూట్ లు ఆన్లైన్ మరియు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ను అందిస్తున్నాయి. క్లాస్ రూమ్ ట్రైనింగ్ మరియు ఆన్లైన్ కోచింగ్ , ప్రస్తుతం ఈ రెండు ఖర్చుతో కూడుకున్నవే అని చెప్పాలి. ఎందుకంటే, వీరు ఎంత లేదనుకున్న, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోసం 30000 రూపాయల నుండి 70000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. అన్ని ఫీజు లపై 18% జి ఎస్ టి ఉంటుందని మర్చిపోకండి. డబ్బు సమస్య కాదనుకుంటే మంచి ఇన్స్టిట్యూట్ లో చేరి కోర్స్ నేర్చుకోవడం మంచిదే. ఇన్స్టిట్యూట్ ను ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్త.

5. నేను డిజిటల్ మార్కెటింగ్ ను నేర్చుకోవొచ్చా?

ఖచ్చితంగా నేర్చుకోవొచ్చు. మార్కెటింగ్ మరియు కాస్త ఐటీ స్కిల్స్ ఉంటే చాలు. అవి లేకపోయినా సరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటూనే కూడా నేర్చుకొవొచ్చు. మీకు ఒక మంచి మెంటర్ ఉంటే వేగంగా మరియు సులువుగా నేర్చుకోవొచ్చు. డిజిటల్ బడి ద్వారా మంచి కార్పొరేట్ మెంటోర్షిప్ ని అందిస్తున్నాము. డిజిటల్ బడి యొక్క డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ పై ఆసక్తి ఉంటె తెలియజేయండి.

6. డిజిటల్ మార్కెటింగ్ లో ఉద్యోగ అవకాశాలు

డిజిటల్ మార్కెటింగ్ రంగానికి కొత్తగా ప్రవేశించాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. ప్రస్తుతం డిజిటల్ మార్కెటర్స్ కి ఎప్పుడు లేనంత డిమాండ్ ఉంది. నిరుద్యోగులను ప్రస్తుతం ఈ రంగం ఆకర్షింస్తుందనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇటీవలే డిజిటల్ మార్కెటర్స్ కు ఉండే డిమాండ్ పై టైమ్స్ అఫ్ ఇండియా లో ఒక బ్లాగ్ ని ప్రచురించారు. వీలయితే చదవండి.

7. డిజిటల్ బడి

A. డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ సిలబస్

1.Essentials of Marketing
2.Essentials of Blogging
3.Essentials of Digital Marketing
4.Essentials of E-mail Marketing
5.Essentials of Search Engine Optimization (SEO)
6.Essentials of Search Engine Marketing (Google Ads)
7.Essentials of Social Media Marketing
8.Essentials of Marketing Automation
9.Essentials of Web Analytics
10.Essentials of Microsoft Excel for Digital Marketing

Contact Us to learn digital marketing course in Telugu

డిజిటల్ బడి న్యూస్ లెటర్

డిజిటల్ బడి యొక్క అప్ డేట్స్, కోర్స్ ఆఫర్స్, డిజిటల్ మార్కెటింగ్ టిప్స్, యూట్యూబ్ లైవ్ అప్ డేట్స్ పొందడానికి ఇప్పుడే డిజిటల్ బడి న్యూస్ లెటర్ లో చేరండి.

Please wait...

Thank you for sign up!

Continue Reading

Telugu Blogs

ఇమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి?

Published

on

డిజిట‌ల్ మార్కెటింగ్‌లో త‌క్కువ అంచ‌నా వేసే విభాగం ఏదైనా ఉందా అంటే అది ఇమెయిల్ మార్కెటింగే అని చెప్పొచ్చు.

అత్య‌ధిక రిట‌ర్న్ ఆన్ ఇన్‌వెస్ట్‌మెంట్ ఇచ్చే ఇమెయిల్ మార్కెటింగ్‌పై డిజిట‌ల్ బ‌డి ప్ర‌త్యేక క‌థ‌నం.

1. ఇమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి?

సింపుల్‌గా చెప్పాలంటే ఇమెయిల్స్ పంప‌డం. ఒక ఇమెయిల్ ఐడీ నుండి కొంత మందికి ఏదైనా స‌మాచారాన్ని పంపాల‌నుకుంటే మ‌నం జీమెయిల్ వాడ‌తాం. కానీ, ఒకే ఇమెయిల్ ఐడీ నుండి వేల‌, ల‌క్ష‌ల ఇమెయిల్ ఐడీల‌కు స‌మాచారాన్ని ఒకేసారి పంపాలంటే ఒక్క జీమెయిల్ ఐడీతో
పంప‌డం సాధ్యం కాదు. అందుకోసం ప్ర‌త్యేక టూల్స్‌ని వాడ‌డం జ‌రుగుతుంది. అలా టూల్స్ వాడుతూ పంపితే అది ఇమెయిల్ మార్కెటింగ్‌. అయితే, ఎవ‌రికి ఇమెయిల్స్ పంపాలి, ఎందుకు పంపాలి, ఇమెయిల్ మార్కెటింగ్‌ని ఎలా చేయాలి అనేది మ‌నం చూద్దాం.

2. ఇమెయిల్ ఇంత ఇంపార్టెంటా?

డిజిట‌ల్ మార్కెటింగ్‌కి ఇమెయిల్ ఐడీ చాలా అవ‌స‌రం. అందుకే మీరు ఆన్‌లైన్‌లో ఎక్క‌డికైనా వెళ్ళండి, మీరు మీ ఇమెయిల్ ఐడీని స‌మ‌ర్పించాల్సిందే. ఏ వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ అవ్వాల‌నుకున్నా మీ ఇమెయిల్ ఐడీ అడుగుతారు. డిజిట‌ల్ మార్కెటింగ్‌కి ఇమెయిల్ ఐడీ చాలా ఇంపార్టెంట్‌.

3. ఇమెయిల్ ఐడీల‌ను కొనొచ్చా?

ఈ ప్ర‌శ్న న‌న్ను చాలా మంది అడుగుతుంటారు. ఇమెయిల్ ఐడీల‌ను కొనొచ్చా లేదా అనేది. ఎందుకంటే మార్కెట్‌లో చాలా మంది ఇమెయిల్ ఐడీల‌ను అమ్ముతున్నారు. ల‌క్ష ఇమెయిల్ ఐడీల‌ను 5000 రూపాల‌య‌కు కావొచ్చు. ఇలా కొన‌డం ఇమెయిల్ మార్కెటంగ్ చేస్తే అది మీ డొమైన్‌కి అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంది.  కాబ‌ట్టి, ఇమెయిల్ ఐడీల‌ను కొని ఇమెయిల్ మార్కెటింగ్ చేయొద్దు. మరి ఎలా చేయాలి అనేది చూద్దాం.

4. ఇమెయిల్ లిస్ట్ నిర్మించడం

మీకు మీరే సొంత ఇమెయిల్ లిస్ట్‌ని నిర్మించుకోవ‌డం అనేది కొంత స‌మ‌యం ప‌డుతుంది. కానీ ఇది అత్యంత ప్ర‌భావవంతంగా ఉంటుంది అని చెప్పుకోవొచ్చు. క‌న్వ‌ర్ష‌న్ రేట్ కూడా మెరుగ్గా ఉండే అవ‌కాశాలా చాలా ఎక్కువ. ఎందుకంటే వెబ్ సంద‌ర్శ‌కులు వాళ్ళంత‌కు వారే మాకు మీ అప్‌డేట్స్‌ని పంప‌మ‌ని వాళ్ళే మీకు అనుమ‌తి ఇస్తున్న‌ట్టు.

5. ఇమెయిల్ మార్కెటింగ్‌కి వాడే టూల్స్‌

ఇమెయిల్ మార్కెటింగ్‌కి వాడే టూల్స్ మార్కెట్‌లో చాలానే ఉన్న‌ప్ప‌టికీ, మేము ఎక్కువ‌గా వాడే టూల్స్‌ని మీకు ప‌రిచ‌యం చేస్తాం.  ఎక్కువ శాతం మెయిల్ చింప్ అనే టూల్‌ని వాడ‌తారు. మెయిల్ చింప్‌తో పాటు, మేల‌ర్‌లైట్‌, ఏవెబ‌ర్‌, సెండీ, డ్రిప్ ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. మీ ఇమెయిల్ మార్కెటింగ్ యొక్క అవ‌స‌ర‌త‌ను బ‌ట్టి మీరు ఇమెయిల్ మార్కెటింగ్ టూల్‌ని ఎంచుకొని మీరు వాడాల్సి ఉంటుంది. డిజిట‌ల్ బ‌డి అందిస్తున్న ఇమెయిల్ మార్కెటింగ్ కోర్సులో ఇమెయిల్ మార్కెటింగ్‌ని కూడా చేర్చ‌డం జ‌రిగింది. మీరు ఇమెయిల్ మార్కెటింగ్ నేర్చుకోవాల‌నుకుంటే డిజిట‌ల్ బ‌డిని సంప్ర‌దించండి.

డిజిటల్ బడి న్యూస్ లెటర్

డిజిటల్ బడి యొక్క అప్ డేట్స్, కోర్స్ ఆఫర్స్, డిజిటల్ మార్కెటింగ్ టిప్స్, యూట్యూబ్ లైవ్ అప్ డేట్స్ పొందడానికి ఇప్పుడే డిజిటల్ బడి న్యూస్ లెటర్ లో చేరండి.

Please wait...

Thank you for sign up!

Attend a FREE Demo to Learn Digital Marketing Course in Telugu

Continue Reading

Telugu Blogs

ప్రీలాన్సింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌డం ఎలా?

Published

on

ఆన్‌లైన్‌లో డ‌బ్బులు ఎలా సంపాదించాలి అనేది చాలా మందిలో ఉన్న సందేహం. యీ ఆర్టిక‌ల్‌లో అస‌లు డ‌బ్బులు సంపాదించ‌డానికి గ‌ల కొన్ని ఉత్త‌మ మార్గాల‌ను మీకు తెలియ‌జేస్తాను.

1. ప్రీలాన్సింగ్

ప్రీలాన్సింగ్ అంటే స్వ‌యం ఉపాధి. అవును, ప్రీలాన్సింగ్ ప‌దంలో ప్రీ ఉంది కాబ‌ట్టి ఇది ఉచితం అని అనుకోవ‌ద్దు. ప్రీలాన్సింగ్ అంటే ఏదైనా ఒక ప‌ని నిమిత్తం నియ‌మించుకొని ఆ ప‌నికి ఎంత అయితే ఇవ్వాలో, అంత డ‌బ్బు చెల్లించ‌డం.

ఉదాహ‌ర‌ణ‌కు, మీ ఇంటికి పేయింటింగ్ వేయాలి అనుకోండి, మీరు పేయింట‌ర్‌కి ఉద్యోగం ఇవ్వ‌రు. ఎందుకంటే ఆ ప‌ని కొన్ని రోజుల్లో అయిపోతుంది, త‌రువాత పేయింట‌ర్‌కి ప‌ని ఉండ‌దు. నెల నెల జీతం ఇవ్వ‌డం కూడా వృధా అవుతుంది. అలాంట‌ప్పుడు మీరు పేయింటింగ్ వేయించుకొని ఎంత డ‌బ్బు అయితే ఇవ్వాలో అంత డ‌బ్బు చెల్లిస్తారు. ఇది స‌హ‌జం. ఇక్క‌డ మ‌నం పేయింట‌ర్‌ని ప్రీలాన్స‌ర్ అని అనుకోవ‌చ్చు.

పైన పేర్కొన‌బ‌డిన విధంగా ఏ రీతిగానైతే మీరు మీ పేయింటింగ్ ప‌నిని ఒక పేయింట‌ర్‌కి అప్ప‌గిస్తారో, అదే విధంగా కంపెనీలు కూడా వాళ్ళ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టు ఒక ప్ర‌త్యేక ప‌ని కోసం నియ‌మించుకొని ప‌ని(ప్రాజెక్టు)  పూర్తి అయిన‌ త‌రువాత డ‌బ్బు చెల్లిస్తారు.

ఆన్‌లైన్ ద్వారా చాలా ర‌కాల సేవ‌ల‌ను కంపెనీల‌కు మ‌నం ఇవ్వ‌వ‌చ్చు. వాటిలో నేను ఇప్పుడు డిజిట‌ల్ మార్కెటింగ్‌కి సంబంధించిన సేవ‌ల‌ను ప్ర‌స్తావిస్తున్నాను.

  1. SEO
  2. SEM
  3. Facebook Ads
  4. Social Media Marketing
  5. Content Marketing
  6. Web Development
  7. Graphic Designing
  8. E-mail Marketing
  9. Video Marketing, మొద‌లైన‌వి

మీరు ఏ సేవ‌ల‌ను అయితే ఆన్‌లైన్ ద్వారా ఇస్తూ డ‌బ్బులు సంపాదించాల‌ని అనుకుంటున్నారో, వాటిపై మంచి ప‌ట్టు సాధించాలి. నెపుణ్యం అత్యంత కీల‌కం. మీరు ఒక వేళ లోగో డిజైన్ చేయాల‌నుకుంటే, వృత్తిరీత్యా డిజైన‌ర్లు వాడే సాప్ట్‌వేర్‌ల‌ను నేర్చుకోవాల్సిందే. లోగో డిజైనింగ్‌కి ప్రొపెష‌న‌ల్ డిజైన‌ర్లు పోటోషాప్‌, యిల్లుస్ట్రేట‌ర్ లేదా కోర‌ల్ డ్రా సాప్ట్‌వేర్‌ల‌ను వాడ‌తారు. కేవ‌లం కంపెనీల‌కు లోగోల‌ను మాత్ర‌మే డిజైన్ చేస్తూ కూడ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్న గ్రాఫిక్ డిజైన‌ర్లు చాలా మంది ఉన్నారు.

ఒక‌వేళ మీరు డిజిట‌ల్ మార్కెటింగ్ సేవ‌ల‌ను ఇస్తూ డ‌బ్బులు సంపాదించాలి అనుకుంటే మీరు ముందు డిజిట‌ల్ మార్కెటింగ్‌ని నేర్చుకొని ఉండాలి. డిజిట‌ల్ మార్కెటింగ్ సేవ‌ల‌కు కూడా ప్ర‌స్తుతం భారీ డిమాండ్ ఏర్ప‌డింది మ‌న దేశంలో. దానికి ముఖ్య కార‌ణం ఏంటంటే, వినియోగ‌దారులు ఎక్కువ‌గా ఇంట‌ర్‌నెట్ వాడ‌డం. ప్ర‌స్తుతం మ‌న దేశంలో మంచి డిజిట‌ల్ మార్కెట‌ర్‌లు లేక డిజిట‌ల్ మార్కెట‌ర్‌ల కొర‌త తీవ్రంగా ఉంది. ఇక్క‌డే మంచి నిష్టాతులైన డిజిట‌ల్ మార్కెట‌ర్‌ల‌ను కొన్ని ప‌నుల నిమిత్తం నియ‌మించుకొని ప‌ని చేయాల‌ని కంపెనీలు అనుకుంటున్నాయి. మంచి ప్రీలాన్స‌ర్‌లు కంపెనీల‌కు దొర‌క‌క‌పోతే డిజిట‌ల్ మార్కెటింగ్ ఏజేన్సీల‌కు కంపెనీలు ప‌నులు అప్ప‌గిస్తారు. మంచి మార్కెటింగ్ బ‌డ్జెట్ గ‌నుక ఉంటే ఫుల్ టైం డిజిట‌ల్ మార్కెటింగ్ ఉద్యోగం కూడా కంపెనీలు ఇవ్వ‌వ‌చ్చు.

2. సొంత డిజిట‌ల్ మార్కెటింగ్ ఏజెన్సీ

కేవ‌లం ఫ్రీలాన్స‌ర్‌గానే కాకుండా, డిజిట‌ల్ మార్కెటింగ్ నేర్చుకున్న‌వాళ్ళు సొంతంగా డిజిట‌ల్ మార్కెటింగ్ ఏజెన్సీల‌ను ప్రారంభించి సొంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించ‌వ‌చ్చు. అయితే ఏజెన్సీ స్టార్ట్ చేసే ముందు కొంత ప‌ని అనుభ‌వాన్ని సంపాదించి మార్కెట్‌పై అవ‌గాహ‌న పెంచుకొని స్టార్ట్ చేస్తే మంచిది అని నా అభిప్రాయం.

ఏజెన్సీ కాకుండా మీ సొంత వ్యాపారాన్ని కూడా మీరు ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హించాల‌నుకుంటే కూడా ప్రారంభించ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు హ్యాండ్ బాగ్స్ త‌యారు చేస్తున్నారు అనుకోండి, మీరు త‌యారు చేస్తున్న హ్యాండ్ బాగ్స్‌ని ఆన్‌లైన్ మార్కెటింగ్ చేసుకొని మీకు ఉన్న వ్యాపారాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హించుకోవ‌చ్చు.

మీరు డిజిట‌ల్ మార్కెటింగ్‌లో ప్రీలాన్స‌ర్‌గా రాణించాల‌న్నా, సొంత ఏజెన్సీ స్టార్ట్ చేయాల‌న్నా, ముందు డిజిట‌ల్ మార్కెటింగ్‌ని చ‌క్క‌గా నేర్చుకొని ఉండాలి. డిజిట‌ల్ మార్కెటింగ్‌పై మంచి శిక్ష‌ణ‌ని మేము డిజిట‌ల్ బ‌డి ద్వారా ఆన్‌లైన్‌లో అందిస్తున్నాము. మీరు గ‌నుక డిజిట‌ల్ బ‌డి ద్వారా డిజిట‌ల్ మార్కెటింగ్‌ని నేర్చుకోవాల‌నుకుంటే డిజిట‌ల్ బ‌డిని సంప్ర‌దించండి. డిజిట‌ల్ బ‌డి అందిస్తున్న కోర్సు తెలుగు భాష‌లోనే ఉంటుంది కాబ‌ట్టి మీరు సులువుగా అర్థం చేసుకోవ‌చ్చు.

Contact us to learn digital marketing course in Telugu

డిజిటల్ బడి న్యూస్ లెటర్

డిజిటల్ బడి యొక్క అప్ డేట్స్, కోర్స్ ఆఫర్స్, డిజిటల్ మార్కెటింగ్ టిప్స్, యూట్యూబ్ లైవ్ అప్ డేట్స్ పొందడానికి ఇప్పుడే డిజిటల్ బడి న్యూస్ లెటర్ లో చేరండి.

Please wait...

Thank you for sign up!

Continue Reading

Trending

Career Opportunities in Software Testing Career Opportunities in Software Testing
Software Testing2 months ago

Career Opportunities in Software Testing 2024

Embracing a Future-Proof Career: Why Software Testing is the Way Forward? Introduction: Career Opportunities in Software Testing In today’s rapidly...

A Beginner's Guide to Migrating Your WordPress Site A Beginner's Guide to Migrating Your WordPress Site
WordPress1 year ago

A Beginner’s Guide to Migrating Your WordPress Site

Beginner’s Guide to Migrating Your WordPress Site As your WordPress site grows and changes over time, you may need to...

A Beginner’s Guide to Managing Users in WordPress A Beginner’s Guide to Managing Users in WordPress
WordPress1 year ago

A Beginner’s Guide to Managing Users in WordPress

Managing Users in WordPress One of the key advantages of using WordPress for your website or application is its built-in...

A Beginner's Guide to Handling Images, Videos, and Media in WordPress A Beginner's Guide to Handling Images, Videos, and Media in WordPress
WordPress1 year ago

A Beginner’s Guide to Handling Images, Videos, and Media in WordPress

Beginner’s Guide to Handling Images,Videos,and Media in WordPress An effective website involves more than just text content. Images, videos, audio...

How to Create an Awesome Blog with WordPress How to Create an Awesome Blog with WordPress
WordPress1 year ago

How to Create an Awesome Blog with WordPress

How to Create an Awesome Blog with WordPress Starting an engaging blog that attracts readers can be challenging. Choosing the...

Building Stunning Websites the Easy Way with WordPress Building Stunning Websites the Easy Way with WordPress
WordPress1 year ago

Building Stunning Websites the Easy Way with WordPress

Building Stunning Websites the Easy Way with WordPress Creating a professional website used to require an understanding of complex web...

WordPress Plugins WordPress Plugins
WordPress1 year ago

Unlocking the Power of WordPress with Plugins

Power of WordPress with Plugins One of the key advantages that makes WordPress the world’s most popular website builder is...

Installing and Customizing WordPress Themes Visually with Page Builders Installing and Customizing WordPress Themes Visually with Page Builders
WordPress1 year ago

Installing and Customizing WordPress Themes Visually with Page Builders

Installing and Customizing WordPress Themes Visually with Page Builders One of the best parts of using WordPress is the ability...

How to Easily Install WordPress in cPanel How to Easily Install WordPress in cPanel
WordPress1 year ago

How to Easily Install WordPress in cPanel

How to Easily Install WordPress in cPanel WordPress is the world’s most popular content management system (CMS), powering over 40%...

What is WordPress What is WordPress
WordPress1 year ago

What is WordPress? A Beginner’s Guide to Understanding the Popular CMS

What is WordPress? A Beginner’s Guide to Understanding the Popular CMS If you spend any time browsing websites, there’s a...

Trending

Are You Interested to Learn Digital Marketing?

We are Here to Help You

Fill this Form, We Will Guide You